Thursday, November 8, 2012

Good Morning - 176


జీవితం లోని ఏ సమస్యా మనం పరిష్కరించుకోలేనంత కష్టమైనది కాదు... హా! నిజమే కదూ..! జీవిత గమనములో ఎదురయ్యే సమస్యలు పెద్ద పెద్ద కొండల్లా కనిపిస్తుంటాయి. అవి అడ్డు ఎలా తొలుగుతాయా అన్న ఆలోచనలతో నానా హైరాన పడుతూ ఉంటాం. సమస్యలని భూతద్దము లోంచి చూస్త్జూ ప్రతిదీ పెద్దగా ఊహించేసుకొని, ఎలా పరిష్కరించాలా అని ఆలోచనలతో ఒక్కోసారి బేలగా మారుతుంటాం. 

కానీ, నిజానికి సమస్యలు చాలా చిన్నవే.. అన్నింటి కన్నా పెద్ద సమస్య మరణం. మనం వద్దనుకున్నా ఎప్పుడోసారి తప్పకవస్తుంది. దాని గురించే పెద్దగా ఆలోచించని మనం, దానికన్నా చిన్నవి అయిన మిగతా సమస్యల గురించి చాలా హైరాన పడుతుంటాము. నిజం చెప్పాలీ అంటే సమస్యలు - ఉల్లిపాయల్లాంటివి. మొదట్లో ఎంతో లావుగా కనిపిస్తుంది. కానీ ఒక్కో పొరా విప్పేస్తున్న కొలదీ చివరిలో అసలు ఉల్లిపాయ ఎంతో కనిపిస్తుంది. సమస్య కూడా అంతే! 

సమస్యని ఒక ముద్దగా, ఆ ముద్దలో ఉండి పరిశీలించకుండా, సమస్యని ఒకసారి ఆమూలాగ్రం పైనుండి గమనించండి. 

ఆ తరవాత ఒక్కోపొర విప్పేస్తూ, విశ్లేషించుకుంటూ వెళ్తుంటే, అసలు సమస్య ఏమిటో, అది ఎలా ఉంటుందో ఒక అవగాహనకి వస్తాం. 

అదే ముద్దగా చూస్తే లేదా ముద్దలో ఉండి చూస్తే, ఆలోచించినదే మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూ, సమస్య పరిష్కార దిశగా వెళ్లడం కాకుండా, సమస్యలోనే గిరికీలు కొడుతూ ఉంటాము. 

అదిగో అప్పుడే సమస్యలు కొండల్లా కనిపిస్తాయి. ఆ కొండలని చూసి మనం బేలగా తయారవుతాం. 

అందుకే ఏ సమస్యనైనా, కాసింత స్థిమితముగా ఉండి, ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉండే పరిసరాలని ఎన్నుకొని, సమస్యని అన్ని వైపుల నుండి ఆలోచించండి.. విశ్లేషించండి. అలా ఆలోచించగా, చించగా.. అసలు సమస్య ఏమిటో తెలుస్తుంది. అది తెలిస్తే సమస్య పరిష్కార దిశలో సగదూరం వచ్చేసినట్లే.. సగం విజయం సాధించినట్లే.

2 comments:

Anonymous said...

chala baga rasthunnaru raj garu..very simple words lo clear ga chebuthunna me sundesulu chala bagunnay...nijunga me lanti snehethudu dorkadum ma adhrushtum...

Raj said...

Thanks a lot my friend..

Related Posts with Thumbnails