Monday, October 15, 2012

Good Morning - 158


గాలిపటం ఎదురు గాలి ఉన్నప్పుడే - పైకి ఎగురుతుంది. ఆ ఎదురుగాలి లేనప్పుడు ఆ పతంగి ఆకాశాన ఎంత ప్రయత్నించినా ఎగరలేదు. మనిషి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. మనం చేసే పనుల వల్ల ఒక్కోసారి / చాలాసార్లు మన మీద విమర్శలు వస్తుంటాయి. అవి వస్తాయి అనుకుంటూ భయపడుతూ ఉంటే, మనం ఇక ఎదగలేము. నిజం చెప్పాలీ అంటే ఈ విమర్శలు మనకి మనం అంటే ఏమిటో, మనం ఎంతగా పరిణితి చెందామో తెలియజేస్తాయి. 

విమర్శలు చేసేవారు ఎప్పుడూ చేస్తూనే ఉంటారు. వారు మన చుట్టూ ఉంటారు కూడా. వారి పని ఎప్పుడూ ఎదోటి అనడమే! వారి మాటలు వినడం మంచిదే! అదీ ఒక స్థాయి వరకే! అది ఎలా అంటే - కొన్ని విమర్శలు మంచే చేస్తాయి. అవతలి వాళ్ళు కొన్ని విషయాల్లో బాగా అనుభవం ఉండి, వారు నీవు చేసిన పనిలో, వ్యక్తిత్వం మీదనో చేసే  విమర్శలు సద్విమర్షలు గా తీసుకోవచ్చును. అదే అందులో అనుభవం లేక ఏదోఒకటి మాట్లాడుతూ, బాగా విమర్శించే వారిని పట్టించుకోవాల్సిన పనిలేదు. 

చాలామంది మనమీద పనికిరాని విమర్శలు చేస్తూనే ఉంటారు. ఒకరకముగా వారి విలువని వారే తెలియచేసుకుంటున్నారు అనుకోవాలి. ఆ పనికిమాలిన విమర్శలని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వారితో  అంత ఆత్మీయతని చూపించాల్సిన అవసరం లేదు.. పరిచయస్తుల వద్దనే వారికి స్థానం ఇవ్వాల్సిందే.. ఇలా విమర్శల వల్ల కొన్ని పనికివచ్చే విషయాలు ఉంటాయి. 

No comments:

Related Posts with Thumbnails