Sunday, July 8, 2012

గిఫ్ట్ కవర్స్ Gift Covers - 13

గిఫ్ట్ కవర్స్ ఎలా చెయ్యాలో, అలా చెయ్యటానికి ఏమేమి అవసరమో, ఎలా ఉంటే బాగుంటుందో అన్నీ వివరముగా తెలుసుకున్నాము కదూ.. ఇప్పుడు ఇందులోని చివరి టాపిక్ ని ఇప్పుడు చెబుతున్నాను.

ఇవి ఖాళీ సమయాల్లో, సెలవు దినాల్లో చేసుకోవటం ఉత్తమం. రోజులన్నీ రొటీన్ అయినప్పుడు, మనకో మంచి మెప్పుకోలు రావాలి అనుకున్నప్పుడు - ఇవి ఈజీగా చేసుకొని ఆనందించవచ్చును. ఆదివారాల్లో పిల్లలు అల్లరి చెయ్యకుండా ఉండటానికి, ఇవి ఎలా చెయ్యాలో నేర్పించండి. వారికీ కాలక్షేపముగా ఉంటుంది. మీకూ కొన్ని గిఫ్ట్ కవర్స్ రెడీగా దొరుకుతాయి. మీ కుటుంబానికి ఒక చక్కని గుర్తింపు దొరుకుతుంది. 

నిజం చెప్పాలీ అంటే - ఈ కవర్స్ చెయ్యటం ఎలాగో ఎవరికీ ఎక్కువ అవసరం అంటే - 
మానసికముగా దెబ్బతిని, ట్రీట్మెంట్ తీసుకుంటున్నవారికి, 
వికలాంగులకి, 
అనాధ శరణాలయలకు, 
క్రియేటివిటీ పెంపొందించుకునే వారికీ.. 

నిజానికి వికలాంగులకీ, అనాధ శరణాలయాలకు ఇలా కవర్స్ చెయ్యటం చాలా మంచి ఉపాధి. అందులోని వారికి ఒక వ్యాపకం కలిగించిన వారిమి అవుతాము, అలాగే వారు చేసిన వాటిని ఒక్కోటి కనీసం పది రూపాయలకి అమ్మినా, పెట్టుబడి : రిబ్బన్ రెండు రూపాయలు, గమ్ అర్ధ రూపాయి అనుకుంటే - ఇంకో ఏడున్నర రూపాయలు లాభం మిగులు. వికలాంగులూ, అనాధలూ అంటూ ఆ సంస్థ తరపున " బ్రాండ్ " చేసి అమ్మితే - పదిహేను రూపాయల వరకూ అమ్మొచ్చు. వారికి సహాయం చేసినట్లు అవుతుందని, చాలా మంది కొనటానికి ఉత్సాహం చూపుతారని అనుకుంటాను. 

మొదట్లో ఇలా కవర్స్ చెయ్యటం, అమ్మటం కష్టమే కావచ్చును. అలాంటి అమ్మకాల వెనక సదుద్దేశ్యం ఏమిటో తెలుసుకున్నాక - మనం అమ్మాలనుకున్న ఎదుటి వ్యక్తి కనీసం ఒక కవర్ అయినా కొంటాడు. అలా సంస్థలూ, కంపనీలలో, మాల్స్ వద్ద కాసింత శ్రమ పడితే అంతా ఈజీనే. 

ఒక పార్టీకి వెళ్ళటానికి ఈరోజుల్లో కనీసం వంద రూపాయలు ఖర్చు చేసుకొని వెళ్ళుతున్న ఈరోజుల్లో మరింత డాబు కోసం - గిఫ్ట్ కవర్ కోసం పది రూపాయలు ఎవరైనా తప్పక వెచ్చిస్తారు. 

ఇక గిఫ్ట్ కవర్స్ శీర్షికన పోస్ట్స్ అన్నీ అయిపోయాయి. త్వరలోనే ఫోటోస్ ఎలా తీయాలో చెప్పే ఒక సీరీస్ పోస్ట్స్ మొదలేడుతాను. 

                                 సర్వేజనా సుఖినోభవంతు.  

No comments:

Related Posts with Thumbnails