Saturday, March 31, 2012

Spam Box

ఇలాంటి పోస్ట్ వ్రాయడం ఇది రెండో'సారీ'.. మొదటిది Mark as Spam(er) ఎవరో కానీ నా బ్లాగ్ విజిట్ చేస్తూ, కామెంట్ పెట్టేవారు. అప్పట్లో ఒక పోస్ట్ ని మాత్రమే టార్గెట్ చేస్తూ, దానికే కామెంట్ పెట్టేవారు. ఆ పోస్ట్ పొరపాటున డిలీట్ అయ్యింది. ఇక అప్పటినుండి ఏదో ఒక పోస్ట్ కి కామెంట్ పెట్టడం చేసేవారు. మొదట్లో కామెంట్ మాడరేషన్ పెట్టేవాడిని కాదు. ఆఖరికి అందరూ కామెంట్స్ పెట్టాలని అనానిమస్ (తమ వివరాలు తెలీకుండా కామెంట్ పెట్టాలని అనుకునేవారు) వారు కూడా కామెంట్ పెట్టాలని అలా సెట్టింగ్ పెట్టాను. ఎందుకూ అంటే - కొన్ని అభిప్రాయాలని వారెవరో తెలీకుండా చెప్పాలనుకున్నవి చెబుతారని. అవి చాలా వరకు మంచివే ఉంటాయి. ఉపయోగకరముగా ఉంటాయని అనుకొని అలా చేశాను. 

అయితే చాలామంది అలా అనానిమస్ కామెంట్స్ పెట్టారు. ఒక కామెంట్ తప్ప మిగిలినవన్నీ పబ్లిష్ చేశాను. అందుకే ఇంకా అనానిమస్ కామెంట్ ఆప్షన్ ని ఇంకా కొనసాగించాను. కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నాను కూడా. 

అయితే మొదట్లో అర్థం కాని భాషలో వీరు ఒక కామెంట్ పెట్టేసరికి అది మొదట్లో డిలీట్ చేశాను. ఆ తరవాత అలాంటి కామెంట్స్ ఎన్నో వచ్చాయి. అన్నీ అర్థం పర్థం లేని కామెంట్స్ అవి. ఏవేవో లింక్స్ ఉన్నవి అవి. ఇంగ్లీష్, రష్యన్ భాషలో ఉన్నాయి అవి. ఇలా కాదనుకొని కామెంట్ మాడరేషన్ సెట్టింగ్ పెట్టాను. అయినా ఇంకా ఆగటం లేదు. ఇంకా వస్తూనే ఉన్నాయి కూడా. అలాంటి కామెంట్స్ ఎన్నింటినో డిలీట్ చేశాను కూడా. ఈ కామెంట్స్ పోస్టింగ్ అంతా హైదరాబాద్ నుండే - అని రెండుసార్లు రేసేంట్ విజిటర్స్ లో చూశాను. 

ఈ సంవత్సరం జనవరి ఒకటిన నా స్పాం బాక్స్ ఖాళీ చేశాను. ఈ సంవత్సరములో ఎన్ని అలాంటి మెయిల్స్ వస్తాయో చూడాలని అనుకున్నాను. ఈ మూడు నెలల్లో 73 (డెబ్బై మూడు) స్పామ్ కామెంట్స్ వచ్చాయి. ఈ సంవత్సరం చివరివరకూ చూస్తే ఎన్ని వస్తాయో చూడాలి. ఆ విషయం అప్పుడు అప్డేట్ చేస్తాను. 

ఆ కామెంట్స్ అన్నీ అర్థం పర్థం అంటూ ఏమీ ఉండవు. ఏదో, ఏవో ఉంటుంది. ఏదో చూడమనీ, ఫారెక్స్ డీలర్ షిప్ గురించీ ఉంటుంది. ఇంకొన్ని బూతుసైట్ల గురించి ఉంటుంది. మీకు అర్థం కావటానికి ఒక కామెంట్ యొక్క స్క్రీన్ షాట్  (తెరపట్టు) ని చూపిస్తున్నాను. చూడండి. అందులోనే వృత్తం లో చూపిన దాంట్లో ఈ సంవత్సరములో ఎన్ని అలాంటి కామెంట్స్ వచ్చాయో కూడా చూడండి. 


చూశారు కదూ.. మొత్తం డెబ్బై మూడు కామెంట్స్. అన్నీ అలాంటివే. పబ్లిష్ చెయ్యటానికి పనికిరానివి. ఇలాంటివి మీకు వస్తే మీరు చెయ్యాల్సిందల్లా - ఆ కామెంట్ ప్రక్కన గడిలో ఓకే చేసి, క్రిందన ఉన్న స్పామ్ SPAM ని నొక్కండి. 

ఇప్పుడు ఆ కామెంట్ స్పామ్ బాక్స్ లోకి చేరిపోతుంది. ఇకనుండీ అలాంటి / ఆ మెయిల్ ID నుండి ఏమైనా కామెంట్స్ వస్తే - మీరు మళ్ళీ మళ్ళీ చెక్ చేసుకోనవసరం లేకుండా ఆ మెయిల్ ID నుండి వచ్చేవన్నీ ఆ స్పామ్ బాక్స్ లోకి చేరిపోతాయి. ఎప్పుడో మీకు వీలున్నప్పుడు ఆ స్పామ్ బాక్స్ చూసి, పనికిరాని కామెంట్స్ ఉంటే - అన్నింటినీ ఒకేసారి డిలీట్ చెయ్యోచ్చును.  మీకు చాలా ప్రశాంతత దొరుకుతుంది. 

No comments:

Related Posts with Thumbnails