Friday, March 9, 2012

Online Insurance - a tip.

ఇది మార్చ్ నెల. ఈ నెలలో ఇన్స్యూరన్స్ వారి హడావిడి కూడా ఎక్కువే ఉంటుంది. ఈపాలసీ తీసుకోండి.. ఆ పాలసీ తీసుకోండీ అనీ. ఇక్కడే మీకు ఒక చిన్న విషయం చెప్పాలని అనుకుంటున్నాను..

ఆ పాలసీ గురించి అంతా వినండి. 

మరిన్ని వివరాలకు ఆన్ లైన్ లో వెదకండి. 

అలా వెదికాక, అలాంటి పాలసీ ఇంకో ఇన్స్యూరన్స్ కంపనీలో ఉందేమో చూడండి. 

ఆ రెండింటి పాలసీలకి తేడాలు ఏమిటో సమగ్రముగా ఆలోచించండి. 

కావలిస్తే ఆ సంస్థ టోల్ ఫ్రీ నంబర్ కి ఫోన్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి. 

చివరగా - మీకు ఆ పాలసీ నచ్చితే, ఆన్లైన్ లో పాలసీ చేసి, మీ ప్రీమియాన్ని చెక్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా కట్టేయ్యండి. 

ఇలా ఆన్లైన్ లో పాలసీ చేసి, ప్రీమియం కడితే - మీరు కట్టే ప్రీమియం లో దాదాపు 35% వరకూ మిగులుతుంది. అవును. నిజమే!.. ఆ 35% లో మీరు సాంప్రదాయకముగా ఏజెంట్ వద్ద చేసే పాలసీ లో 15% వరకూ ఉంటుంది. ఇంకో 10% ఆపై ఏజెంట్ కీ, మరో 5% డెవెలప్మెంట్ అధికారికీ ఉంటుందని విన్నాను. ఇది ఒక ఏజెంట్ చెప్పాడు. (నిజమెంతో తెలీదు) మిగతా మిగిలిన మొత్తం ఆఫీస్ ఖర్చులకి కేటాయిస్తారు. 

ఈ ముప్పై శాతాన్ని ఇటు మీకు కాక, అటు ఆ ఇన్స్యూరన్స్ వారికీ కాకుండా మధ్యలో ఉన్నవారికి వెళుతుంది. అలా కాకుండా మీరు ఆన్లైన్ లో పాలసీ చేస్తే ఆ మొత్తం మీకే మిగిలిపోతుంది. మీరు చివరికి పొందేదానికన్నా ఈ మధ్యలోని వారి వాటానే ఎక్కువగా ఉంటుంది అని తెలుస్తున్నది కదా.. ఇటు మీకూ, అటు ఆ ఇన్స్యూరన్స్ సంస్థకి కాకుండా మధ్యలోని వారికి వాటా పంచటం అవసరమా..? పాలసీ మొదట్లో అంటే ఓకే! పరిచయం చేశారు, సంస్థలోకి జాయిన్ చేశారు, ప్రీమియం కట్టేలా చేశారు.. ఇలాంటి కారణాల వల్ల ఓకే అనుకుందాం. ఆ తరవాత మీరు కట్టే ప్రతి ప్రీమియం లో వారికి వాటా ఇవ్వటం భావ్యమా?.. ఆ తరవాత వారి అవసరం అంతగా ఉండదు కూడా. అయినా వారికి కమీషన్లు ఇవ్వక తప్పదు కదా.. సరిగ్గా ఈ ఆలోచన వల్లే ఈ ఆన్లైన్ పాలసీలు వచ్చాయి. ఇందులో ఈ ఖర్చులు అంటూ ఏమే ఉండవు కనుక, అది వినియోగదారునికి మిగులుగా - ప్రీమియం తగ్గింపు చేస్తారు.  ఉదాహరణకి : మీరు రెండు లక్షల పాలసీ చేస్తే అరవై వేలు మిగులుతాయి. ఇంట్లోకి చాలా ఉపయోగపడే మొత్తం అది. కనుక ఈసారి పాలసీ చేసే ముందు, ఒకసారి ఆన్లైన్ లో ఒకసారి ప్రయత్నించి చూడండి.

ఇదంతా పాలసీ ఏజెంట్ల మీద ద్వేషముతో, వాళ్ళేదో మన దగ్గర నుండి అప్పనముగా తీసేసుకుంటున్నారని, వ్యక్తిగత కారణాల వల్లనో చెప్పాలని మాత్రం కాదు. ఒక ఉపయోగకర సమాచారం చెప్పాలని. అంతే!. 

No comments:

Related Posts with Thumbnails