Wednesday, March 7, 2012

1,000,000 GBP

ఇలా మీకు మీ మొబైల్ కి మెస్సేజ్ వచ్చిందా..? దాన్ని చూసి ఎగిరి గంతేశారా?.. అయితే ఆ గంతులు వెయ్యటం ఆపండి. మీ నంబర్ కి ఉత్తి పుణ్యాన్నే పది లక్షల (1,000,000 GBP) బ్రిటీష్ పౌండ్ స్టెర్లింగ్స్ రావు. మన భారత కరెన్సీ లోకి  మారిస్తే - 7,86,60,962.00 రూపాయలు అవుతుంది. ఈ ఏడు కోట్ల, ఎనభై ఆరు లక్షల రూపాయలు ఎవరైనా ఎందుకు ఇస్తారు... అవును ఎందుకు ఇస్తారు?.. 


ఎందుకు ఇస్తారంటే - అదొక ఎర. తేలికగా డబ్బు సంపాదించాలన్న ఆశ ఉన్నవారు ఇలాంటివాటికి బలయి పోతుంటారు. ఇలాంటి వాటికి రిప్లై ఇచ్చి, వారు అడిగినవన్నీ ఇస్తారు. 

హైదరాబాద్ దగ్గరలో ఉన్న ఒక చిన్న పట్టణం లో మోటార్ వాహనాల టైర్స్ కి పంక్చర్స్ వేసుకుంటూ, జీవనం కొనసాగించే ఒకతనికి ఇలాంటి మెస్సేజ్ వచ్చింది. ఆనందముతో ఉబ్బి తబ్బిబ్బుయ్యాడు. ఆలోచించి, రిప్లై ఇచ్చాడు. వెంటనే అక్కడి నుండి జవాబు. "..డబ్బు పంపే ప్రాసెస్ ఖర్చుల కోసం అనీ INR 29, 600 ఒక బ్యాంక్ అకౌంట్ నంబర్ లో వేయమని చెబితే, అతను అలాగే చేశాడు.. ఆ తరవాత మళ్ళీ కొంత డబ్బులు (ఈసారి INR యాభై వేలకి పైగా) పంపమని మెస్సేజ్. ఇక మోసం అర్థం అయ్యింది. ఆ అకౌంట్ ఎక్కడ అని ఆరా తీస్తే - జమ్మూ కాశ్మీర్ లోని అకౌంట్ అది. నిండా మునిగాను అని అర్థం అయ్యి, లబోదిబోమని అన్నాడు. 

అందుకే ఇలాంటివాటికి రిప్లై ఇచ్చి, ఇటు డబ్బూ పోయి, అటు మానసిక వేదనతో బతుకును డీలా చేయవద్దని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. 

1 comment:

రసజ్ఞ said...

బాగా చెప్పారు ఈ మధ్య ఇలాంటివి మొబైల్ లోనే కాక మెయిల్స్ లో కూడా బాగా ఎక్కువయిపోయాయి! డబ్బు కోసం మనిషి ప్రాణం తీయడానికి కూడా వెనకాడని ఈ రోజుల్లో ఎవడయినా పిలిచి తేరగా డబ్బులెందుకు ఇస్తాడు అన్న ఆలోచన ఎందుకు రాదో!

Related Posts with Thumbnails