Sunday, December 4, 2011

మోకాళ్ళ లోతు - ఇండియా

ఇది నా చిన్నప్పటి స్నేహితుడి అనుభవం.. అతనే చెప్పాడు నాకు.

ఇప్పుడు అంటే పబ్లిక్ తెలివి మీరారు కానీ, అప్పట్లో అంతా అమాయకులే!.. ఏది చెప్పినా నమ్మయ్యడమే!.. అది  నిజమా కాదా! అని కూడా ఆలోచించరు. అలాంటి కాలములో నా మిత్రుడు హై స్కూల్ చదివేవాడు. అప్పట్లో తనకి ఒక మిత్రుడు ఉండేవాడు.. అతను వీడితో ఒకసారి - "కన్యాకుమారి వెళ్ళాక హిందూ మహా సముద్రములో మోకాళ్ళ అంత దూరం లోపలికి వెళ్ళి, వెనక్కి చూస్తే - భారదేశం అంతా కాశ్మీర్, హిమాలయాలతో సహా కనిపిస్తుంది.. "అన్నాడుట. మనోడికి ఎప్పుడు కన్యా కుమారికి వెళ్దామా! ఎప్పుడు ఇండియా అంతా చూస్తానా!.. అని ఒక కోరిక బాగా నాటుక పోయింది.

ఎవరైనా కన్యాకుమారి వైపు కి వెళ్ళి వస్తే - సముద్రములోకి మోకాళ్ళ అంత లోతుకి వెళ్ళి వెనక్కి చూశారా అని (పిచ్చిగా) అడిగేవాడు.. ఇదంతా తప్పని, ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు అర్థం చేసుకొన్నాడు. ఇప్పటికీ ఆ సంఘటన చెప్పి, నవ్విస్తూ ఉంటాడు.

1 comment:

Disp Name said...

మీరే కాదండీ, నేను కూడా ఇది నిజం గా ఏడో క్లాస్సు దాక నమ్మానంటే నమ్మండి సుమీ!

కన్యా కుమారి వెళ్తే , భారద్దేశం మొత్తం చూడొచ్చు అని మా ఫ్రెండు చెప్పింది. అవునేమో అనుకున్నాను. ఏడో క్లాస్సులో కన్యాకుమారి టూర్ కి వెళితే గాని నిజం తెలియలే!

చీర్స్
జిలేబి.

Related Posts with Thumbnails