Thursday, October 6, 2011

Socks - మిగతా ఉపయోగాలు.

మీదగ్గర పాత నైలాన్ కాలి మేజోళ్లు ఉన్నాయా?.. వాటిని వేసుకొనీ, వేసుకొనీ పాడయ్యి, బయట పారవేయబోతున్నారా? ఉండండి.. కాస్త ఆగండి.. వాటితో ఏమి చెయ్యాలో కొన్ని టిప్స్ చెబుతాను.



*. మీ పాత సాక్స్ లలో చిన్న చిన్న వస్తువులని ఉంచి మూతి వద్ద ఒక రబ్బర్ బ్యాండ్ వెయ్యండి. దుమ్ము పడకుండా భద్రముగా ఆ వస్తువులు ఉంటాయి. 

*. ఆ సాక్స్ ని మీ చేతికి తొడుక్కొని, ఇంట్లోని ఫర్నీచర్ ని శుభ్రముగా తుడవవచ్చును. ఇలా తుడిస్తే, మీ చేతులకి ఏమీ గాయాలు కాకుండా ఉంటుంది. ఆ ఫర్నీచర్ మీద దుమ్మూ, ధూళీ పోయినట్లుగా అవుతుంది. 

*. కాటన్ సాక్స్ కన్నా నైలాన్ సాక్స్ తో తుడిస్తే, ఆ ఫర్నీచర్ మరింతగా మెరుస్తాయి. క్రొత్త ఫర్నీచర్ గా లుక్ వస్తుంది కూడా. 

*. మీ వాహనాలనీ కూడా ఇలా చేతికి సాక్స్ ని వేసుకొని, తుడవండి. మీ బండిని ఏదో పాలీష్ క్రీం పెట్టి తుడిచినట్లుగా, నూతన మెరుపుని పొందకపోతే - నన్ను అడగండి. కాటన్ బట్ట కన్నా ఈ నైలాన్ సాక్స్ వాడితే బాగా మీరు నమ్మలేనంతగా మెరుపు వస్తుంది. 

*. మీ బూట్లకి షూ బ్రష్ తో పాలిష్ పూయండి. ఆ తరవాత వాటిని కాసింత ఆరనివ్వండి. అంతలోగా మీరు ఆ షూ పాలీష్ డబ్బా, బ్రష్ నీ లోపల పెట్టెయ్యండి. రెండు, మూడు నిమిషాలు ఆరనిచ్చాక - ఇప్పుడు మీ చేతికి పాత సాక్స్ ని మీ చేతికి తొడుక్కొని, ఆ షూస్ ని బాగా రుద్దండి. మీరు బ్రష్ తో చేసినదాని కన్నా అద్దములా మెరిసిపోవటం ఖాయం. బ్రష్ తో చేసిన దానికన్నా ఎక్కువ పాలిష్ వస్తుంది.

2 comments:

Krishna Reddy said...

Useful tips.

Raj said...

కృతజ్ఞతలు రెడ్డి గారూ..

Related Posts with Thumbnails