Saturday, October 15, 2011

బ్లాగుల్లో ఫోటో ఆల్బం పెద్దగా చూడాలంటే!

నూతనముగా కొన్ని మార్పులు బ్లాగ్ స్పాట్ లో జరిగాయి. ఎవరి బ్లాగులోనైనా ఫొటోస్ పెడితే - వాటిని పెద్దగా చూడటానికి ఆయా పోస్ట్ లలోని ఆయా ఫొటోస్ మీద డబల్ క్లిక్ చేస్తే సరిపోయేది. అలాచేస్తే ఆ ఫొటోస్ ని పెద్దగా చూసేవాళ్ళం. ఇప్పుడు కొన్ని మార్పులు జరిగాయి. కొద్దిగా ఫోటో ఆల్బంలా మార్చారు. ఒకే ఒక చిన్న మార్పు తప్ప మిగతా అంతా అంతే!.. పెద్దగా చూసే ముందు ఫోటో ఆల్బం వ్యూయర్ లా వస్తుంది అంతే!. అదేమిటో ఎలానో ఇప్పుడు మీకు చెబుతాను. 

నా బ్లాగ్ లోన ఒక టపా - నా ఫోటోగ్రఫి టపా ఇక్కడ ఎన్నుకొని, మీకు చూపిస్తున్నాను. ఆ టపాలోని ఒక ఫోటోని ఎన్నుకొని - ఆ ఫోటోని పెద్దగా చూడాలని అనుకుంటే - ఆ ఫోటో ఇమేజ్ మీద క్లిక్ చెయ్యాలి. (ఈ క్రింది స్క్రీన్ షాట్ లోని పచ్చని ఆకుల ఫోటోని ఆరు మెగాపిక్సేల్ కెమరాలో తీశాను.)


అలా చేసిన ఆ ఫోటో ఇమేజ్ ఇలా క్రింద చూపిన దానిలా మీకు కనిపిస్తుంది. అలా వచ్చిన వ్యూ లో మీరు కుడి పై మూలన ఒక X బటన్ కనిపిస్తుంది. అది ఆ ఫోటో ఆల్బం క్లోజ్ చెయ్యటానికి వాడే బటన్. మధ్యలో పెద్ద సైజులో - ఏదైతే పెద్దగా చూడాలని అనుకొని, దాన్నిమీద నొక్కామో, ఆ ఫోటో మరియు ఆ ఫోటో క్రింద చిన్నగా ఆ టపాలోని మిగతా ఫోటోలు థంబ్ నైల్ రూపములో కనిపిస్తుంది (క్రింది ఫోటోలో అడుగుభాగాన మీకు వరుసగా ఫోటోల వరుస కనిపిస్తున్నది కదా! వాటినే థంబ్ నైల్స్ అంటారు). ఈ థంబ్ నైల్ ఫొటోస్ కీ, ఆ పెద్ద ఫోటోకి మధ్యన ఎడమ వైపున - ఆ పెద్ద ఫోటోకి సంబంధించి, ఒక లింక్ ఉంటుంది. (ఈ క్రింది ఫోటోలో ఉంది చూడండి.) ఆ లింక్ మీద నొక్కండి. 

ఇక్కడే మీరు ఫోటో ఆల్బం ని ఆ సైజులోనే - మొత్తం ఆల్బం చూడాలని అనుకుంటే - ఆ అలా ఓపెన్ కాగానే మీ మౌస్ స్క్రోలింగ్ వీల్ ని నెమ్మదిగా త్రిప్పండి. ఒక్కో ఫోటో పెద్దగా వస్తుంది. ముందుకు త్రిప్పితే ముందువీ, వెనక్కి త్రిప్పితే వెనకవీ వస్తాయి. 
లేదా 
మీ కీ బోర్డ్ లోని బాణం గుర్తుల కీ లను వాడితే కూడా నొక్కినా వరుసగా ఫొటోస్ మారుతాయి. 

అప్పుడు ఆ ఫోటో పాత వర్షన్ లోలా పెద్దగా - ఈ క్రింది ఫోటో లోలా కనిపిస్తుంది. 


ఇప్పుడు ఆ ఎన్నుకున్న ఫోటో మీద మీ మౌస్ మీద రైట్ క్లిక్ చేస్తే ఒక మెనూ వస్తుంది. అందులో మీరు Open image in new tab ని ఎన్నుకోండి. అప్పుడు ఆ ఫోటో ఇంకో టాబ్ లో పెద్దగా అంటే ఆ ఫోటో రిజల్యూషన్ లో ఓపెన్ అవుతుంది.

అలా పెద్దగా అయిన ఫోటో మీద కర్సర్ పాయింట్ వద్ద ఒక భూతద్దం లో - అని ఉంటుంది. మళ్ళీ కర్సర్ నొక్కగానే + గుర్తువస్తుంది. అప్పుడు ఆ ఫోటో ఒరిజినల్ సైజులో (క్రింది ఫోటో మాదిరిగా) ఆ ఫోటో కనిపిస్తుంది. అక్కడున్న సైడ్  బార్స్ జరుపుకుంటూ ఆ ఫోటోని పెద్దగా - ఒరిజినల్ సైజులో చూడొచ్చును.  

చూశారు కదా.. 6 మెగా పిక్సెల్ కేమరాతో తీసిన ఫోటో మీద నా బ్లాగ్ పేరు ని వ్రాశాను కదా. ఆ ఫోటోని మామూలుగా ఓపెన్ చేసినప్పుడు, ఆ పేరు మధ్యలోకి వచ్చింది కదా.. అదే ఫోటోని Open image in new tab లో ఓపెన్ చేసినప్పుడు మధ్యలో ఉన్న నా బ్లాగ్ పేరు ఒక మూలకు వచ్చింది. అలాగే సైడ్ బార్స్ కూడా వచ్చాయి. 

No comments:

Related Posts with Thumbnails