Thursday, October 13, 2011

మీ దగ్గర ఉందా?

నా మిత్రుడొకరు కాసింత బ్యాంక్ పని ఉంటే వెళ్లాడు. అక్కడ ఉన్న సంబంధిత అధికారి వద్దకి వెళ్లాడు. అప్పటికే ఆ అధికారి వద్ద చాలామంది ఉన్నారు. సరే! క్యూ పద్ధతి లో ఇక్కడ కూడా ఉన్నట్లున్నారు అనుకొని, ఆగిపోయాడు. చేసేది లేక ఇక అలాగే కూర్చోండిపోయాడు. అక్కడ జరిగేది ఆసక్తిగా గమనించాడు.

యే బ్యాంక్ లోని అధికారులైనా ఎక్కడా మూడు సంవత్సరాల కన్నా ఎక్కడా ఒక చోట పనిచెయ్యరు.. కాదు.. కాదు.. చెయ్యనివ్వరు. అన్ని బ్యాంకుల రూల్స్ అలాగే ఉంటాయి కూడా. ఆ తరవాత బదిలీ చేస్తారు. అంతకు ముందున్న ఆ సీటులోని వ్యక్తి ఇతనికి బాగా తెలుసు కూడా. తన ప్రక్కపోర్షన్ లోనే ఉండేవారు కూడా.

ఈ క్రొత్తగా వచ్చిన ఆయన బహుశా యాభై ఏళ్ళకి పైగా ఉంటాడు. తన చాలా అధికార దర్పం చూపించాడు. చిన్నగా కాల్ చేసి మాట్లాడితే, పని జరిగిపోయేదానికి - తన టెక్కు చూపి, జీపులో బ్యాంక్ మందీ మార్బలముతో, వెంట రిజిస్టర్స్ పట్టుకొని ఉదయాన్నే ఏడింటికి ఖాతాదారుల ఇంటింటికీ వెళ్ళి, ఇంటి బయటే నిలబడి, వారిని బయటకి పిలిచి - మాట్లాడటం చేశాడు. అది అక్కడికి వచ్చిన ఆ ఆయన చుట్టూ మూగిన వారి బాధ. "ఒక చిన్న కాల్ చేసి రమ్మంటే వచ్చేవాళ్ళం కదా.. ఇలా ప్రోద్దుప్రోద్దునే అలా మందీ మార్బలం తో ఇంటిమీదకి వచ్చేసి, చుట్టుప్రక్కల వారు చూసేలా - బయటకి పిలిచి, అడగటం చేసేసరికి మరీ అగౌరవపరచినట్లు"గా భావిస్తున్నారు. వారు చెప్పినదీ నిజమే!.. ఆయన మొదట అలా కాల్ చేసాక, వారు అలా రాకుంటే అప్పుడు ఇలా చేస్తే చాలామంచిది. ఆ జీపూ, డిజిలూ, సమయం మిగులుతుంది కదా.. ఇందరు ఆత్మన్యూన్యత కి గురి అయ్యేవారు కారుగా. వారి ఆత్మాభిమానం దెబ్బతినేది కాదుగా. ఒకనిది మహా అంటే పద్నాలుగు వేల రూపాయల బాకీ - అంతే! అతనికీ ఈ బాధ తప్పలేదు.. మొహం చిన్నగా అయ్యింది.

అక్కడికి వచ్చిన ఆ బాధితులందరూ నానామాటలు అన్నారు. అంటున్నారు కూడా. కొంతమంది కొట్టడానికి వచ్చాం అన్నట్లుగా కోపం చూపించారు కూడా. ఆయన్ని నానామాటలూ అన్నారు. కాస్త ముందుగా వచ్చి ఉంటే కేకలు వినేవాడేనని తెలిసిన ఫ్యూన్ చెప్పాడుట. "ఒకసారి మీరు చెప్పాక, మేము మీకు డబ్బులు కట్టకుంటే అప్పుడు అలా రావచ్చును.. కాని ఇన్ఫో ఇవ్వటానికి కూడా అలా వస్తే - మా విలువ మా చుట్టుప్రక్కల ఏముంటుంది.. మమ్మల్ని ఎవరు నమ్ముతారు?.." అని అన్నారు. అలా అలా హాటు హాటుగా సాగింది.

ఆతరవాత కాసేపటికి నా మిత్రుని వంతు వచ్చింది. మాట్లాడాడు.. చాలా కూల్ గా సమాధానాలు ఇచ్చాడు. ఆవెంటనే - ఆయన నా మిత్రున్ని గన్ షాట్ గా ఒక ప్రశ్న అడిగాడు. "నీ దగ్గర పది తులాల బంగారం కావాలంటే - ఉందా? అప్పటికప్పుడు ఇస్తారా?" అని అడిగాడు. నా మిత్రునిది చిన్న సైజు జేవేల్లెరీ షాప్ లెండి.

ఆయన ఉద్దేశ్యం ఏమిటో అర్థం అయ్యింది. అంత కెపాసిటీ కూడా లేనిది నీ స్థాయి అనీ. కాని ఏమీ కోపం తెచ్చుకోకుండా కూల్ గా చెప్పాడు.. "హా! ఇస్తాను.. ఒకవేళ నా దగ్గర లేకున్నా జస్ట్ ఐదు నిమిషాల్లో మీకు ఇవ్వగలను.. అయినా నేను అమ్మేది ఒక శాతం మార్జిన్ కూడా కాదు.. 0.005 % మీద బేరం కాబట్టి నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించను.."

ఆతరవాత వచ్చిన పని అయిపోయింది. నా ఫ్రెండ్ కుర్చీలోంచి లేస్తూ ఆయనతో - "సర్! నా దగ్గర లేకున్నా, నేను ఇవ్వలేని స్థితిలో ఉన్నా ఎలాగైనా అడ్జస్ట్ చెయ్యగలను. నా సంగతి సరే!.. పోనీ మీ సంగతి చూద్దాం. ఇందాక చూశాను - మీ బ్యాంక్ ఒక రోజు టర్నోవర్ (రాబడి + చెల్లింపులు) మొత్తం కలిపి ఎనబై లక్షలు. మీ ఖాతాదారుని నుండి, ఒక పది లక్షల చెక్ వస్తే - మనీ అడ్జస్ట్ చెయ్యటానికి రెండు మూడు రోజులు ఆపుతారుగా.. మాకొచ్చే కమీషన్ కన్నా మీ కమీషన్ ఎక్కువే! అయినా మీరు వెంటనే ఇవ్వరు.. ఇస్తే మిగతా ట్రాన్స్కషన్స్ కి మీకు ఇబ్బంది. మీకు హెడ్ ఆఫీస్ నుండి డబ్బు రావాలి.. మీకన్నా మేమే నయం లెండి.." అనేసి వెనక్కి చూడకుండా వచ్చేశాడు. ఆ ముసలాయన మొహములో ఎన్ని రంగులు మారి ఉంటాయో! ముందుగా ఇలాంటివారికి తమకి అర్హత, స్థాయి లేకున్నా ఒకరిని అంటే - ఎంతగా పెయిన్ గా ఉంటుందో తెలిసేలా చేయాలి.. 

No comments:

Related Posts with Thumbnails