Saturday, August 6, 2011

Social NW Sites - 34 - Post Scripts - 1

సోషల్ సైట్స్ లలోని మోసాలు ఏమిటో, ఎలా ఉండాలో అనే జాగ్రత్తలు మీకు, నాకు తెలిసినంతలో అన్నీ చెప్పాను. ఇక చివరగా - కొన్ని మరచిపోయినవీ, క్రొత్తగా మీకు సూచనలు చేయ్యాలనిపించినవీ, మరికొన్ని విషయాలు మీకు ఇక్కడ చెప్పదలచుకున్నాను. ఇదే ఈ సీరీస్ లో చివరిది. మరచిపోయినవి, క్రోత్తవీ అని అనుకున్నవి అన్నీ ఇక్కడ చెబుతున్నాను. కొన్ని పునశ్చరణలా ఉండొచ్చును. 

మిత్రుడు అనేవారు - మనం ఏదైనా మంచిపని చేసినప్పుడు బహిరంగముగా మెచ్చుకోగలగాలి. అదే  విమర్శించినప్పుడు ప్రైవేట్ లోనో, చాట్ లోనో, ఏకాంతముగా ఆ విషయం చెప్పగలగాలి. అలా చేసినప్పుడు ఆ స్నేహబంధం మరింత బాగా దృడం అవుతుంది. చాలామంది ఇలా చెయ్యరు. అలా చేస్తే ఎక్కడ దెబ్బతింటుందో అని అనుకుంటూ ఉంటారు. దెబ్బతినే స్నేహం అయితే అలాగే ఉంటుంది. ఒకసారి అలా చేసి చూడండి. అలాంటి లక్షణాలు కనిపిస్తే, ఇక అలాంటివి వారి విషయములో చెయ్యకండి. కాని స్నేహం అనేది - తాను ఎదుగుతూ, స్నేహితుడినీ ఎదిగేలా చెయ్యటం. ఏదీ చెయ్యకుండా ఉంటే అది స్నేహం కాదు.. జస్ట్ పరిచయం అంతే. స్నేహం అనేది - పరిచయం అన్న గేటు దగ్గరనుండి మరింతగా లోపలి వెళ్ళటం.

కొన్ని పరిచయాలు అదోలా మారుతాయి. ముందు బాగానే ఉంటాయి. ఆతరవాత అవి మానసిక వైకల్యానికి దోహదం చేసేలా ఉంటాయి. వారి వారి మానసిక వికారాలు నెమ్మదిగా బయటపడతాయి. ఏది చేసిన,ఎంతగా చేసుకున్నా అది పర్సనల్. కాని అవన్నీ ఈ సైట్లలో అందరికీ ప్రదర్శిస్తే - బాగుండక పోవచ్చునేమో.. వారిని దూరం కూడా చేసుకోవచ్చును. నాకొక మిత్రుడు ఉన్నాడు. అతను ఒక ఆగ్రనటుడు ఫొటోస్ ఒక సైట్ సహాయన క్యాబరే డ్యాన్సర్స్ గా మార్ఫింగ్ చేశాడు. (తేలికగా అలా మార్ఫింగ్ చేసే సైట్ అది.) అందరికీ ఓపెన్ గా పెట్టాడు. నాకు అది నచ్చలేదు. ఆ విషయం అతనికి చెప్పేసాను. ఏమైనా చర్య తీసుకుంటాడేమో అని రెండు రోజులు ఆగాను. ఏమీ మార్పు లేదు, అలాగే ఉంది.. ఇక - అతని ఫ్రెండ్స్ లిస్టు నుండి నేను వెళ్ళిపోయాను. అనక అతడిని ఇగ్నోర్ లిస్టు లో పెట్టేశాను కూడా. రేపు మనవీ చెయ్యోచ్చునుగా. అతనూ అతని ఫొటోస్ పెట్టాడు.. అవి ఎవరైనా అలా చేస్తే? అనే ఆలోచన కూడా అతనికి లేదు. అందుకే అంటాను - మొదటగా మనం తప్పు చెయ్యొద్దని.

ళ్ళతో చూసేదాకా ఏదీ నమ్మొద్దు. అలాని చూడక ఏదేదో ఊహించుకుంటే తీరా మనకే ఎదురు దెబ్బ తగులుతుంది. కళ్ళతో వాటిని చూసేదాకా ఎవరేది ఎవరిమీద చెప్పినా, అది అసత్యమనే నమ్మాలి. అలా చెప్పేవారు ఆధారాలని చూపుతూ చెబితే ఇంకా బాగుంటుంది కదా.. కాని అలా ఉండదు. ఇలాంటిది ఒక విషయం చెబుతాను. నా మిత్రుడు ఒక అమ్మాయితో గొడవపడి, ఆమెతో దూరం అయ్యాడు. ఆమె మీద పగ, కసి తీర్చుకోవటానికి ఆమె ఫోటో ని నగ్నముగా మార్ఫింగ్ చేసి, (అంటే ఆమె తలని నగ్న సుందరీమణుల దేహాలకి అతికించి ) కొంతమంది మిత్రులకి షేర్ చేశాడుట. నాకు మాత్రం షేరింగ్ చెయ్యలేదు. కనుక తెలీదు. ఈ విషయం ఇంకో మిత్రుడు నాతో చెప్పాడు. అవునా..? ఆధారాలు ఉన్నాయా? అడిగాను. ఉంటే, చూశాక వెంటనే అలా చేసిన అతన్ని నా లిస్టు నుండి తీసెయ్యాలని నా ఆలోచన. కనీసం స్క్రీన్ షాట్ అయినా ఉందా? అన్నాను.. ప్చ్! లేదట. (అతనికి షేర్ చేశాడు అని అన్నాడు కాని, దానికాపీ ఒకటి తన మెయిల్ ID కి వస్తుంది కదా.. అది చూపించవచ్చును కదా. అంటే అలా అతని మీద అబద్ధం చెప్పాడు అని నేను అనుకుంటున్నాను) అతను చెప్పింది నిజమే కావచ్చును అనుకుందాము. కాని ఆధారం లేదు కనుక నమ్మలేదు. అలా మార్ఫింగ్ చేసిన అతని మీద కాస్త నమ్మకం మరియు స్నేహాన్ని కాస్త తగ్గించుకున్నాను. ఇద్దరి మధ్యన స్నేహం పోయి ఇప్పుడు పరిచయం లెవల్లో ఉండిపోయింది. 

సోషల్ సైట్లలో మాట్లాడటం అంతా అక్షరాల టైపింగ్ లో ఉంటుంది. కనుక ఈజీగా దొరికిపోతారు. అందులో వ్రాసినది అంతా మీ భావజాలం అనే అనుకుంటారు. వ్రాసేసి వెంటనే తీసేసినా, డిఫాల్ట్ గా మెయిల్ సౌకర్యం ఉంటుంది కాబట్టి, ఆ స్క్రాప్ కాపీ ఒకటి మెయిల్ బాక్స్ కి కూడా చేరిపోతుంది. అక్కడమాత్రం తీసేయ్యలేరు. అక్కడ తీసేయ్యాలీ అంటే - వారి మెయిల్ ID పాస్వర్డ్ సహాయన వారి మెయిల్ లోకి ఎంటర్ అవక తప్పదు. అవి తెలియవు. అది వీలుకాదు. లేదా వారే తీసేయ్యాలి. కనుక ముందే జాగ్రత్తగా మాట్లాడండి. ఎటుపడితే అలా మాట్లాడితే మీరే ఇరుక్కుంటారు. మీరు డిలీట్ చేసేలోగా అవతలివారు స్క్రీన్ షాట్ నొక్కేస్తే - ఇక బలమైన ఆధారాలుగా వారికి దొరికిపోవటం ఖాయం. అందుకే తస్మాత్ జాగ్రత్త.

క్కడ ఎవరూ మమ్మల్ని గుర్తుపట్టరు అని అనుకుంటారు కాని అంతా అన్నీ తెలుసుకోవచ్చును. ఏమి చేసినా చెల్లుతుంది అని అనుకోవటం మన భ్రమ మాత్రమే. మీరెంత ఫేక్ మెయిల్, ఫేక్ డిటైల్స్ పెట్టినా సరే.. ఈజీగా దొరుకుతారు. ఇది ఈజీగా అర్థం అవటానికి ఈమధ్య జరిగిన ఒక నిజమైన సంఘటన చెబుతాను. ఒక అబ్బాయి అమ్మాయి మెయిల్ ID లు ఐదు (5) దాకా పెట్టుకొని, డేటింగ్ చేసే గ్రూప్ లోకి ఆన్ లైన్లోకి వచ్చాడు. ఒక అమ్మాయితో జరిగిన విభేదాల వల్ల ఆ అమ్మాయి ఫోటోని, ఆమె ఫోన్ నంబర్ ని ఆన్ లైన్ లో ప్రదర్శించాడు. దానివలన ఆ అమ్మాయికి పిచ్చగా ఫోన్ కాల్స్... ఆందోళన చెందిన ఆ అమ్మాయి వీటన్నింటినీ ఆధారాలుగా సేకరించింది. ఆతరవాత పోలీస్ వారికి కంప్లైంట్ చేసింది.
ఆ అబ్బాయి అనుకోవచ్చును.. నా ఐడెంటిటీ ఎవరికీ తెలీదు అనీ. కాని ఆ పోస్ట్ చేసిన వెనక కొన్ని వివరాలు కూడా ఉంటాయి. అవి కనిపించవు. సపోజ్ మీరు ఒక SMS పంపితే - ఆ SMS పంపిస్తే దానితో బాటూ మీ ఫోన్ నంబర్ వెళ్ళిపోతుంది. అవతలి వారికి అది కనిపిస్తుంది. ఆ ఫోన్ నంబర్తో బాటుగా మీ మొబైల్ IMEI నంబరూ దానితో చేరిపోతుంది. అది మనకు కనిపించదు. ఆ సర్వీస్ ప్రోవైడర్లకి కనిపిస్తుంది. అలాగే ఈ స్క్రాప్స్, మెయిల్స్, ఫొటోస్.. ఇలా అన్నీ.. మీ సిస్టం కి ఉన్న నంబరూ, కాన్ఫిగరేషన్, మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రోవైడర్ (ISP) ఎవరూ, ఆ కనెక్షన్ ఎవరి పేరు మీద ఉందో, యే దేశమో.. అన్నీ ఆ అప్లోడ్స్ వెంట ఉంటాయి. ఈ విషయం ఆ అబ్బాయికి తెలీదు. పోలీస్ వారు సైబర్ పోలీస్ సహాయాన ఆ మెయిల్స్, ఇమేజెస్ అప్లోడ్ చేసిన ISP సహాయాన అతన్ని దొరకపట్టుకున్నారు. ఇప్పుడు ఆ అబ్బాయికి రెండు సంవత్సరాల కారాగార శిక్ష విధించారు. ఇంతా చేస్తే ఆ అబ్బాయి, ఆ అమ్మాయి క్లాస్మేట్స్, పెళ్ళికి ప్రపోజ్ చేస్తే ఒప్పుకోలేదని ఇలా చేశాను అని ఒప్పుకున్నాడు.
అందుకే - ఏదైనా తేడా వస్తే ఊరుకోండి. మిమ్మల్ని కాదని అనుకోండి. మీ మీద ఏమైనా ఇలా వస్తే అలా ఆధారాలు ఉంచుకోండి. అన్నీ దాచండి. అవతలివారి ఆట కట్టించవచ్చును. ఈ మధ్య వచ్చిన టైగర్ స్క్రాప్స్ విషయములో కూడా ఇలా ఆధారాలు సేకరించి దాచుకోవచ్చును. ఎవరూ ఎలానూ తప్పించుకోలేరు. అవాకులూ చెవాకులూ రాకుండా నిరోధించవచ్చును. చాలామంది ఊరుకుంటారు కానీ, ఇలా చేస్తే అవతలివారి ఆటలు కట్టించవచ్చును. అందుకే అలాంటి పనులు ఏవీ చెయ్యకండి. ఎవరి జోలికీ వెళ్ళకండి.

నాకున్న ఆన్లైన్ స్నేహానుభవాల వల్ల మరీ చెబుతున్నాను. అందరూ మంచివారే అనుకోకండీ. ఇందులో రకరకాల వ్యక్తులూ కనిపిస్తారు. ఆడవారి పేరుతో ప్రొఫైల్ మైంటైన్ చేసేవారు, పలకరించినా కనీస విషెస్ చెప్పకుండా ఉండేవారు, వారి పుట్టినరోజులకి విషెస్ చెబితే - కనీసం థాంక్స్ చెప్పని వారూ, ఎదుటి వ్యక్తి ని మార్కింగ్ చేసుకొని, వారు ఏమిచేస్తున్నాడూ అని ఇన్విజిబుల్ మోడ్ లో ఉండి, వెంటపడటం.. చాలామందికి రెండుకన్నా ఎక్కువ అకౌంట్స్ ఉండటం, అక్కడ పెట్టే వివరాలు ఏమాత్రం నిజం కాకుండా ఉండటం, ఉండేది ఒకచోట అయితే, ఈ ప్రొఫైల్ లో మరోక చోటుని చెప్పటం.. ఇలాంటివి చాలా ఉన్నాయి.. ఇవి చెప్పుకుంటూ పోతే లిస్టు కి అంతే లేదు. కనుక అక్కడ చెప్పినవి అన్నీ నిజాలే అని అనుకోకండి. అలాంటివారితో ఎలా జాగ్రత్తగా ఉండాలో టపాలలో వ్రాశాను. మళ్ళీ చూసుకోండి.

న్లైన్ కి వచ్చేవారిలో 22 శాతం మంది సోషల్ సైట్లలో పనులు చక్క పెట్టుకోవటానికి వస్తుంటారు అని ఒక సర్వే.

న్లైన్ స్నేహం అనేది అందమైన ఊబి. రెండువైపులా పదునున్న కత్తి.. ఇలాంటి విశేషణాలు చాలా ఉన్నాయి. జాగ్రత్తగా వాడుకుంటే - ఇదొక అద్భుత వరం. నాకీ విషయం మొదట్లో తెలీదు.. చివరలో తెలుసుకున్నాను. ఎక్కువగా గడపటం వృధా.. చెప్పాగా - ఒకప్పుడు అందులోనే మునిగి తేలేవాడిని. ఇప్పుడు ఇలా వచ్చేసి అలా వెళ్ళిపోతున్నాను. అదికూడా నాకు ఏర్పడ్డ మంచి స్నేహాల్ని - కొనసాగించటానికి మాత్రమే రావాల్సి వస్తున్నది. ఆన్లైన్లో ఎక్కువసేపు ఉండటం మీరు ఉండకండి. మీతో స్నేహాన్ని కొనసాగించాలని అనుకొని మీతో మాట్లాడేవారిని - బాగా శ్రద్ధ తీసుకొండి. అలా జరిగినప్పుడు మీరు చాలా సంతోషముగా ఉంటారు. ఇలా మీరు మొదట్లో చేసినప్పుడు - ఒక పెద్ద ప్రయాసలా అనిపిస్తుంది. కాని కొన్ని బ్రహ్మానందాలు వేచి చూస్తేనే తెలుస్తాయి.

నిజజీవితములో స్నేహాలు ఎలానో, ఈ ఆన్లైన్ స్నేహాలు కూడా అంతే! ఎక్కువగా స్నేహాలు అనుకుంటూ ఉంటే - దానివల్ల మనకి మిగిలేది ఏమీ ఉండదు.. శూన్యం తప్ప. పాత టపాలలో చెప్పానుగా - మన లిస్టు లో చేరాక నెలలోగానే తెలిసిపోతుంది అది ఎంతవరకు ఉండే స్నేహమో.. అందరికీ స్నేహం చెయ్యరాదు. చేస్తున్నట్లు నటిస్తుంటారు. నిజాయితీగా ఉండేవారు చాలా తక్కువ. వారు దొరకటం మీ అదృష్టం అని అనుకోవాలి. అటువంటివారిని మీరు వదులుకోకండి. ఒకవేళ మీ ఇద్దరి మధ్యా ఎదైనా పొరపొచ్చాలు వస్తే వెంటనే సరిచేసుకోండి. 

స్నేహాలు - పరిచయాలు రెండు వేరు వేరు. ఎక్కువ పరిచయాలు ఉండాలి. తక్కువ స్నేహాలు ఉండాలి. అన్నీ స్నేహాలు అనుకుంటూ వెళితే మీకు మిగిలేది వ్యదనే! అన్నింటికన్నా మిక్కిలి విలువైనది - కాలం. కాలం మరియు ఈ స్నేహాల్ని రెండింటినీ చక్కగా బ్యాలన్స్ చేస్తూ పోయినవాడే విజేతగా రూపు దిద్దుకుంటాడు.

క్కువగా మాట్లాడితే ఏమైనా అనుకుంటారు అని అనుకొని, మాట్లాడక అందరినీ దూరం చేసుకుంటారు. మాట్లాడుతుంటేనే కాని స్నేహం ఏర్పడదు. ఇది చాలామంది కి తెలిసినా పాటించరు. అందుకే ఆన్లైన్ బోర్ కొట్టేసి, మరికొన్ని సైటులలో జాయిన్ అయ్యి - అక్కడా స్నేహాలు సారీ..పరిచయాలు చేసుకొని - సమయం అంతా అందులోనే గడుపుతూ జీవితాన్ని పాడు చేసుకుంటారు. 

continue..

2 comments:

వనజ తాతినేని/VanajaTatineni said...

చాలా బాగా మనసుకి నాటుకుంధి. ఎంత బాగా చెప్పారు.చాలా విలువైన విషయాలు.అందరికి ఉపయోగం.ధన్యవాదములు.రాజ్ గారు

Raj said...

మీ స్పందనకి కృతజ్ఞతలు..

Related Posts with Thumbnails