Wednesday, June 1, 2011

Social NW Sites - 32 - Updates in Orkut

ఎవరైనా మన సోషల్ నెట్వర్క్ స్నేహితుడు మనకి స్నేహితుడయ్యాక, ఆన్లైన్ లోకి వస్తున్నాడా? లేడా? అని తెలుసుకోవటం మొదట్లో కాస్త చాలా కష్టముగా ఉండేది. ఇప్పుడు కొద్ది వారాల నుండి కాస్త తేలిక అయ్యింది. ఇది అన్ని సోషల్ సైట్లకి వర్తించదు. కేవలం ఆర్కుట్ కి మాత్రమే వర్తిస్తుంది. ఇది గమనించగలరు. మిగతా సైట్ల సంగతి తెలీదు.

కొంత మంది మనకి ఆడ్ అయ్యాక, అవక ముందు ఏమేమి చూడాలో మీకు చాలా విషయాలు చెప్పాను. కొద్ది వారాల క్రిందట ఆర్కుట్ మూడో వెర్షన్ కి మారింది. అందులోని ఒక ఫీచర్ గురించియే మీకు చెప్పేది. పాత వర్షన్ -పాత ఆర్కుట్ లో మీకు ఆడ్ అయిన లేదా, మీ స్నేహితుని అప్డేట్ చూడాలంటే ఈ క్రింది ఫోటోలో ఎర్రని వృత్తములో చూపినట్లుగా, update అనే వద్ద నొక్కేవారు.

ఇలా ఇక్కడ నొక్కాక, మీకు ఆ స్నేహితుడి వారం రోజుల అప్డేట్స్ మాత్రమే మీకు అక్కడ కనిపించేడిటివి. మీ స్నేహితుడు ఆ ఏడు రోజుల్లో ఏమీ అప్డేట్ చెయ్యకుంటే అక్కడ ఏమీ కనిపించవు (క్రింది ఫోటో చూడండి.). అంటే వారం రోజుల వరకూ ఆన్లైన్ కి రావటం లేదు అన్నా, నిజమే అనుకోవచ్చును.

కాని కాలం మారింది. మీ ఈ నూతన ఆర్కుట్ - మూడో వెర్షన్ (ప్రస్తుతపు - న్యూ ఆర్కుట్ - ఇది అందరికీ ఉంటుంది.) లోని అప్డేట్ ని నొక్కితే -  


స్నేహితుడు ఆడ్ అయ్యాక గానీ, ఆడ్ రిక్వెస్ట్ పెట్టినప్పుడు గానీ, కొద్దిరోజులుగా ఆన్లైన్ లోకి రావటం లేదు అన్నప్పుడు,

వారు ఎప్పుడెప్పుడు వారి స్టేటస్ మెస్సేజ్ మార్చారు,

వారు ఎప్పుడెప్పుడు వారి ప్రొఫైల్ నేమ్ మార్చారు,

వారు ఎప్పుడెప్పుడు ఇతరులు పంపిన టెస్టిమోనియల్స్ ఓకే చేశారు,

ఎప్పుడు ఎవరిని మిత్రులుగా చేర్చుకున్నారు,

వారి ఫొటోస్ కి ఎవరు ఎప్పుడు ఎవరు కామెంట్స్ వ్రాశారు,

ఆ స్నేహితుడు ఏ ఏ కమ్యూనిటీ లోకి ఎప్పుడు చేరాడు,

ఏమేమి ప్రొఫైల్ థీమ్స్ మార్చుకున్నారు,

ఏ ఏ వీడియోలు ఆడ్ చేసుకున్నారు,

ఏ ఏ అప్లికేషన్స్ ఆడ్ చేశారూ,

ఎప్పుడేప్పుడు వారి అబౌట్ మీ మార్చారు,

ఎప్పుడెప్పుడు వారి ఫోటో ఆల్బం లోకి ఏమి చేర్చారు (లాక్ లో ఉన్నవి కావు)

ఇలాంటి విషయాలు అన్నీకనిపిస్తాయి. వారు ఇక అబద్దం ఆడలేని పరిస్థితి. అలా ఓపెన్ చేశాక క్రిందన ఉన్న Show more updates ని నొక్కుకుంటూ వెళితే సరి. దాదాపు ఆరు నెలల దాకా వారు చేసిన అప్డేట్స్ కనిపిస్తాయి.


ఈ విషయం తెలీని నా మిత్రుని బండారం బయటపడింది. అది ఎలా అంటే - నా మిత్రున్ని - "నా స్క్రాప్ కి రిప్లై ఇవ్వలేదు ఏమిటీ.." అన్నాను.
అతను "నేను ఆన్లైన్ కి రాలేదు కనుక మీ స్క్రాప్ చూడలేదు, చూస్తే రిప్లై ఇవ్వనా.." అన్నాడు.
"అవునా..?" అని అన్నాను.
దానికి అతడు "నిజం అన్నా.." అని అన్నాడు.
"ఒక్క నిముషం.." అని చెప్పి న్యూ ఆర్కుట్ లో అతని పేజీ ఓపెన్ చేసి, అతని డీపీ క్రింద ఉన్న His updates నొక్కి చూశాను. ఆ రోజు ఒక ఫోటో అప్లోడ్ చేశాడు. ఒక టెస్టిమోనియల్ అక్సేప్ట్ చేశాడు. అది చూసి అతనితో చెప్పాను.
"కాదన్నా.. నేను రాలేదు.." అన్నాడు.
"ఓకే!.. మీరు రాలేదుగా.. సరే! నమ్మాను.. కాని - ఒక నిముషం తరవాత మీ మెయిల్ బాక్స్ ఓపెన్ చేసి చూడండి.. అప్పుడు మీరే నమ్ముతారు" అని అన్నాను.
వెంటనే అది స్క్రీన్ షాట్ తీసి అతనికి మెయిల్ చేశాను - "చూడమని" చెప్పాను.
"చూస్తాను.. ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను.. " అని అన్నవాడు - కాసేపటికే చాట్ నుండి కనీసం బై చెప్పకుండా జంప్.
ఆ తరవాత అతన్ని నమ్మటం తగ్గించాను. స్నేహం అంటేనే నమ్మకం. ఇలా అబద్దాలు ఆడేవారిని మైంటైన్ చేస్తే రేపు ఇంకెన్ని అబద్ధాలు ఆడుతాడో!. జస్ట్ మరచిపోయాను సారీ.. అని చెపితే సరిపోయేదిగా.

ఇప్పుడు - మీ స్నేహితుడు, మీతో ఎంత పారదర్శకతతో (Transperancy) స్నేహం చేస్తున్నాడో తెలిసిపోతుంది. దాన్ని బట్టి మీ స్నేహం ఏ స్థాయిలో ఉందో ఒక అంచనాకి రావచ్చును. వారు చెవిలో పెట్టే పూలని తెలివిగా తప్పించుకోవచ్చును.

4 comments:

vanajavanamali said...

That's right..Good Information

Raj said...

ధన్యవాదములండీ..

నాగస్వరం said...

మీ VALUABLE LESSONS బ్లాగ్ చూశాను.చదివాను.
నిజంగా బ్లాగ్ పేరును సార్థకం చేసేలా వ్యాసాలున్నాయి.
చాల బాగుంది.

ఇలా ఉపయోగకరంగా వ్రాస్తూండండి.

శుభాభినందనలు.

నాగస్వరం.

Raj said...

మీ అభిప్రాయానికి, నచ్చిందులకూ చాలా కృతజ్ఞతలు..
ఇంకనూ వ్రాస్తుంటాను..

Related Posts with Thumbnails