Tuesday, May 3, 2011

Bonthapally - Sri Veera Bhadra Swamy Temple.

ఆ మధ్య ఎందుకో వీరభద్ర స్వామి ఆలయం గురించి విన్నాను. బాగుంది అంటేనూ వెళ్లాలని అనిపించింది. ఒకసారి మధ్యలో వెళ్లాలని ప్రయత్నించాను. కాని బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.. ఆ సమయంలో - ఆ రద్దీ లో ఏమి దర్శనం చేసుకుంటామని అనుకొని, ఆ రద్దీ అంతా అయిపోయాక ఒక రోజు వీలుచూసుకొని వెళ్ళాము. రద్దీ లో వెళ్ళే దానికన్నా, ఎక్కువగా రష్ లేని సమయాల్లో వెళితేనే చాలా బాగుంటుంది - అని పర్యటనల అనుభవం. అందుకే ఈ నెలలో వెళ్లాను.

కాస్త గుడి గురించి తెలుసుకున్నాను.. ఇంటర్నెట్ లో వెదికాను. ఎక్కువగా సమాచారం లేదు.. పరవాలేదు అనుకోని బయలుదేరాను. వీర భద్రుడు అంటే - శివుని ప్రమథ గణాలకి అధిపతి. అంటే శివుని యొక్క సైన్యానికి సేనాధిపతి అన్న మాట. ఈ వీరభద్రుల ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి. భారతదేశములోని ఆంధ్రప్రదేశ్ రాజధానికి అతి చేరువగా ఉన్న ఒక వీరభద్ర స్వామీ గుడిని సందర్శనా నిమిత్తం ఎంచుకున్నాను. ఒక ఆదివారం వీలు చూసుకొని, ఉదయాన గుడికి బయలు దేరాను. గుడి యొక్క రహదారి మ్యాప్ ని గూగుల్ వాడి సహాయాన మీకు చూపిస్తున్నాను. ఈ ఫోటోలమీద రెండు సార్లు నొక్కితే ఫోటో పెద్దగా స్పష్టముగా కనిపిస్తుంది.

ఈ గుడి సికింద్రాబాద్ లోని బాలానగర్ నుండి, నర్సాపూర్, మెదక్ రహదారి మీద దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరములో ఉంది. చాలా తొందరగా చేరుకోవచ్చును. ఉదయం తొమ్మిదికి బయలుదేరాను. రద్దీ పెరగక ముందే వెళ్ళాలనుకొని వెళ్లాను. అలా అయితేనే దర్శనం ఏ తోపులాటలూ, క్యూ లేకుండా ఈజీగా దర్శనం చేసుకోవచ్చును అని నా ఆలోచన.


ఆ ఎర్రని రింగ్ వద్ద మీకు ఎడమ వైపున ఒక కమాన్ ఇలా మీకు కనిపిస్తుంది.


ఈ కమాన్ గుండా అక్కడక్కడా కాస్త దెబ్బ తిన్న రోడ్డు మీద మూడు కిలోమీటర్స్ లోపలి వెళ్ళితే అప్పుడు మీకు గుడి కనిపిస్తుంది. 


ఈ కమాన్ నుండి మీకు ఆటోలు చాలా దొరుకుతాయి ఆటో లో ప్రయాణానికి ఒక వ్యక్తికి ఐదు రూపాయలు తీసుకుంటారు. అలా తిన్నగా గుడి వద్దకి వచ్చేశామా!..


ఇక్కడ ఈ బసవ విగ్రహం వద్ద ఆపేస్తారు. ఇక్కడే వారివారి వాహనాలని పార్కింగ్ చేసుకోవాలి. 


ఇదే ఆ శ్రీ వీరభద్ర స్వామీ వారి గుడి. ముందూ, ప్రక్కన పసుపు రంగులో ఉన్నవి అతిథి గృహాలు. అంతగా శుభ్రముగా ఉండవు. అడ్జస్ట్ అవ్వాలి. గుడి లోపలా కొన్ని అతిధి గృహాలు ఉన్నాయి. కాని వాటి నిర్వహణ అంతంత మాత్రమే!. అలా కాస్త ముందుకి వెళితే -


భారీ సిమెంట్ నందీశ్వరుడు ముందు ఆలయం కనిపిస్తుంది.


ఇదే సిమెంట్ భారీ నందీశ్వరుడు.


ఆ నందీశ్వరుడి ప్రక్కగా, ఉత్సవాల్లో ఊరేగించే, స్వామి వారి రథం మీకు అనిపిస్తుంది.


ఇలా మీకు ఆలయ ప్రవేశ ద్వారం కనిపిస్తుంది. మీ ఎడమవైపున పాదరక్షలని ఉంచే షెడ్ కనిపిస్తుంది.


ఆ పాదరక్షల షెడ్ వద్ద నుండి ఆలయ ప్రవేశ ద్వారం ఇలా కనిపిస్తుంది..


దాని ప్రక్కనే - అరవై గదులు కట్టేందుకై చందాల కోసం - ఫ్లెక్సి ప్రకటన.


ఇక గుడిలోకి వెళదాం. ఇదే గుడి లోపలి భాగం. గుడి రాజ గోపురం గుండా లోనకి వెళితే ఇలా మీకు కనిపిస్తుంది.

ఇక్కడ నుండి కొన్ని ఫోటోల మీద మూలాన గుడి మ్యాప్, ఫోటో యాంగిల్, మీకు ఎర్రని చుక్క ద్వారా తెలియచేస్తున్నాను. దాని వల్ల గుడి రూపాన్ని బాగా తెలుసుకుంటారని చూపిస్తున్నాను. ఇది ఇలా చూపిస్తే మీకు గుడిని కళ్ళకి కట్టినట్లుగా చూపిస్తాను అని నా ఆలోచన. నచ్చినా, (ఎందుకు)నచ్చలేకున్నా ఈ విషయం మీద కామెంట్స్ పెట్టండి.




ఇది గుడి మంటపం ఎదురుగా ఉన్న షెడ్ లాంటిది. ఇక్కడ ద్వజ స్థంభం, రాతి నందీశ్వరుడు కనిపిస్తారు. ఈ ఎడమ ఉన్న గేటు గుండా స్వామివారి దర్శనానికి వేల్లోచ్చును.








ఇది దాటగానే కళ్యాణ మంటపం కనిపిస్తుంది. అందులో భక్తులు, పూజలూ, వ్రతాలూ, నోములూ చేసుకుంటారు. ఆలయ కమిటీ వారిని సంప్రదిస్తే, వారు వివరాలు తెలియచేస్తారు. నేను కేవలం దర్శనం కోసమే వెళ్లాను కాబట్టి, ఏమీ చెప్పలేకపోతున్నాను.




దీన్ని దాటుకొని ఎడమ ప్రక్కన ఉన్న ఇనుప రెయిలింగ్ క్యూ లో వెళ్ళితే శ్రీ వీరభద్ర స్వామీ వారి ఆలయం వస్తుంది. ఆ వీరభద్రుడి ప్రక్కన గణపతి గుడి కనిపిస్తుంది. 



ఇదే వీరభద్రుని ఆలయం. అన్ని ఆలయాల్లో ఎదురుగా ప్రవేశ ద్వారం ఉంటుంది. కాని ఇక్కడ మాత్రం ప్రక్క నుండి ప్రవేశం ఉంటుంది. ఇలా ఎందుకు అంటే - ఇక్కడ ఉన్న వీరభద్ర స్వామి వారు చాలా రౌద్ర రూపములో ఉంటాడు. మన పై ఆఫీసర్ బాగా కోపముగా ఉన్నప్పుడు ఎదురుగా వెళ్లలేముగా. అలా ఇదీ కూడా అంతే!. మనకు తెలీకుండా అగౌరవముగా ఆ స్వామి వారికి ఆగ్రహం తెప్పించి, వారి ఇబ్బందులకి గురికావద్దనేది. అందుకే ఇలా ఏర్పాటు చేశారు. ఇలా అన్ని గుళ్ళల్లో ఇలాగే చెయ్యాలి. ఆయా ఆలయాల్లో మూల విరాట్ కి ఎదురుగా నిలబడనీయరు. ఈ ఒక్క నియమం శని దేవుడి ఆలయాల్లో నిషేధం. ఎందుకూ అంటే శని దేవుడి వక్ర (వంకర) చూపు అంత మంచిది కాదు. అలా ఆయన వక్ర చూపుకి గురి అవుతే, వారు బాగా ఇబ్బందులకీ, కష్టాలకీ గురి అవుతారని ఒక విశ్వాసం. అందుకే శని దేవుడి ముందు ఎదురుగా ఉండి, పూజ చేసుకోండి.

ఇక లోపలి వెళ్లి మనసారా స్వామివారి దర్శనం చేసుకున్నాను. ఇవన్నీ తెలిసి స్వామి వారిని ఫోటో తీసే సాహాసం చెయ్యలేకపోయాను. చేసి ఆగ్రహం గురి కావద్దనుకొని ఆగిపోయాను. నాలుగు సార్లు అలా మదినిండా దర్శనం చేసుకొని ఆ స్వామి వారి సన్నిధి నుండి బయటకు వచ్చాను. అలా కుడి వైపుగా బయటకి వచ్చాక ఆ స్వామి వారి ఆలయం ఇలా కనిపిస్తుంది.







ఆ తరవాత ఆ స్వామి వారి ఆలయం వెనకాల, ఎత్తులో భద్రకాళి అమ్మవారి గుడి ఉంటుంది. అక్కడికి వెళ్లాను.


ఈ మెట్లక్కి ఆ దేవీ గుడిలోకి వెళ్లాం.





ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని, కాసేపు అక్కడే విశ్రమించాం. ఈ దేవీ విగ్రహానికి ఎదురుగా ఎత్తు గద్దె మీద ఐదు శ్రీచక్ర గ్రానైట్ ఫలకాలు ఉంటాయి. దంపతులు ఇక్కడ అమ్మవారి సన్నిధిలో శ్రీ చక్ర కుంకుమార్చన పూజ చేయించుకోవచ్చును. అలా కాసేపు ఉన్నాక బయటకి వచ్చేశాం. బయట ఆలయం వారు అమ్మే లడ్డూలు, పులిహోర, మినప వడల ప్రసాదం కొనేసి, బయటకి వచ్చేశాం. ఆ ప్రక్కగా స్వామివార్ల అద్దాల మండపం ఉందీ అంటే అటుగా వెళ్లాను.



అలా స్వామి వారల వేవేల రూపాలని తన్మయముగా వీక్షించాను.


ఇక ఆ రాజగోపురం గుండా బయటకి వచ్చేశాం. పునర్దర్శన ప్రాప్తిరస్తు.

5 comments:

Rao S Lakkaraju said...

బాగుంది కానీ ఇంకొంచెము ఎక్కువ వ్రాస్తే ఇంకా బాగుంటుంది. పెర్సోనలైజే చెయ్యండి. ఎన్నింటికి వెళ్లారు. ఎలా వెళ్లారు. అప్పుడేమి జరుగుతోంది. మొదలయినవి. అల్లా అయితే మీ కళ్ళతో చూసింది మీ మాటల్లో వింటూ మేము కూడా చూస్తున్నట్లు అనుభూతి పొంది ఆనందిస్తాము.

Anonymous said...

నమస్కారమండీ !
టపా కి సందర్భం లేని వ్యాఖ్య వ్రాస్తున్నందుకు మన్నించాలి
మన తెలుగు బ్లాగ్లోకంలోని అన్ని బ్లాగులనీ ఒకేసారి చూసేందుకు వీలుగా, విన్నూత్నమైన సాంకేతిక సౌలభ్యాలతో కొత్తగా "
సంకలిని

" మీ ముందుకు తెచ్చాము.
ఈ సంకలినిలో ప్రత్యేకతలు
1.ఇప్పుడున్న ఏ తెలుగు బ్లాగుల సంకలినికి లేనటువంటి వేగం సంకలిని సొంతం
2. హాస్యం, సాహిత్యం, సాంకేతికం రాజకీయ విభాగాలు ఒకే ఒక్క క్లిక్కుతో మీకు నచ్చిన ఏ విభాగానికైనా చేరుకునే సౌలభ్యం
ముందుమాట అనే పేజి లో సంకలిని యొక్క ప్రత్యేకతలు వివరించబడ్డాయి
ఒకసారి విచ్చేసి మీ అమూల్యమైన సలహాలూ సూచనలు దయతలచ ప్రార్ధన. అలాగే మా ప్రయంతం మీకు నచ్చినట్లైతే ఇకనుండీ తెలుగు బ్లాగ్విహారానికై మా సంకలిని ఉపయోగించమని సవినయంగా మనవి.

ఇట్లు
సంకలిని బృందం

Raj said...

Rao S Lakkaraju గారు! దాదాపుగా అన్ని వివరాలు ఇందులో చేర్చాను. అన్ని వివరాలు తెలిసేలా ఫోటోలు ఎక్కువగా పెట్టాను. వాటిలోనే అన్ని వివరాలు ఉన్నాయి అని అనుకుంటున్నాను.

ఈ సూచన చేసినందులకు మీకు నా కృతజ్ఞతలు.

Anonymous said...

Temple valla number post chyandi please

Raj said...

Alayam vaari phone number ikkada isthunnaanu..
Valladi land phone number matrame dorikindi. Adee online lo.. Adi panichesthunnado ledo koodaa teeleedu. Okasaari contact chesi adagandi.
Phone number : 08455275232

Related Posts with Thumbnails