Friday, February 4, 2011

Social NW Sites - 12 - ఫ్రెండ్ ఆడ్ రిక్వెస్ట్ వస్తే?

ఇప్పుడు మీకు మీ ప్రొఫైల్ కి ఆడ్ రిక్వెస్ట్ వస్తే - ఏమి చెయ్యాలో, ఎలా చూడాలో చెబుతాను. మీకు ఎక్కువగా ఉపయోగపడే టపా ఇదే అని అనుకుంటున్నాను. మీరు దీనికోసమే ఎదురుచూస్తున్నారనీ అనుకుంటున్నాను. ఓకే..ఓకే..

మనకి వేరేవారి నుండి ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే - వెంటనే అంగీకరించటం అంత మంచిది కాదు. జాగ్రత్తగా స్నేహితులని ఎన్నుకోవాలి. మనకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అన్నది ముఖ్యం కాదు. ఎంతమంది మనపట్ల ఆసక్తి చూపుతూ, స్నేహం చేస్తున్నారన్నది ముఖ్యం. మన ప్రొఫైల్ కి 500 స్నేహితులున్నా, 800 స్నేహితులున్నా అందులో ఒక వారములో మనతో మాట్లాడేది ఎంత ఎక్కువగా లేక్కేసుకున్నా యాభై మందికి మించరు. నెలకి వందమంది కన్నా మించరు. మిగతావారు అలా స్నేహితులుగా జాయిన్ అయ్యి, అలా మూలన కూర్చొని - మన పేజిలో ఎవరు ఏమి వ్రాస్తున్నారో, మనం ఏమేమి అప్డేట్స్ చేస్తున్నారు, ఎవరితో ఏమి మాట్లాడుతున్నారూ అని చూస్తూ కూర్చుంటారు. వారికి మనం స్క్రాప్స్ పెట్టినా, ఫోటో పెట్టినా, గ్రీటింగ్స్ పెట్టినా ఉలకరూ, పలకరూ.. గోడకి కొట్టిన పిడకల్లాంటి వారు.  ఇలాంటివారు మనకి అవసరమా..? వారంతట వారు ఏమీ పలకరించరు. అది పోనీయ్యండి. మన ఫ్రెండ్ లిస్టు లో ఉండి - మనం పలకిరిస్తేనే కూడా పలకని మహానుభావులు కూడా మనకి ఇక్కడ ఫ్రెండ్స్ గా కోకొల్లలుగా దొరుకుతారు. మన మీద ఇంత నిఘా పెట్టుకోవటానికి వీళ్ళని నియమించుకోవటం సరియైన పద్దతా..? వింటూనే ఏదోలా ఉంది కదూ.. ఇలాంటివారిని మొదట్లోనే ఆడ్ చేసుకోక రిజెక్ట్ చెయ్యటం మంచిది. ఇప్పుడు ఆ పద్ధతులేమిటో తెలుసుకుందాము.

సరే!.. మన ప్రొఫైల్, ఫొటోస్, కమ్యూనిటీలు చూశాక - నచ్చేసి, మనకు ఎవరైనా ఆడ్ రిక్వెస్ట్ పెట్టారు అనుకుందాము. అప్పుడు మీరు ఈ క్రింది విషయాలని వారి ప్రొఫైల్ దాంట్లో బాగా పరిశీలించండి. అన్నీ చూశాక చేసే స్నేహం ఏమిటో అని మీరు అనుకోవచ్చు. కానీ ముక్కూ, మొహం, కాస్త డిటైల్స్ కూడా తెలీని వ్యక్తితో ఎలా మాట్లాడగలం.? ఆడ్ చేసుకున్నాక మన స్నేహితునిగా ఉండటానికి సరియైన వ్యక్తి కాకపోవచ్చును. అలాంటప్పుడు అతన్ని మన ఫ్రెండ్స్ లిస్టు నుండి తీసేస్తే - వారిని నొప్పించినవారిమి అవుతాము. వారు - నన్నెందుకు మీ ఫ్రెండ్ లిస్టు నుండి తీసేశారు అని అడిగితే, చెప్పుకోవటం కాస్త కష్టం గానే ఉంటుంది. అలాగే మన పర్సనల్స్ చూపించినవారిమీ అవుతాము. మన సమయమూ వృధా చేసుకున్నవారము అవుతాము. అందుకే మొదట్లో కాస్త శ్రమ అని అనుకోకుండా కొన్ని విషయాలు గమనించండి. అప్పుడు మీకు చాలా చాలా విషయాలు తెలుస్తాయి. చాలా మంది ఇలా చూడక వెంటనే ఒప్పేసుకొని అనక తీరిగ్గా బాధపడతారు. నేనూ మొదట్లో అలాగే బాగానే దెబ్బలు తిన్నాను. ఆ అనుభవాల సారమే ఇది.

మనకి ఆడ్ రిక్వెస్ట్ రాగానే వెంటే ఒప్పేసుకోవటం సరికాదు. ముందుగా మీ ప్రొఫైల్ లో మీకు వచ్చిన స్క్రాప్స్ అన్నింటికీ సమాధానాలు ఇవ్వండి. ఆ తరవాత అప్డేట్స్ చూడండి. వాటికీ రిప్లైస్ ఇవ్వండి. ఆ తరవాత మీ అప్డేట్స్ చెయ్యండి. ఇంతలోగా మీరు ఇచ్చిన రిప్లైస్ కి ప్రతిగా ఏమైనా స్క్రాప్స్ వస్తే వాటికి జవాబు ఇవ్వండి. ఆ తరవాత మీకు అంత హడావిడి ఉండదు. అప్పుడు ఆ ఆడ్ రిక్వెస్ట్ ని చూడండి. ఆ ఆడ్ రిక్వెస్ట్ ప్రొఫైల్ పేరు లింక్ మీద నొక్కితే ఆ పేజిలో ఉంటారు. అప్పుడు ఈ క్రింది విషయాలని ఒక్కొక్కటిగా గమనించండి.

1. అతని ప్రొఫైల్ పేరూ, ఊరూ డిటైల్స్. వారి ప్రత్యేకత ఏమిటీ?

2. అతని డీపీ. (Display Picture)

3. వారి ప్రొఫైల్ ఎలా ఉంది. తన గురించి ఎంతగా చెప్పారు.?

4. ఫోటో ఆల్బమ్స్.

5. వీడియోలు.

6. పాల్గొంటున్న కమ్యూనిటీలు.

7. టెస్టిమోనియల్స్.

8. అతని మిత్రులు వారికి యే విధముగా భావిస్తూ స్క్రాప్స్ పంపుతున్నారు.?

9. వారు ఇతర మిత్రులకు ఎలా స్క్రాప్స్ పంపుతున్నారు.?

10. మిత్రులతో వారు యే విధముగా వ్యవహరిస్తున్నారు.?

- ఇవి ముఖ్యమైనవి. చూస్తుంటే ఇవన్నీ సిల్లీ ప్రశ్నలుగానే అనిపిస్తాయి. మొదట్లో నాకూ ఇలాగే చెబితే నమ్మలేదు. కానీ అనుభవాలు ఇంకా బలమైనవి కదా!.. అలా నేర్చుకున్నవి కాబట్టి - ఇపుడు కాస్త జాగ్రత్తగా ఉంటున్నాను. లేకుంటే నాకొచ్చిన ఆడ్ రిక్వెస్ట్ లు అన్నీ ఒప్పుకొని ఉంటే వేయి మార్క్ చేరుకునే వాడినేమో. (ఒక ప్రొఫైల్ కి వేయి మంది మిత్రులు కన్నా ఆడ్ కారు.) పై పది ప్రశ్నలూ - మీకు వచ్చిన ఆడ్ రిక్వెస్ట్ ప్రొఫైల్ కి వేసుకొని చూడండి. ఒక్కో ప్రశ్నకి ఒక్కో మార్కు వేసుకోండి. ఒక్కో సమాధానానికి / మీకు కలిగిన ఫీలింగ్ కి - Waste, Fine, Good - అన్న వాటిల్లో ఏదో ఒకదానికి మార్క్ వేసుకుంటూ చూడండి. అన్ని ప్రొఫైల్స్ కూడా పదికి పది మార్కులు రావు. అలాంటివి అరుదు. మీకు ఇందులో Fine, Good అన్న వాటికి సగానికి పైగా మార్కులు వచ్చాయి అని అనుకుంటే - ఆడ్ చేసుకోవచ్చును. సులభముగా అర్థం కావటానికి ఈ క్రింది పట్టిక చూడండి. అయినా పదికి పది ఉన్న ప్రోఫైల్స్ ఉన్నవారి నుండి మీకు ఆడ్ రిక్వెస్ట్ రావటం కష్టం. వారు దొరకరు. కనీసం సగం మార్కులు వచ్చినా (ఐదు మార్కులు వచ్చినా) ఆడ్ చేసుకోండి. లేకుంటే మీకంటూ స్నేహితులు మిగలరు.


ఇలా వ్రాసుకోవాలి అని కాదు.. ఆలోచనలని జస్ట్ ఒక రూపం లోకి తేవటానికీ, అలాగే మీకూ సులభముగా అర్థం కావాలని చెప్పటం. Fine లో గానీ, GOOD కాలమ్ లో ఐదుకి పైగా వస్తే మీరు వారిని ఓకే చేసుకొని, మీ మిత్రులుగా ఆడ్ చేసుకోవచ్చును. Waste లో ఐదుకన్నా ఎక్కువే వస్తే మీరు ఆ ప్రొఫైల్ ని రిజెక్ట్ చేసింది బెస్ట్ అని నా అభిప్రాయం. పై పది లక్షణాల్నీ ఒక్కొక్కటిగా వివరముగా ఇప్పుడు వేరు వేరు టపాల్లో తెలుసుకుందాం.

ఇలా చేస్తే మొత్తానికి మంచి ఫ్రెండ్స్ దొరుకుతారని హామీ ఇవ్వలేను. కానీ చెత్త ప్రోఫైల్స్ గల వారు దొరకుండా చూసుకోవచ్చును. ఇలాంటి వేస్ట్ ప్రోఫైల్స్ వారిని వదిలెయ్యటం మంచిది. మన అమూల్య సమయం వారిమీద వాడటం కన్నా, క్రొత్తగా నేర్చుకునే విషయాల మీద ఆ సమయాన్ని కేటాయించటం ఉత్తమం. అదే బెస్ట్.

మొదట్లో నేనూ అలాగే ఉండేవాడిని. గత సంవత్సరములో కొద్దిగా మారాను. నాకు తెలీని క్రొత్త విషయాల మీద పట్టు సాధించటం మొదలెట్టాను. చాలా మారాను. చాలా చాలా క్రొత్తవి తెలుసుకున్నాను. తెలుసుకుంటూనే ఉన్నాను. నా ఇంటర్నెట్ కాలాన్ని రెండు భాగాలుగా చేస్తే - ఆ రెండో భాగం లోనే నేను ఎక్కువగా నేర్చుకున్నాను. వాటివల్ల ఇంకా ఆనందం పొందుతున్నాను. నాకు ఒక వందమంది మిత్రులు ఉంటే చాలు అనుకున్నాను. అందులో యాభై మంది ఆక్టివ్ లో ఉంటారని అనుకున్నాను.. ఆ అంచనాలో ఉన్న నాకు - నన్ను అభిమానించే, గౌరవించే కనీసం యాభై మంది మిత్రులని పొందగలిగాను. ఇక నాకు ఈ మంది చాలు.
updated on :
1st : 5 - February - 2011 Morning

2 comments:

Related Posts with Thumbnails