Friday, December 30, 2011

Amma avanee - Rajanna

చిత్రం : రాజన్న (2011) 
రచన : శివదత్త 
సంగీతం : ఎం. ఎం. కీరవాణి 
గానం : మాళవిక. 
*******************
పల్లవి : 
అమ్మా .. అవనీ..
అమ్మా అవనీ నేలతల్లీ అని  - ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకనీ // అమ్మా //

అను పల్లవి :
కనిపించిన ఒడిలోనే కనుమూయనీ
మళ్ళీ ఈ గుడిలోనే కళ్ళు తెరవనీ // అమ్మా // 

చరణం 1 
తల్లీ నిను తాకితేనే - తనువు పులకరిస్తుంది.
నీ ఎదపై వాలితేనే - మేను పరవశిస్తుంది.
తేట తెలుగు జాణ - కోటి రతనాల వీణ
నీ పదమూలాన నువ్వే - నాకు స్వర్గం కన్న మిన్న // అమ్మా // 

చరణం 2 
నీ బిడ్డల శౌర్య ధైర్య సాహాస గాథలు వింటే
నరనరాలలో రక్తం ఉప్పొంగుతుంది
రిగగ రిగగ రిగ (3)
రిగరి సదప దస.. రిగగ రిపప గడదద పడదద..
సదసద.. సదసద పగపద
పద పద.. పద పద.. (2)
సాస సాస సాస సాస - రీరి
సాస సాస సాస సాస - గాగ
రిగరిస రిగరిస.. రిగరిస రిగరిస
సరి సరిగా రిసగారిసగారిస
రిగరిగ - పా.. గరిసదపా
గాప పద దస - సరి గరిసద
పద దస సరి - రిగ పగారి సారీ గా పా
రిసద పదస రిగ - పా
సరిగా పదస రిగ - పా
గప గారి సరిసద
వీరమాతవమ్మా - రణధీర చరితవమ్మా
పుణ్యభూమివమ్మా
నువ్వు ధన్యచరితవమ్మా
తల్లి కొరకు చేసే ఆ త్యాగమెంతదైనా
దేహమైన ప్రాణమైన - కొంచమే కదమ్మా
అది మించిన నాదన్నది - నీకీగలదేదమ్మా // అమ్మా //  

Tuesday, December 20, 2011

Show desktop

సాధారణముగా సిస్టం మీద పని చేసేటప్పుడు, అవసరాలరీత్యా తెరపైన ఎన్నెన్నో పేజీలు ఓపెన్ చేస్తుంటాము కదా.. ఒక్కోసారి మానిటర్ మీద ఉన్న షార్ట్ కట్స్ వాడుకోవటానికి, అన్నీ మినిమైజ్ చేసి, ఆ షార్ట్ కట్ ని వాడి, ఆ మినిమైజ్ చేసిన పేజీలన్నీ మళ్ళీ మాక్సిమైజ్ చేసుకుంటాము కదా.. మీరు వాడుతున్నది Windows 7 అయితే - ఇలా ఒక షార్ట్  కట్ ఆప్షన్ ని వాడుకోండి.

మానిటర్ స్క్రీన్ మీద కుడి క్రింద మూలాన, సిస్టం ట్రే లో మూలాన ఉండే ఒక నిలువు డబ్బా మీద కర్శర్ ని ఉంచగానే ఇలా కనిపిస్తుంది. అలా కనిపించగానే, ఓకే చేస్తే - అందాక ఓపెన్ చేసిన పేజీలన్నీ, మినిమైజ్ అవుతాయి. ఆ షార్ట్ కట్ లింక్ ఓపెన్ చేసుకున్నాక టాస్క్ బార్ మీద ఉన్న బ్రౌజర్ ని నొక్కేస్తే, అందాక మినిమైజ్ చేసినవన్నీ అన్నీ ఓపెన్ అవుతాయి.


లేదా మౌస్ ని వాడి అలా చెయ్యటం ఇష్టం లేకుంటే - సింపుల్ గా మీ కీ బోర్డ్ లోని - కంట్రోల్ బటన్ ప్రక్కన ఉండే విండోస్ బటన్ + D అనే కీ ని రెండింటినీ ఒకేసారి నొక్కండి. అన్నీ మినిమైజ్ అయ్యి, మీ డెస్క్ టాప్ స్క్రీన్ మీద షార్ట్ కట్స్ కనిపిస్తాయి. మళ్ళీ మినిమైజ్ చేసిన పేజీలు అన్నీ రావాలని అనుకుంటే - మళ్ళీ Windows key + D ని నొక్కండి. 




Friday, December 16, 2011

కొత్తిమీర - హోల్ సేల్.

మొన్న వేరే పని మీద అలా వెళ్ళేసి, అటునుండి అటే కూరగాయల మార్కెట్ కి ఉదయాన్నే వెళ్లాను. అలా కూరగాయలు కొంటున్న ప్రక్కనే కొద్దిమంది గుంపుగా బేరాలు సాగిస్తుంటే యధాలాపముగా విన్నాను. " ఇంకో కట్ట కూడా వేసేయ్.. మూడు ఇచ్చేసేయ్.. " అని అంటున్నారు. ఏమిటా అని చూశాను.

అక్కడ ఒకతను లుంగీలో కొత్తిమీర కట్టలు పట్టుకోచ్చేసి, దాన్ని నేల మీద పెట్టి, మార్కెట్లో అమ్ముతున్నాడు. పంట పండించినట్లున్నాడు. ఒక్కో కట్ట లావుగా ఉంది. అక్కడికి వచ్చి బేరం చేస్తున్నవారు ఆ మార్కెట్ లో రెగ్యులర్ గా కూరగాయలు అమ్మేవారు. " రెండు కట్టలు కాదు మూడు ఇచ్చేసేయ్.. కిలోకి అంతే వస్తాయి.. రోజూ మేము అమ్ముతాము కదా.. మాకు తెలీదా.. కావాలంటే తూచుదాం.." అని వాళ్ళల్లో ఎవరో అంటే అందరూ సై అన్నారు. అలా వాటిని తూచే సరికి కిలోకి మూడు కట్టలు వచ్చాయి. అది ఇక ఫిక్స్ అయ్యింది. 

నాకూ ఇంట్రెస్ట్ అనిపించి ఎలా కిలో అడిగితే - నన్ను చూసి, ఒక్కళ్ళూ మాట్లాడలేదు. వినియోగదారుడిని అనుకొన్నారులా ఉంది. ఆ అమ్మేవాడినీ అడిగా. ఊహు! చెప్పనే లేదు. అంతా మౌనం. బయట ఆ కట్ట 12 - 16 రూపాయలకి అమ్ముతారు. ఇతడి వద్ద పది రూపాయలకి కి వచ్చినా - రెండు రూపాయల మిగులు లాభం. అలానుకొని ఆగాను. నేను వెళ్ళిపోతానేమో అని చూశారు. ఊహు! దీని అంతు చూద్దామని పట్టుదలగా ఆగాను. 

ఇక లాభం లేదని వారిలో ఒకరు మూడు కిలోలు కొన్నారు. డబ్బులు ఇచ్చేదాకా మౌనం వహించాను. కట్టలు వేసి, తూచి, సంచిలో పెట్టుకోవటం అంతా కావాలనే నెమ్మదిగా చేస్తున్నారు. అయినా ఓపికగా ఎదురుచూశాను. మెల్లగా చేతి సంచి తీసి, అటు తిరిగి డబ్బులు లెక్కపెట్టి, మడిచి మరీ అతడికి ఇచ్చింది. అతను ఇదంతా గమనించక యధాలాపముగా లెక్కపెట్టుకున్నాడు. అప్పుడు అతనితో లెక్కపెట్టాను. 

అవి ముప్ఫై రూపాయలు. 
అంటే మూడు కిలోలు = ముప్పై రూపాయలు.. కిలో పది రూపాయలు

బాప్రే!.. ఇంత చవక బేరం ఎక్కడ దొరుకుతుంది. నాలుగైదు పోచలు ఇచ్చి, అది ఐదు రూపాయలు అంటూ ముక్కు పిండి మరీ వసూలు చేస్తారు. అలా వారి దృష్టిలో - ఒక్కో కట్ట ఎంత లేదన్నా 30 - 35 రూపాయలు విలువ అన్నమాట. కిలోకి ఎంతలేదన్నా వంద రూపాయలు. అంటే - పిచ్చ లాభాలు అన్నమాట. 

ఇంకా ఆగలేదు.. నేనూ రెండు కిలోలు కొన్నాను. ఇరవై రూపాయలు ఇచ్చేసి బయటపడ్డాను. ఇంటికి వచ్చేశాక శ్రీమతి - " ఏమిటండీ!.. ఇంతగా కొత్తిమీర తెచ్చారు.." అంటే జరిగినదంతా చెప్పాను. తరవాత ఏమి చెయ్యాలో కూడా చెప్పాను. ఆ ప్రకారముగా తనూ చేసింది. 

ఇంతకీ అదేమిటీ అంటే - రెండు కట్టలు మేము ఉంచేసుకొని, మా చుట్టూ ప్రక్కల వారికి సమముగా పంచేశాం.. ఎందుకూ ఇది అని అడిగినవారికి కొత్తిమీర పచ్చడి చేసుకోండి.. అని మా సమాధానం. 

Wednesday, December 14, 2011

New version Orkut

సోషల్ సైట్స్ లలో ఒకటి అయిన " ఆర్కుట్ " లో చాలామంది ఇంకా పాత వర్షన్ యే వాడుతున్నారు. చాలామందికి నూతన వెర్షన్ ఆర్కుట్  వాడటం అంతగా తెలిసి లేదనుకుంటాను. నాకున్న మిత్రులలో 51.90 % మంది ఇంకా పాత వెర్షన్ ఆర్కుట్ ని వాడుతున్నారు. ఎందుకో ఒకసారి ఇలా ఎంతమంది పాత వర్షన్ వాడుతున్నారో చెకప్ చేద్దామని చూస్తే - ఇంకా అంత శాతం మిత్రులు పాతవర్షన్ లోనే ఉన్నారు. వారి తెలిసో తెలీకో, వేరే కారణాల వల్ల వారు అలా ఉండొచ్చును. ఇలా చూడటం చాలా ఈజీ.. మీ మీ నూతన వెర్షన్ ఆర్కుట్ ఖాతాలలోకి వెళ్ళేసి, కుడి మూలన ఉన్న బాణం గుర్తు చూపిన వద్ద నున్న Old version ని నొక్కితే మీకు, ఆ పాత వర్షన్ ని వాడుతున్న మీ మిత్రులు ఎవరో తెలుస్తుంది. అలా వాడుతున్న మిత్రులు అదే పట్టీలో కనిపించే - New version ఆర్కుట్ లింక్ నొక్కితే, వెంటనే నూతన ఆర్కుట్ వెర్షన్ కి   మారుతారు.


తమకి వచ్చిన స్క్రాప్స్ నీ, ఫోటో కామెంట్స్ నీ, ఎవరెవరు ఏయే అప్డేట్స్ చేశారో, మనమేమి అప్డేట్స్ చేశామో.. చూసుకోవటానికి నూతన ఆర్కుట్ వర్షన్ కన్నా పాతదే బాగుంటుంది. కానీ పాత ఆర్కుట్ వెర్షన్ కన్నా నూతన ఆర్కుట్  వెర్షన్ ని మీరు అలవాటు చేసుకోవాలి. మొదట్లో చాలా ఇబ్బందిగా ఉండొచ్చును. పాత వెర్షన్ ని ఒకసారి చూసుకొని, నూతన వెర్షన్ కి వచ్చి పని చేసుకోండి. 

ఒక్కసారిగా మారాలి అంటే ఎవరికైనా ఇబ్బందే.. కానీ నూతన ఆర్కుట్ యే అన్ని విధాల అనుకూలముగా అనుకూలముగా ఉంటుంది. ఎప్పుడూ అదే వాడటానికి ప్రయత్నించండి. ఇప్పుడు చాలామంది ఆర్కుట్ ని వదిలేసి, వేరే వేరే సామాజిక సైట్లలోకి వెళుతున్నారు. కానీ ఇంకా తమ తమ అక్కౌంట్స్ అందులో ఉంచినవారు ఈ సూచనని పాటిస్తే కాస్త - క్రొత్తగా, అనుకూలముగా, ఆసక్తికరముగా ఉంటుంది. అందరివీ ఒకేసారి, ఒకేదగ్గర, ఏమేమి అప్డేట్ చేశారో చూడోచ్చును. అందుకే నూతన వెర్షన్ వాడమని చెప్పేది. చాలా ఈజీగా మీ పని అయిపోతుంది. 

ఒకవేళ మీరు ఎక్కడి వరకు చూశారో గుర్తు పెట్టుకొని, అక్కడి నుండి మళ్ళీ చూసుకుంటూ ఇందులో సులభముగా  చెయ్యవచ్చును. 

ఇప్పుడు ఉన్న సభ్యులని నిలుపుకోవటానికి అన్నట్లు కావచ్చును. వారానికి రెండు, మూడు ఆర్కుట్ పద్ధతులు మారుస్తున్నారు. అవి ఏమిటో ముందు ముందు తెలియచేస్తాను. 

Sunday, December 11, 2011

నా సైకిల్ ఏదీ?..

నిన్న బ్యాంక్ వద్ద పని ఉండి వెళ్లాను. లోపలి వెళ్ళి వస్తుండగా నా బైక్ వద్ద - అడ్డుగా నల్లని గీతల పసుపు టీ షర్టు , జీన్ ప్యాంట్ లో ఉన్న ఒకడు తచ్చాడుతున్నాడు. నేను రావటం చూసి, కాస్త దూరముగా జరిగి, నన్నే చూస్తున్నాడు. "ఏంట్రా! వీడిని చూస్తుంటే కాస్త తేడాగా ఉంది.." అనుకున్నాను.

నా బైక్ తీస్తున్నాను. ఒకసారి కనుకొలకుల నుండి అతడిని చూస్తూనే ఉన్నాను. నన్ను గమనిస్తూనే ఉన్నాడు. ఇక బైక్ కిక్ కొడుతాను అన్నప్పుడు - అతడిని  - ఏమిటీ - అన్నట్లు చూశాను. ఏమైనా మాట్లాడాలా? అన్నట్లు. అతను దగ్గరికి వచ్చాడు. "నా సైకిల్ కనిపించటం లేదు.." అన్నాడు. 

"ఆ ఎదురుగా కొన్ని ఉన్నాయి కదా!.. అందులో లేదా..?" అన్నాను. అక్కడ మరికొన్ని మామూలు సైకిళ్ళు, హీరో హోండా మోటార్ సైకిళ్ళు ఉన్నాయి. 

"లేదు.. ఇందాక ఇక్కడే పార్క్ చేసి, లోపలి వెళ్లాను. వచ్చేసరికి నా సైకిల్ లేదు.." అన్నాడు. 

"ఎదురుగా పోలీస్ స్టేషన్ ఉంది కదా.. అక్కడికి వెళ్ళి ఇక కంప్లైంట్ ఇవ్వు.. అయినా నీ సైకిల్ దొరికేది నమ్మకం తక్కువ. సైకిల్ కొన్న బిల్ ఉందా?.." అన్నాను. 

"ఉంది. ఇంటివద్ద ఉంది.." అన్నాడు. 

"ఓకే! ఇంకేం అది తీసుకొని కంప్లైంట్ వ్రాసివ్వు.." అనగానే అటు ప్రక్కకి వెళ్ళిపోసాగాడు. 

"ఎందుకైనా మంచిది.. కాస్త ఖర్చు బాగానే వస్తుంది.." అనగానే ఆగిపోయాడు. "అసలు సైకిల్ తెచ్చావా? రంగూ, రూపూ ఎలా ఉందో ఐడియా ఉందా?.." అని అన్నాను. 

"ఉందన్నా!.. తెచ్చాను.. ఇదిగో సైకిల్ తాళం.. "అని అప్పటిదాకా మూసి ఉంచిన కుడిచేతి గుప్పిట విప్పాడు. 

షాక్.. షాక్.. షాక్..!!

ఒకే ఒక సెకనులో పరిస్థితి అర్థం అయ్యింది. కాసింత భయం వేస్తున్న నాకు, అతడితో ఓకే.. అనేసి, బండి కిక్ కొట్టేసి, స్టార్ట్ చేసుకొని అక్కడినుండి, వచ్చేశాను. ఒకసారి అద్దములో వెనక్కి చూశాను. అతను అక్కడి నుండి ఖాళీ చేతులతో వెళ్ళిపోతున్నాడు. 

ఇంతకీ వాడు గుప్పిట విప్పి చూపినది  సైకిల్ తాళం కాదు. దాదాపు మూడు అంగుళాల పొడవున్న హీరో హోండా మోటార్ సైకిల్ తాళం. ఏదో ఒక తాళం తీసుకవచ్చేసి, ఆ తాళం యే బండికి వస్తుందో పెట్టి చూసి, ఒకవేళ అది సరిపోయినట్లయితే - ఆ బండిని దర్జాగా - స్వంత వాహనదారుడిలా స్టార్ట్ చేసుకొని, తీసుకెళ్ళుతాడు అన్నమాట. నా టైం బాగుంది కాబట్టి కాసింతలో మిస్ అయ్యాను. హీరో హోండా బళ్ళు ఎక్కువగా చోరీకి గురి కావటం అనేది కూడా తొందరగా అమ్ముకోవచ్చును, మార్కెట్ లో డిమాండ్ ఎక్కువ, కాసింత ఈజీగా తాళం తీయోచ్చును.. ట. 

Tuesday, December 6, 2011

ఫంక్షన్ లలో ప్లాస్టిక్ గ్లాసులు.

మొన్న ఒక పెళ్ళికి అటెండ్ అయ్యాను.. భోజనాల వద్ద - దాహం వేసి మంచినీటి గ్లాస్ ఇచ్చే సెక్షన్ వద్దకి వచ్చాను. అప్పటికే గ్లాసులు అయిపోయాయి. అక్కడ పనిచేసే ఇద్దరు అబ్బాయిలలో ఒకతను - అప్పుడే ప్లాస్టిక్ గ్లాసులు ప్యాకెట్ విప్పి, ఒక నీటి డ్రమ్ములో ఆ గ్లాసులని వేస్తుంటే - ఇంకో అబ్బాయి, ఆ నీటిని నింపి పెడుతున్నాడు.

ఎంతగా అప్పుడే విప్పి పెట్టినా, తయారీ అప్పుడే - ఎంతో కొంత " ప్లాస్టిక్ డస్ట్" ఉండి తీరుతుంది.. అది ఏమీ కడగక, అలాగే నీరు నింపటం, వాటినే ఆబగా త్రాగటం జరుగుతున్నది. కొందరైతే - ఒక గ్లాసు నీటిని త్రాగాక, దాన్ని పారేసి, ఇంకో ప్లాస్టిక్ గ్లాసు తీసుకొని త్రాగటం.. ఇలా నాలుగైదు గ్లాసులు త్రాగటం జరుగుతున్నాయి. అక్కడే అలా జరిగింది అని కాదు.. ఎక్కడైనా యే శుభకార్యాలలో అయినా - ఇంతే కదా..

వెనకటికి స్టీల్ గ్లాసుల్లో నీరు పెట్టేవారు. ప్రజల్లో సివిక్ సెన్స్ లేకపోవటముతో, నోట్లో పెట్టుకొని త్రాగేవారు కాబట్టి, హై జీన్ పర్పస్ కోసం ఈ ప్లాస్టిక్ గ్లాసులు వాడటం మొదలెట్టారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ ప్లాస్టిక్ గ్లాసెస్ వాడటమే! పెద్ద సిటీ అనే కాదు.. చిన్న చిన్న పల్లెటూర్లలోనూ అంతే!.

ప్లాస్టిక్ ని తగ్గిద్దాం తగ్గిద్దాం అనడం ఏమిటో గానీ, ఇంకా ఎక్కువ మొత్తములో వాడటం జరిగిపోతూనే ఉంది..

నామటుకు నేను మాత్రం ఇలాంటి కార్యక్రమాలలో మాత్రం, శుభ్రముగా ఒక గ్లాస్ తీసుకొని, అందులోని ప్లాస్టిక్ డస్ట్ పోయేలా కడుక్కొని, ఎన్నిసార్లు అయినా ఆ గ్లాస్ ని మాత్రమే త్రాగునీరుకి వాడుకుంటాను.. అలా వాడి ప్లాస్టిక్ డస్ట్ నా వంట్లోకి చేరకుండా కాసింత జాగ్రత్తగా ఉంటాను. ఈ పద్ధతి - మీకు నచ్చితే మీరూ పాటించండి. 

Sunday, December 4, 2011

మోకాళ్ళ లోతు - ఇండియా

ఇది నా చిన్నప్పటి స్నేహితుడి అనుభవం.. అతనే చెప్పాడు నాకు.

ఇప్పుడు అంటే పబ్లిక్ తెలివి మీరారు కానీ, అప్పట్లో అంతా అమాయకులే!.. ఏది చెప్పినా నమ్మయ్యడమే!.. అది  నిజమా కాదా! అని కూడా ఆలోచించరు. అలాంటి కాలములో నా మిత్రుడు హై స్కూల్ చదివేవాడు. అప్పట్లో తనకి ఒక మిత్రుడు ఉండేవాడు.. అతను వీడితో ఒకసారి - "కన్యాకుమారి వెళ్ళాక హిందూ మహా సముద్రములో మోకాళ్ళ అంత దూరం లోపలికి వెళ్ళి, వెనక్కి చూస్తే - భారదేశం అంతా కాశ్మీర్, హిమాలయాలతో సహా కనిపిస్తుంది.. "అన్నాడుట. మనోడికి ఎప్పుడు కన్యా కుమారికి వెళ్దామా! ఎప్పుడు ఇండియా అంతా చూస్తానా!.. అని ఒక కోరిక బాగా నాటుక పోయింది.

ఎవరైనా కన్యాకుమారి వైపు కి వెళ్ళి వస్తే - సముద్రములోకి మోకాళ్ళ అంత లోతుకి వెళ్ళి వెనక్కి చూశారా అని (పిచ్చిగా) అడిగేవాడు.. ఇదంతా తప్పని, ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు అర్థం చేసుకొన్నాడు. ఇప్పటికీ ఆ సంఘటన చెప్పి, నవ్విస్తూ ఉంటాడు.

Sunday, November 27, 2011

క్రొత్త తినటం

ఈరోజు రోజు బాగుందని " క్రొత్త " తిన్నాము.. ఇదేదో రుచికర పదార్ధం పేరో, మరేదో ఆహార వస్తువు కాదు లెండి. ఈతరం వారికి బహుశా ఎవరికీ తెలియకపోవచ్చును. కానీ కాస్త పాతతరం వారికీ, ఇంకా సంప్రదాయాలు పాటిస్తున్న ఇళ్ళల్లో ఇంకా జరుపుకుంటూనే ఉన్నారు. ఈతరం వారికి కాస్త పరిచయం చెయ్యాలని ఈ టపా వ్రాస్తున్నాను..

అప్పట్లో ఇప్పుడు ఉన్నన్ని వైవిధ్య వృత్తులు ఉండేవి కావు. అప్పట్లో కొన్ని రకాల సాంప్రదాయ వృత్తులతో బాటూ వ్యవసాయం ఉండెడిది. చాలామందికి కాసింత వ్యవసాయం ఉండెడిది. ఒక పంట క్రొత్తగా వేశాక, అది పండి, ఇంటికి వచ్చేది. ఈ ధాన్యం మా పంట పొలాల్లో పండింది.. అని బాగా తాదాత్మత చెంది, ఆ పంటని బియ్యముగా మార్చుకొని, ఒక మంచి తిథి, నక్షత్రం చూసుకొని, ఆరోజు వండుకొని, ఆ పంటని తొలిసారిగా తినేడివారు.

నిజానికి ఈ క్రొత్త తినడం ఒక పెద్ద ఉత్సవం లా ఉండేది. ప్రొద్దున్నే ఇళ్ళు కడిగి, శుభ్రం చేసి, ద్వారానికి మామిడి తోరణాలూ కట్టేడివారు. ఆ తరవాత పూలదండలతో అందముగా అలంకరించి, ఒక ఇంట్లో శుభకార్యం జరుతున్నదా.. అనేలా చేసెడివారు. ఇంట్లోని దేవుడి గుడికి కాసింత సున్నమూ, ఎర్రని జాజూ పూసి (ఇప్పట్లో పెయింట్లు వచ్చాయి కానీ, అప్పట్లో అవే పెయింట్లు ) దేవుని గూడు అలంకరించేడి వారు. ఆ తరవాత ఆ క్రొత్త బియ్యముతో అన్నం వండేసి, అలాగే కూరగాయలు కూడా వండేవారు. అన్నం అయితే చేతికి మెత్తగా, బంకగా అతుక్కపోయేది.. అయినా నోట్లో ముద్దలు పెట్టుకుంటే - గబా గబా జారిపోతుంది. ఆరోజు మార్కెట్లో లభ్యమయ్యే ప్రతి కూరగాయనీ వండేవారు. ముఖ్యముగా ఈరోజుల్లో అందరూ మరచిపోయిన గుమ్మడి కాయ కి ఆరోజు తప్పనిసరి. దానితో గుమ్మడికాయ కూర చేస్తారు. ఇది కూరగాయల్లో అతి ముఖ్యమైన వంటకం. ఇంకా పచ్చళ్ళూ, పొడులూ, వడియాలు, రసం, పెరుగూ... ఇవన్నీ అన్నీ ఉంటాయి..

అలాగే ఆ నూతన బియ్యముతో " పరమాన్నం " కూడా చేస్తారు. నూతన బియ్యముతో స్వీట్ లా చేస్తారు. ఇది చాలా రుచిగా ఉంటుంది. క్రొత్త బియ్యం ఇంత రుచిగా ఉంటుందా? అనేలా చేస్తారు. ఆపిమ్మట ఇవన్నీ దేవుడు ముందు పెట్టి, చిన్నగా పూజ చేసి, వాయనం ఇచ్చి, మీ సహాయం వల్ల ఈ పంటని ఈరోజు భోజనం గా స్వీకరిస్తున్నాను.. అని మోకరిల్లి, మొదట ఒక విస్తరిలో దేవునికి మొదటి భోజనం పెడతారు. ఆ తరవాత ఆ ఇంటిల్లిపాదీ వారు ఆరగిస్తారు. వారితో బాటుగా తెలిసిన వారినీ అతిధులుగా ఆహ్వానించేడి వారు. అతిధులు లేకుండా క్రొత్త తినడం అయ్యేది కాదు..

ఒకవేళ అతిధులు రావటం ఆలస్యం అయితే వారికోసం ఆగేడివారు. లేదా వారు ఎవరినైనా తమ తరపున పంపితే వారితో కానిచ్చేస్తారు. పిల్లలు అయితే ఆరోజు స్కూల్ బంద్. ఏంట్రా! నిన్న స్కూల్ కి రాలేదు.. అని మేష్టారు అడిగితే - నిన్న క్రొత్త తిన్నాం సార్ అనెడివారు. మేష్టార్లు కూడా ఏమీ అనేదివారు కాదు. ఒక్కమాటలో చెప్పాలంటే - పంచభక్ష్య పరమాన్నాలతో, అన్ని లభ్యమయ్యే కూరగాయలతో, కడుపారా తినేసేరోజు అది. ఆరోజు వచ్చే భుక్తాయాసం చెప్పనవసరం లేదు..

ఇదంతా నా చిన్నప్పుడు జరిగేది.. అప్పుడు ఆర్థికముగా అందరూ అంతంత ఉన్నా బాగా శ్రద్ధగా జరుపుకునేవారు. కానీ ఈరోజుల్లో అన్నీ ఉన్నా,జరుపుకోవటానికి ఆసక్తి లేదు.. నేనూ పైన చెప్పిన దాంట్లో సగం కన్నా ఎక్కువే - ఈరోజు చేసుకున్నాము. 

Monday, November 21, 2011

Morning walk - Some sweet momories

ఈ మధ్య మార్నింగ్ వాక్ అంటూ అనుకోకుండా అలవాటు అయ్యింది. తెలిసిన మిత్రునికి బండి నేర్పిద్దాం అనుకోని, ఉదయాన వెళ్ళటం అలవాటు అయ్యింది. సైకిల్ కూడా రాని వాడికి బండి నేర్పటం చాలా ఇబ్బందే అయ్యింది. అలా నేర్పించటం కూడా చా - లా సమయం తీసుకుంది. దానివలన చాలారోజులు ఉదయాన్నే - సూర్యుడు రాకమునుపే లేవాల్సి వచ్చింది. తనతో అలా బండి నేర్పించటానికి వెళ్లాను. నిజం చెప్పాలీ అంటే అంతకు ముందున్న నా దినచర్యకి పూర్తిగా వ్యతిరేకం.

అలా నిద్రలేచి, వాడికి బండి నేర్పించటానికి వెళ్లాను. ఆ పని చాలారోజులు సాగింది. నేను వెనకాల కూర్చొని, అలా ఆ బండి మీద అలా సాగాల్సిన సమయములో చుట్టూ చూస్తూ చాలా విషయాలు నేర్చుకున్నాను. అవి మీకు ఇప్పుడు చెప్పటం.

అలా వెళ్ళటం కూడా మూడు నెలలుగా వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడే అలా మార్నింగ్ వాక్ చేసేవారు కూడా కనిపించేవారు. వారు అలా నడవటం ఏదో క్రొత్తగా తోచింది కూడా. అసలు మనం ఎప్పుడు ప్రొద్దునే లేచి అలా వెళ్లాం? వారు అలా వెళ్లి వచ్చాక, అందరూ లేచాక నిద్ర లేచేవాడిని. అలా ఉండేవాడిని ఎందుకో మారాలని అనిపించింది. నాతో వచ్చినవాడు హాయిగా గ్రౌండ్ లో డ్రైవింగ్ నేర్చుకుంటుంటే - నేను అలా గ్రౌండ్ లో ఒక మూలగా నిలుచునేవాడిని. అక్కడికి వచ్చిన వారిని గమనిస్తూ ఉండేవాడిని. అంతేకాని ఏమీ చేసేవాడిని కాదు.

కొంతకాలం తరవాత వాడికి బండి నడిపించటం వచ్చింది. వాడికి నేను చేసిన సహాయానికి ఋణం తీర్చుకోవాలని అనుకున్నాడు లా ఉన్నాడు.. మార్నింగ్ వాక్ కి వెళదాం అని చెప్పాడు. హా! నాకెందుకు? అవసరం లేదు. నాకు అంతా బాగుంది అన్నాను. చాలాసార్లు అడిగినా అసలు వద్దనే అన్నాను. వాడు బండి నేర్చుకోవటానికి, ప్రాక్టీస్ చెయ్యటానికి అలా తోడుగా రమ్మంటే మాత్రం కాదని అనలేకపోయాను. రాత్రి ఎంత నా బ్లాగ్ వ్రాసుకున్నా, ప్రొద్దున్నే నిద్రలేచి, నిద్ర సరిపోకున్నా - వెంట వెళ్ళేవాడిని.

కొద్దిరోజుల తరవాత నాలో చిన్నగా మార్పు.. ఎన్ని రోజులు అయినా వాడు  రోజూ పట్టుదలగా బండి నేర్చుకుంటున్నాడు. తనకి అంత తొందరగా నేర్చుకునే లక్షణం లేకున్నా బాగా కష్టపడుతున్నాడు. నేర్చుకొని, తన జీవితాన్ని బాగా అభివృద్ధి చేసుకోవాలని చూస్తున్నాడు. ఏమీ లేని, రోజంతా కష్టముతో కూడుకున్న మామూలు జీవితం సాగించే అతను అంత పట్టుదలగా మూడు నెలలుగా బండి నేర్చుకుంటున్నప్పుడు, నేనేం చేస్తున్నాను.. అనే ప్రశ్న నాలో మొదలయ్యింది.

ఆ గ్రౌండ్ లోని వాళ్ళందరినీ గమనించాను.  మూడు సంవత్సరాల పిల్లల నుండీ అరవై సంవత్సరాల పిల్లల వరకూ ఉన్నారు అక్కడ. అందరూ బీజీ.. బీజీగా వ్యాయామం చేస్తున్నారు. వాళ్ళందరూ కష్టపడుతుంటే మరి నేను?.. అని అనుకున్నాను. నా ఫిట్నెస్ గురించి నాలో అనుమానం. కొద్దిరోజుల దినచర్యలో నా శరీర స్థితిని గమనించాను. నేను ఎంతో ఫిట్ అనుకున్నవన్నీ అబద్ధాలే అని తేల్చుకునేసరికి ఇక నా శరీరం ఎలా ఉందో అర్థం అయ్యింది. ఇక ఆలస్యం చేయ్యబుద్ది అవలేదు. ఇక మొదలెట్టాను..

అలా అలా ఒక నెల గడిచింది. ఆ నెల రోజుల్లో నేను పొందిన అనుభవాలను, అలా వాకింగ్ లో పరిచయం అయిన వారూ అన్నవీ, నేను పరిశీలించిన విషయాలనీ మీకు ఇప్పుడు చెబుతాను. నచ్చితే మీరూ వాకింగ్ / వ్యాయామం మొదలెట్టేయండి.

* రాత్రి పూట ఆలస్యముగా పడుకొని, ఆలస్యముగా నిద్ర లేవటం వల్ల - ఉదయాన ఉన్న కొన్ని అందమైన దృశ్యాలని పొందలేకపోతున్నాను. ఉదాహరణకి : సూర్యుడు ఉదయించేవేళ, పక్షులు ఆహారానికి వెళ్లటం, నిర్మానుష్యమైన రోడ్లు, దైనందిక జీవితం ఎలా మొదలవుతుంది, వాహానం మీద మంచు నీటి తుంపర ఎలా ఏర్పడుతుందో.. ఇత్యాది విషయాలు..

* అంతకు ముందున్న నా అథ్లెటిక్ శరీరంకీ, ఇప్పుడు వాకింగ్ పోక మునుపు ఉన్న స్థితికీ చాలా తేడా.. భూమికీ, ఆకాశానికి గల తేడా.. వయసు వల్ల వచ్చినది కాదు. కేవలం కొన్ని కారణాల వల్ల రాత్రి మేల్కోవటం అలవాటు చేసుకున్నాను. అది అలా కొనసాగిస్తూ పోయాను. కానీ, ఇదే పని ఉదయాన / వేకువ ఝామున లేచి చేసుకుంటే అంతే పనీ అవుతుంది. మరియు బోనస్ గా పైన చెప్పిన దృశ్యాలనీ చూడొచ్చును. 

* రాత్రి పూట బాగా మేల్కొని, ఉదయాన లేస్తే మామూలుగానే ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ, చాలా చాలా చా...లా నె...మ్మదిగా మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. ఇది మీ శరీర పరిస్థితిని బట్టి, మీ దైనందిక అలవాట్లని బట్టి - ఎంత త్వరగా అలా చేస్తుంది అనేది ఆధార పడుతుంది. కానీ ఇది మనం గమనించలేము. నాకేం అయ్యింది.. అంతా ఫిట్ గా ఉన్నాను అనే అపోహలో ఉంటాం. అది వేరేవారు చెప్పినా - తప్పు చెబుతున్నాడు అనే భావనలో ఉంటాము కూడా. నేనూ నెల క్రితం వరకూ అలాగే అనుకున్నాను.

* మెల్లమెల్లగా మనలో అశక్తత మొదలవుతుంది. కానీ గమనించనట్లే ఉంటాము. ఇంకా ఏమీ కాలేదు అనే స్టేజీలోనే ఉంటాము. కానీ మనకు తెలీకుండానే కొన్ని జబ్బులూ, ఆధునిక జబ్బులూ (మానసిక ఒత్తిడీ, ఇంటర్నెట్ సిండ్రోం, సామాజిక సైట్ల విషయాలు.. ఇలాంటివి ) మనలో ప్రవేశిస్తాయి. ఎంతగా అంటే ఏమాత్రం చడీ చప్పుడు లేకుండానే. అవి మనం గమనించలేకపోతాము. కానీ మన శ్రేయోభిలాషులూ, ఆప్తులు మాత్రమే గమనిస్తారు. వారు ఇలా అనీ మీ దృష్టికి తీసుకరాగానే - మీరూ అతి తొందరగా ఒప్పుకోరు. వాదన పెట్టుకుంటారు. కాదని అంటారు. కానీ వాళ్ళు చెప్పేది నిజం అని చాలారోజులకి - అంటే మీలోని మార్పులు మీకే అనుభవం లోకి వచ్చాక గానీ నమ్మరు. ఇంతవరకూ వచ్చాక అప్పటికి మీ పరిస్థితి బాగుండదు. అప్పుడు కష్టపడినా మీరు కోలుకోవటానికి బాగా సమయం పడుతుంది. అందుకే మీ శ్రేయోభిలాషులు చెప్పగానే - నిజాయితీగా ఆలోచించి, ఒప్పుకోండి. అప్పుడైనా వింటే - కాస్త ఈజీగా, తొందరగా బాగుపడతాము. నమ్మినా, నమ్మకున్నా ఇది నిజం.

* రాత్రిపూట బాగా మేలుకొని చేస్తుంటే - ఏమీ కాదు కానీ వత్తిడి, ఆందోళనలూ, నిద్రలేమి వల్ల కాసింత ఏమిటీ - బాగానే ఆరోగ్యం పాడవుతుంది.. ఇటు శారీరకముగా, అటు మానసికముగా. మానసికముగా ఏమి అవుతుందో పైన చెప్పాను. మళ్ళీ రిపీట్ చెయ్యలేను. ఇక శారీరకముగా అయితే - మీలో గ్లామర్ తగ్గుతుంది. మీ కళ్ళ క్రింద నల్లని వలయాలు, మొహములో ముడుతలూ, వయసు మళ్ళినట్లు లక్షణాలు, మీ గుండె చప్పుడు మీకే వినిపించటం, కొద్ది దూరం నడిస్తేనే ఆయాసం, మోహం మీద నీళ్ళు చల్లుకున్నట్లుగా చెమటలు, మొహములో కాంతి (Glow) అస్సలు లేకపోవటం, కాసింత బరువు మోస్తూ వెళ్ళితేనే పట్టుమని కొద్ది దూరం కూడా నడిచి, వెళ్ళలేని పరిస్థితి. చేతుల కండలూ, జబ్బలూ డీలా డీలా ఉండి, ఆకర్షణీయముగా ఉండకపోవటం, మీ పొట్ట కాస్త నేనూ బయటకి వచ్చేస్తున్నానోచ్! అంటూ కనిపించేలా రావటం.. ఇవన్నీ మీలో ఉన్నట్లయితే మీరు వెంటనే వ్యాయాయం మొదలు పెట్టండి. అయినా మొదలు పెట్టరు. ఇలా చదివేసి అలా వదిలేస్తారు.. ముందే చెప్పాను హితులూ, ఆప్తులూ చెబితే వినరనీ..

* చాలా పనులు మీ ఆరోగ్యం కన్నా ఏమీ ముఖ్యం కావు. మీరు బాగుంటేనే - అవి మీరు పూర్తి చెయ్యగలరు. మీరు ఒకవేళ లేకున్నా ఆ పనులలో చాలావరకు మీరు లేకపోయినా వేరేవారు చెయ్యగలరు. మీరు ఇప్పుడు కాసేపు ఆలోచిస్తే - ఇది నిజం అని ఒప్పుకుంటారు కూడా.

* మీ మీద ఆధారపడ్డ వారిని ఒక్కసారి లెక్కించండి. లెక్కించారా?.. ఓకే.. అంతమంది మీమీద ఆధారపడ్డప్పుడు మీరు ఎందుకు మారరు? వారిని నడిరోడ్డు మీద వారి మానాన వారిని వదిలేసి బీపీ, షుగర్, హార్ట్ అటాక్ అయ్యి పరలోకంకి వెళ్ళగలరా?.. ఈ ఊహ చాలా భయంకరముగా కనిపిస్తుంది కదూ.. ఇవన్నీ అవసరమా అని అనుకుంటాము కానీ, మొదట్లోనే ఆలోచిస్తే - సమయమూ, వయస్సూ, ఓపిక, కష్టపడే తత్వం.. అన్నీ మనకి అందుబాటులో ఉంటాయి. ఆలస్యం చేసిన కొద్దీ దూరం అవుతుంటాయి.

ఇలా చాలా చాలానే గమనించాను. అన్నీ చెప్పేస్తే చాంతాడు అంతగా అయ్యేలా ఉంది. మీకూ బోర్ కొట్టించవచ్చును. కనుక ఆ విషయాలు ఇంకొన్ని ఉన్నా - నేను ఈ నెలరోజుల్లో పొందిన విషయాల్లో కలిపేసి చెబుతాను.

1. నేను ఉంటున్న దగ్గర రాత్రి పూట ఇరవై డిగ్రీలు చలి ఉండొచ్చును. ఇప్పుడు పదకొండు డిగ్రీలు ఉందంట. అయినా రోజూ వెళ్లాలనిపిస్తుంది. నేను మామూలుగా అయితే ప్రొద్దున్నే నిద్రలేవను. నా ఫ్రెండ్ కోసం నిద్రలేస్తున్నాను. వాడితో అలా వెళ్ళొచ్చాను. కొద్దిగా అలవాటు చేశాడు కదా.. ఇప్పుడు టంచన్ గా మెలకువ వచ్చేస్తున్నది. ఒక్కోసారి అయితే నేను నిద్ర లేచాక, ఒక నిమిషానికి అలారం వస్తున్నది.

2. కొద్దిరోజులు అలా వెళ్లాను వాడితో. అక్కడ కొన్ని జంటలు కుటుంబాలతో సహా వస్తున్నారు. అది చూశాను. కొద్ది రోజులు వారిని గమనించాను. ఈరోజుల్లో ఒకే ఇంట్లో ఉన్నా, మాటలు కరువైన ఈ ఆధునిక కాలములో - వారు మాత్రం మాట్లాడుకుంటూ, జోక్స్ వేసుకుంటూ, అన్నీ విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నారు. వారి ఆహ్లాదాన్ని చూస్తుంటే నాకు బాగా ఈర్ష్య కలిగింది. అది ఎంతగా అంటే - నా ఫ్రెండ్ ని వదిలేసి, మా ఆవిడతో అలా వెళ్ళేంతగా. పాపం! నా స్నేహితుడు.. వాడిని దూరం చేశానని మొదట్లో అనుకున్నా అతనూ సర్దుకపోయాడు.. నాకూ బాధగా ఉన్నా - నాకు ఒక మంచి అలవాటు చేశాడు. నేను వాడికి బండి నేర్పించి, వాడి జీవితానికి మంచి అలవాటు చేసినట్లే, వాడూ నాకు ఇది అలవాటు చేసి, అందమైన, ఆరోగ్యకర అలవాటు చేశాడు. అలా ఋణం తీర్చేసుకున్నాడు అనుకుంటున్నాను.

3. ఒకప్పుడు రెండు చేతులతో రెండు నిండు గ్యాస్ సిలిండర్స్ అలా కొద్దిదూరం పట్టుకెళ్ళేవాడిని.. ( నిజమండి బాబు! ) అలా వెళ్లక ముందు - రెండు చేతులతో పదికిలోల బరువు మోసే స్థితిలో లేనంతగా అయాను. ( ఇదీ అక్షరాల నిజమే! ) కేవలం వాకింగ్ చేస్తేనే - ఇప్పుడు కాస్త శరీరం గట్టిగా అయ్యింది. ఇంకా ఏమీ వ్యాయామం లేదు. జబ్బలు పెరిగాయి. చేతులు మంచి ఆకర్షణీయముగా మారాయి. శరీరం ఒక చక్కని ఆకృతికి మారసాగింది. పొట్ట కాస్త తగ్గింది. ఆయాసం, మానసిక ఒత్తిడీ.. వంటి వంట్లోని శత్రువులు తగ్గుతున్నాయి. ఇదొక శుభ పరిణామం.

4. టీ షర్ట్ గానీ కుర్తా గానీ వేసుకుంటే ఒకప్పుడు బాగా అనిపించేవి కావు. ఒకప్పుడు బాగా లోపలికి వెళ్ళి, ఇప్పుడు గుండె మీద కండ కాస్త ముందుకి వచ్చేసి, అవి వేసుకుంటే కాస్త ఆకర్షణీయముగా కనిపిస్తున్నాను. అలాగే నాలో వయసు తగ్గినట్లుగా, మోములో కాసింత ప్రశాంతముగా, కుర్రవాడిలా ఉన్నాను అని ఒక మెచ్చుకోలు.  సంవత్సర కాలం తరవాత చూసిన నా నేస్తం ఒకరు ఈ విషయాన్ని చెప్పారు.

5. మొన్న మొన్నటివరకూ మినరల్  వాటర్ బబుల్ ని రెండు చేతులారా లేపాల్సి వచ్చేది. ఇప్పుడు ఒకే చేతితో మోసేస్తున్నాను. అంటే చాలా ఇంప్రూవ్ అయ్యాను అన్నమాటే కదా.. ఇంకా జిమ్ములూ, కసరత్తులూ అంటూ మొదలు ఏమీ లేవు.. వాకింగ్ తప్ప. అవీ చేస్తే ఇంకా ఆకర్షణీయంగా కనిపిస్తానేమో!.

6. మొహములో ఏదో తెలీని ఆందోళన నాలో ఉండేది అంట. ఇప్పుడు అలా లేదు.. మరీ అంతగా కాకున్నా కాసింత ప్రశాంతముగా ఉన్నాను - అంట. దానివల్ల కాస్త చిన్న వయస్సు వాడిలా కనిపిస్తున్నాను -ట. ఇది మాత్రం నాకు తెలీదు. ఎదుటివారు గమనించి చెప్పాలి.

7. నా మొహములో కాస్త గ్లో / అంతర్గత కాంతి / మెరుపు ప్రకాశవంతముగా ఉంది -ట. ఇది వారే చెప్పారు. జస్ట్ అలా మార్నింగ్ వెళ్ళితే ఇంత మార్పు వస్తుందని అనుకోలేదు.

8. నేను వెళ్ళే దారిలో అన్నీ పెద్ద పెద్ద చెట్లే!.. అవన్నీ ఎప్పుడో ఇంగ్లీష్ వారు నాటినవి. ఊడలు దిగేశాయి. ఊరు బయలు ప్రదేశం. రహదారికి దూరముగా ఉండే ప్రదేశం. చాలా ప్రశాంతముగా ఉండే చోటు అది. పక్షుల కూజితాలు, పొగమంచు, ప్రశాంతమైన వాతావరణం.. ఓహ్!.. పగటి పూట మామూలుగా కనిపించే ఆ ప్రదేశం, ఆ వేకువ ఝామున మరోలా, అందముగా కనిపిస్తున్నది. ఇలా నాకు ఒక్కడికేనా?.. లేక అందరికీ నా?

9. వాకింగ్ లో శ్రమ తెలీకుండా ఉండేందుకై - మొబైల్ లోని ఉత్సాహపూరిత, మంచి పాటలని, ఒక ఫోల్డర్ లో వేసుకొని, నాకు మాత్రమే వినిపించేలా పెట్టేసుకొని, (బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లాగా) హాయిగా నడక సాగిస్తున్నాను. దానివల్ల మాటలకి అంతరాయం లేకుండా, శ్రమ తెలీకుండా ఉంటున్నది.

10. నిర్ణీత సమయం కాగానే మొబైల్ లో ముందే ఫీడ్ చేసి పెట్టేసుకున్న అలారం రాగానే మరలి రావటం..

11. అన్నింటికన్నా - అలా ప్రొద్దున్నే జీవిత భాగస్వామితో అలా నడవటం చాలా బాగా నచ్చేసింది నాకు. వేరేవారు నడుస్తుంటే ఏమో అనుకునేవాడిని.. కానీ అందులోని లాభం ఏమిటో ఇప్పుడిప్పుడే అర్థం అవుతున్నది. అప్పుడే అక్కడే అన్నీ చర్చలు, లక్ష్యాలు, తప్పోప్పులూ, ఫన్నీ మాటలూ, వేరేవారి విషయాలు, చిలిపి విషయాలు.. ఇలా అన్నీ. నిజానికి అలా వాకింగ్ లో మాట్లాడుకోవద్దు. అయినా అప్పుడు మాట్లాడుకునే మాటలు బాగా విశ్లేషణాత్మకంగా ఉంటున్నాయి. ఇంట్లో మాట్లాడిన దానికన్నా అప్పుడే, అక్కడే త్వరగా తెములుతున్నాయి.

12. ఇంకో జంటతో కలిస్తే, కాసేపు అలా మాట్లాడుకుంటే మరీ మరీ బాగుంటుంది.. జస్ట్ గెట్ టూ గెదర్ లా. అదొక మధురానుభూతిలా కూడా మారుతుంది. అలా వాకింగ్, వ్యాయామాలు అయ్యాక అలా కూర్చొని, శరీరం కూలింగ్ అవటానికి అలా ముచ్చట్లు పెట్టేసి, సరదాగా కాసేపు నవ్వుకుంటే - ఆహా! ఎంత బాగుంటుంది! ఆ అనుభూతులు వర్ణించ వీలు కాదు.

13. నాకైతే అలా నడిచి, వ్యాయామం చేసి, కాసేపు అలా నీరెండలో చలి కాచుకుంటూ కూర్చొని, అక్కడే ఎన్నెన్నో కబుర్లు చెప్పేసుకొని, వెంట తెచ్చేసుకున్న ఆరోజు దినపత్రికని చదువుకొంటూ, ఫ్లాస్కులో తెచ్చేసుకున్న కాసింత వేడి వేడి మసాలా టీ ని, ఊదుతూ త్రాగుతుంటే - నా సామిరంగా............................ అన్న ఊహ ఈ మధ్య దోబూచులాడుతుంది. ఆ కోరికని ఎప్పుడో తీర్చేసుకుంటాను కూడా.. ఇది చూసిన వాళ్ళందరికీ అసూయ రావాలి.

14. మేము వెళ్ళే దగ్గర రిటైర్ అయిన ఒక వయసు మళ్ళిన వృద్ధ జంట ఇలాగే చేస్తారు. వారే చుట్టుప్రక్కల వారిని ఏమాత్రం లక్ష్యపెట్టకుండా, హాయిగా కుర్రజంటల కన్నా చాలా అన్యోన్యతని చూపిస్తారు. వారిని చూస్తే చాలా బాగా నచ్చుతారు నాకు. వారితో మాట్లాడాలని ఉంటుంది. కానీ పానకములో పుడకలా వెళ్ళి, డిస్టర్బ్ చెయ్యటం ఇష్టం లేక మాట్లాడలేదు.

15. అలా వచ్చేశాక, ఒక్కోసారి ఆ దారేమ్మట ఉన్న ఇరానీ హోటల్లో వేడిగా ఒక బన్నో,  బిస్కెట్ గానీ , టిఫిన్ గానీ తినేసి, అటు నుండి అటే దగ్గరలోని మార్కెట్ కి వెళ్ళేసి, దగ్గరి ఊర్ల నుండి వచ్చే, చాలా తాజా తాజా కూరగాయలు (ఏసీ ఫ్రెష్ స్టాల్స్ లలో ఉండేవి కాదు సుమా!.. ) మొదటి  బేరముగా కొనుక్కోచ్చేసుకొని, ఇక ఇంటికి తిరిగి రావటమే!.

16. ఇంతా చేస్తే నాకేదో అయ్యింది, అందుకే అలా వెళ్ళుతున్నాను.. అని మాత్రం కాదు లెండి. చేతులు కాలాక ఆకులు కట్టుకోవటం ఎందుకూ అనీ, అంతా బాగున్నప్పుడే - బాగా అవ్వాలని కోరిక. పైసా పైసా జమ చేసి, డాక్టర్ కి టోకుగా అందించటం ఎందుకూ.. అనీ..

17. ఇలా వెళుతున్నాక నాలో నూతన ఉత్తేజాన్ని కలిగిస్తున్నది. నా జీవితం ఇతకు ముందు కన్నా ఇంకా బాగా అందముగా కనిపిస్తున్నది కూడా.

18. ఈ చలికాలం వ్యాయామానికి చాలా మంచి అనువైన సమయం. చాలా బాగా ప్రతిస్పందన చూపే కాలం కూడా. 

Sunday, November 20, 2011

Useful lessons from Thailand floods

ఖాళీ మినరల్ బాటిల్స్ ని ఇలా ఒక వలలో వేసి, కట్టేసి, పిల్లలని సురక్షితముగా గట్టుకి చేర్చటం. 


ఆ క్యాబ్ కి అలా ఖాళీ పీపాలు కట్టితే - వరద నీటిలోకి వెళ్ళితే, మునగకుండా తేలుతుందని వారి ఆలోచన. 


వరదల్లో కూడా ఆనందించటం అంటే ఇదే!. ఎంత హాయిగా మందు పార్టీ పెట్టుకున్నాడో చూడండి. 


కార్లకి ఇలా భారీ ప్లాస్టిక్ కవర్లతో కవర్ చేస్తారు. ఇక వరదల్లో మునిగినా నీరు లోపలి వెళ్ళదు. వరద తగ్గగానే ఆ కారుని వెంటనే వాడుకోవచును కదా.. ఇది బాగుంది కదా.. 


వరదల్లో ఉన్న్నప్పుడు సైలన్సర్ గొట్టం లోకి నీరు పోయి వాహనం ఆగిపోతుంది కదా.. ఇలా ఇంజన్ మీద బానేట తీసేస్తే, అందులో ఉన్న పొగ గొట్టాన్ని అలాగే ఇంకో పైపు జోడించి అలాగే వదిలేస్తే, ఇక నీరు లోపలి పోయే సమస్య ఉండదు. 


హంసవాహనం అంటే ఇదేనేమో.. మోటార్ బోటుకి ఎంత డేకోరేషణ్ చేశారు. 


ఈ క్రింది ఫోటోలోలా వాహనం ఉంటే వరద నీటిలో హాయిగా తిరగవచ్చును కదా.. 


మంచి నీటికోసం పెట్టిన ప్లాస్టిక్ గిన్నెలు కావు అవి. అలా ప్రక్కప్రక్కన పెట్టి, అవి విడిపోకుండా వలతో బంధించి, దాన్ని ఇలా పడవలా వాడుకున్నారు. 


ప్లాస్టిక్ స్టూల్స్  ని ఇలా పాదరక్షలుగా చేసుకున్నాడు. ఇక హాయిగా గుంటలనుండీ, వరద నీటిలోనుండీ హాయిగా వెళ్ళొచ్చును. 


డబ్బాల మీద ఇలా ఒక చెక్క పరిచి, మహారాజులా అలా వరద నీటిలో వెళ్ళొచ్చును. 


ఇలా కర్రలతో నడిచే అలవాటు ఉంటే - హాయిగా వాటి సహాయాన అలా నీటిలో నడవవచ్చును. 


ఖాళీ ప్లాస్టిక్ సంచులతో ఇలా గాలి నింపి, వంటికి కట్టేసుకొని, నీటిలో మునిగిపోకుండా ఉండొచ్చును. 


షాపింగ్ మాల్ వారు వారి ట్రాలీలు ఇలా పెట్టేసి, దారిలా చేసి, మాల్ ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. 


ఇది ఖచ్చితముగా వరదల్లో ఉపయోగపడుతుంది. 


కావేవీ వరద రక్షణకి అనర్హం అన్నట్లు ఖాళీ బాటిల్స్ తో ఇలా ట్రాలీ చేసుకొని, అలా హాయిగా ప్రయాణం చేయ్యోచ్చును కదా.. ఇది బాగుంది కదూ.. 


Saturday, November 19, 2011

Himaseemallo hallo - Annayya

చిత్రం : అన్నయ్య (2000) 
రచన  : వేటూరి 
సంగీతం : మణిశర్మ 
గానం : హరిహరన్, హరిణి.
*************

పల్లవి :  

హిమసీమల్లో హల్లో - యమగా ఉంది ఒళ్లో
మునిమాపుల్లో ఎల్లో - మురిపాలా లోయల్లో
చలి చలిగా తొలి బలిగా - ఈడే ధారపోశా
చలిమిడిగా కలివిడిగా - అందాలార బోశా
పలకలూరి రామచిలుక పలుకగానే // హిమసీమల్లో హల్లో // 

చరణం 1 : 

సో సో కాని సోయగమా - ప్రియ శోభనమా
సుఖ వీణ మీటుదమా
వా వా అంటే వందనమా - అభివందనమా
వయసంత నందనమా
మొహమాటమైన నవమోహనం - చెలగాటమైన తొలి సంగమం
మది రగిలే హిమ మహిమ .. ఓ
అది అడిగే మగతనమా నీదే రావా
పడుచు పంచదార చిలుక పలుకగనే  // హిమసీమల్లో హల్లో //

చరణం 2 :

మా మా అంటే మాధవుడే - జత మానవుడే
పడనీడు ఎండా పొడి
సా సా అంటే సావిరహే - బహు శాఖలహే
నడిజాము జాతరలే
వాటేసుకుంటే వాత్సాయనం - పరువాల గుళ్ళో పారాయణం
రవి కనని రచన సుమా .. ఓ
సుమతులకే సుమ శరమా - నీవే ప్రేమా
పెదవి ప్రేమ లేఖ లిపిని చదవగనే  // హిమసీమల్లో హల్లో // 

Monday, November 7, 2011

మా ఫ్రెండూ - వాటర్ బాటిలూ

మొన్న మా ఫ్యామిలీ మిత్రుని ఇంటికి వెళ్ళాను.. కాసేపు కుశల ప్రశ్నలు అయ్యాక, టీ తీసుకోచ్చేశాడు. అలా టీ త్రాగుదామని అనుకొని అందుకునే లోపుగా " వాటర్ ఏమైనా కావాలా..?" అని నా సమాధానం కోసం ఏమీ చూడకుండా లేచి, ఫ్రిడ్జ్ డోర్ తీసి, ఒక వాటర్ బాటిల్ అందుకున్నాడు. దాని తలుపు మూసి, వచ్చేసి, ఆ బాటిల్ మూత సగం విప్పుతూ, నాకు అందించాడు.

ఎలాగూ విప్పాక త్రాగాకపోతే బాగోదని, అందునా పదిహేను రూపాయలు పెట్టి కొన్న బ్రాండెడ్ వాటర్ బాటిల్ ని వద్దని చెప్పలేక అలాని అందుకొని, నీరు  త్రాగేసి, అక్కడ పెట్టాను. మిగతా వాటర్ ని అలాగే ఎత్తిపట్టేసుకొని, త్రాగేసి ఖాళీ బాటిల్ ని అలా మూలగా వదిలేశాడు. వీడు మరీ "పోష్ స్టైల్స్.." చూపిస్తున్నాడు అని అనుకున్నాను.. అ తరవాత టీ త్రాగేశాను.

Aquafina 

ఆ తరవాత మాటల్లో ఖర్చు తక్కువ - లుక్కు ఎక్కువ అనే కాన్సెప్ట్ మీద చర్చ జరిగింది. అలా జరిగినప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాడు.. ఇందాక నేను త్రాగిన వాటర్ బాటిల్ బ్రాండెడ్ ఏమీ కాదు - ట.

"అదెలా..? ఆ బాటిల్ మీద అక్వాఫినా అంటూ బ్రాండ్ (పెప్సీ వారిది.) పేరు ఉంది కదా.." అన్నాను. ఒకింత హాస్చర్యపోతూ.. నా కన్నులు పనిచెయ్యటం లేదా? అని నా మీద నాకే డౌట్..

మాయాబజార్ సినిమాలోని ఘటోద్ఘజుడిలా ఒకసారి వికట్టాసం చేశాడు. ఆ తరవాత అసలు విషయం చెప్పాడు. అదీ ఎవరికీ చెప్పొద్దని అన్నాడు. (నిజానికి ఇలా చెప్పొద్దూ అని చెప్పినవే చెప్పాలని అనిపిస్తుంది కదూ)

వాడు కారులో ఎటైనా వేరే చోట్లకి వెళ్ళినప్పుడు - దారిలో వాటర్ బాటిల్ కొన్నాక, ఆ నీళ్ళు త్రాగాక ఆ బాటిల్ ని పారెయ్యడు. భద్రముగా ఎవరూ చూడకుండా - వెనక సీట్లోనో, డిక్కీలోనో వేసుకొని ఇంటికి భద్రముగా తీసుకొచ్చేస్తాడు. అలా వచ్చాక అతను వాటిలో వాటర్ బబుల్ లోని నీటిని నింపి, ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటాడు. చల్లగా, వాటి మీద కాసింత తేమ ఏర్పడేదాకా బయటకి తీయడు. ఆ తరవాత ఎవరైనా వస్తే అప్పుడే మూత (సీల్) విప్పినట్లుగా చేసి, త్రాగటానికి బాటిల్ ఇస్తాడు. ఇవన్నీ తెలీనివారు అదొక మహాభాగ్యముగా - మాకోసం క్రొత్త వాటర్ బాటిల్ సీల్ తీసి ఇస్తున్నాడు అనే భ్రమలో అతని సేవలకి పొంగిపోతారు.. ఆ బాటిల్ పాతది అయ్యిందా ఇక అది తీసేస్తాడు. ఇప్పుడే షాప్ లో అమ్మినట్లుగా లుక్ ఉంటేనే వాడుతాడు.

వాడి ఫ్రిడ్జ్ నిండా అలాంటి వాటర్ బాటిల్స్ ఉన్నాయి. ఇంటి లోపల బ్యాగుల్లో అలాంటి బాటిల్స్ మరెన్నో స్టాకు లో ఉన్నాయట. అలా మళ్ళీ మళ్ళీ వాడి పర్యావరణాన్ని తొందరగా పాడుకాకుండా (ఖాళీ బాటిల్స్ పారవేయకుండా మళ్ళీ వాడి) తనవంతు పాత్ర పోషిస్తున్నాను అని గొప్పగా చెప్పాడు. హ హ్హా హా.. పబ్లిక్ ఎంత తెలివి మీరిపోయారు.. 

Friday, November 4, 2011

అలా ఒక సాయంత్రం..

నిన్న రాత్రి అలా షాపింగ్ అని బయటకి వెళ్లాను. షాపింగ్ అయ్యాక చేతిలో బ్యాగ్ లతో అలా నడిచి, మెయిన్ రోడ్ మీదకి వచ్చాను. కొద్దిదూరం వెళ్ళి బస్ ఎక్కాలి. ఎలా వెళ్ళాలా అని అనుకొని, ఆటో పిలిచాను. ఎక్కువ దూరం ఏమీ కాదు కూడా. ఆటో మినిమం ఫేర్ దాటి, ఇంకో రూపాయి అయ్యే అంత దూరం. 

ఆ ఆటోవాడు "నలభై.." అన్నాడు. 
"అంతగా ఎందుకూ?.." అన్నాను.. 
"రిటర్న్ ఎవరూ రారు సార్! ఖాళీగా రావాలి.." అన్నాడు వాడు. 
"మినిమం ఫేర్ తీసుకో.." అంటే కుదరదు అన్నాడు.. ఇంకో ఇద్దరు ఆటోవాలాలు కూడా అంతే! ఒకడు మాత్రం ముప్ఫై అన్నాడు - అదీ బాగా బేరం చేశాక. 

ఇక ఇలా కాదనుకొని, అంత దూరం నడిస్తే! అన్న ఆలోచన వచ్చింది. గుడ్ ఐడియా అనుకున్నాను. అది నన్ను మారుస్తుందేమో అనుకున్నాను. ఓకే. నడక మొదలెట్టాను. చలి మెల్లగా కమ్ముకుంటున్న ఆ రాత్రి దారి అంతా చల్లగా, ఏసీ పెట్టినట్లుగా ఉంది. షారుక్ ఖాన్ లా "చల్లచల్లనీ ఖూల్ ఖూల్.." అనుకుంటూ ఆదారిలో ఉన్న షాపుల కేసి చూస్తూ, అలా విండో షాపింగ్ చేస్తూ అలా, అలా దిక్కులు చూసుకుంటూ నడక సాగించాను. 

కొద్దిదూరం నడిచాక - దారిలో చాట్ భండార్ కనిపించింది. అందులోంచి వస్తున్న వాసనకి నోరూరిపోయింది. ఒక కట్లెట్ కి ఆర్డర్ ఇచ్చాను. అది వేడివేడిగా తినేశాను. కడుపు నిండిపోయింది. కొద్దిగా శక్తి వచ్చినట్లుగా అనిపించింది కూడా. ఆ తరవాత "ఎంత?.." అంటే "పన్నెండు రూపాయలు.." అన్నాడు.  బాగా రుచిగా ఉంది అది. నేను రెగ్యులర్ గా తినే చోట పద్దెనిమిది రూపాయలు. 

తరవాత మళ్ళీ నడక సాగించాను. దారిలో ఆపిల్ పళ్ళు అమ్మే ఆమె కనిపించింది. ఎంత అని అడిగాను. పదిహేను కి ఒకటి చెప్పింది. ఒకటి కొనుక్కొని, బాగా తుడుచుకొని, హాయిగా తినేశాను. చాలా బాగా ఫ్రెష్ గా ఉంది. సూపర్ మార్కెట్లో అయితే ముఫై రూపాయలు గానీ దొరకదు. అలా నడక మొదలెట్టి నేను చేరుకోవాల్సిన బస్టాండ్ వచ్చేశాను. ఆ తరవాత బస్ ఎక్కి ఇంటికి వచ్చేశాను. 

కొద్ది దూరం ఈ నడక (పాదయాత్ర) కార్యక్రమం వల్ల నాకు - కాసింత వ్యాయామం, నా శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవటానికి అవకాశముగా అనుకోవటం, ఆ చల్లని వాతావరణములో కాసింత వేడివేడిగా తినటం, అలాగే ఆరోగ్యానికి రోజూ ఒక ఆపిల్ అన్నట్లు ఒక ఆపిల్ తినటం, ప్రజల భిన్న వైవిధ్యాలు, అలవాట్లు దగ్గరగా చూశాను. ఇవన్నీ ఆ ఆటోలో వెళితే - పొందేవాడిని కానేమో!

Monday, October 31, 2011

హలో!.. కాస్త ఆగండి..

ఈ క్రింది ఫోటో ని చూడండి. ఈ ఫోటోలో లావాటి చెట్టు వెనకాల, కారు కి మధ్య ఒకరు వెలుతున్నట్లుగా ఉంది కదూ.. గమనించారా?.. సరిగ్గా చూడండి.. వారు ఎవరో చెప్పుకోండి చూద్దాం..


ఒక అమ్మాయి షార్ట్ వేసుకొని, జుట్టు విరబోసుకొని, వెళుతున్నట్లుగా ఉంది కదూ.. నిజమే కదూ..!! హా.. అవును అంటున్నారా?.. అయితే వొకే! వొకే! ఇప్పుడు మనం తన దగ్గరగా వెళ్ళి చూద్దాం.. పదండి మరి. 

.
.

హలో!.. మీరు కాస్త ఆగుతారా? 
.
.

హలో!
.
.

వినిపించినట్లు లేదు.. మనమే కాస్త వేగముగా వెళ్ళి అందుకుందాము. 

హమ్మయ్య! దగ్గరగా వచ్చేశాం..
.
.
హా! 


షాక్!!

తుండుగుడ్డ ఉన్న కర్ర మోసుకెళ్ళుతున్న వృద్ధుడా? ఇందాక నుండీ మనం అమ్మాయి అని అనుకొన్నాము. ఛ!.. ఎంత దారుణముగా మోసపోయాము. 

మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి అనడానికి ఇది ఒక నిదర్శనం.. 

Sunday, October 30, 2011

Mobile Key pad

మొన్న మొబైల్ లో బ్యాలన్స్ వేయిద్దామని వెళ్లాను. అక్కడ అంతకు ముందే ఒకతను తన ఫోన్ రిపేర్ కోసం వచ్చాడు. ఆ ఫోన్ క్రొత్తగా ఉంది.. కానీ బాగా వాడాడు కాబట్టి దాని కీ ప్యాడ్ బాగా అరిగిపోయి, నంబర్స్ ఏవి ఏవో కనిపించకుండా పోయాయి. అది ఎలా చెయ్యాలి అని అడుగుతున్నాడు. నిజానికి అది చాలా చిన్న ప్రాబ్లెం. ఎలా సాల్వ్ చేస్తారు?.. ఎంత చార్జ్ చేస్తారో అని అని - నా ఫోన్ లో బ్యాలన్స్ వచ్చేవరకు అన్నట్లు ఆగాను.

ఫోన్ విప్పేసి, వెనకాల ఉన్న ప్యానెల్ తొలగించి, బ్యాటరీ మరియు సిమ్ కార్డులని తీసేసి, వాటికి ఉన్న చిన్నని, సన్నని స్క్రూస్ తీసేస్తే, ముందున ఉన్న కీ బోర్డ్ ప్యానెల్ ఫ్రేం ఓపెన్ అవుతుంది. క్రొత్తది కీ ప్యాడ్ ఎక్కించి, మళ్ళీ బిగిస్తే సరి. ఈమాత్రం దానికి ఎలా రిపేరింగ్ చార్జెస్ ఉంటాయో చూద్దామని ఆగాను.

ఆ షాప్ వాడు ఆ ఫోన్ ని చూసి కీ ప్యాడ్ మార్చాలి. మొత్తం నూటాఎనభై రూపాయలు అవుతుంది అని చెప్పాడు. అబ్బా అంతనా?.. అని నేను షాక్ లో ఉన్నాను. ఆ ఫోన్ యజమాని బేరం మొదలెట్టాడు. చివరికి నూటా అరవై కి బేరం కుదిరింది. ఇక నేను బయటకి వచ్చాను. బయట మొబైల్ ఫోన్ షాపుల్లో కేవలం పది, పదిహేను రూపాయలు ఉండే ఆ కీ ప్యాడ్ అంత ధర చెప్పటం మరీ షాకింగ్ గా ఉంది. కంప్యూటర్ కీ బోర్డ్ యే నూటా యాభై రూపాయలకి దొరుకుతున్నది.. అంత చిన్న దానికి అంత రేటా?

కొన్ని విషయాలు కాసింత జాగ్రత్తగా ఉంటే - చాలా అనవసర ఖర్చులు తగ్గించుకోవచ్చును. 

Saturday, October 29, 2011

Nenante - Oosaravelli

చిత్రం : ఊసరవెల్లి (2011) 
రచన : రామజోగయ్య శాస్త్రి. 
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్ 
గానం : అద్నాన్ సామి.

**************
పల్లవి : 

నేనంటే నాకు చా లానే ఇష్టం - నువ్వంటే ఇంకా ఇష్టం 
ఎచోటైనా ఉన్నా నీకోసం - నా ప్రేమ పేరు నీలాకాశం 
చెక్కిళ్ళు ఎరుపయ్యే సూరీడు చూపైన - నా చేయి దాటందే నిను తాకదే చెలి 
ఎక్కిళ్ళు రప్పించే ఏ చిన్ని కలతైనా - నా కన్ను తప్పించి 
నను చేరదే చెలి చెలి చెలీ // నేనంటే నాకు // 

చరణం 1 :

వీచే గాలీ నేను పోటీ పడుతుంటాం - పీల్చే శ్వాసై నిన్ను చేరేలా?
నేలా నేనూ రోజూ సర్డుకపోతుంటాము - రాణీ పాదాలు తలమోసేలా
పూలన్నీ నీ సొంతం - ముళ్ళన్నీ నాకోసం 
ఎండల్ని దిగమింగే నీడనై ఉన్నా - ఏ రంగు నీ నేస్తం అదేగా నా నేస్తం 
నీ నవ్వుకై నేను రంగు మార్చనా // నేనంటే నాకు // 

చరణం 2 :

చేదు బాధలేని లోకం నేనవుతా - నీతో పాటై అందులో ఉంటా 
ఆటా పాటా ఆడే బొమ్మై నేనుంటా - నీ సంతోషం పూచీ నాదంటా 
చిన్నారి పాపలకూ చిన్నారి ఎవరంటే - నీవంక చూపిస్తా అదుగో అనీ 
ప్రియాతి ప్రియమైన ప్రయాణం ఏదంటే - టకాలని చెప్పేస్తా నీతో - ప్రేమనీ.. // నేనంటే నాకు // 

Friday, October 28, 2011

New Orkut - New Changes

న్యూ ఆర్కుట్ వెర్షన్ మారింది.. మీరు క్రొత్తగా గమనించాల్సిన విషయాలు ఇవీ.. 

1. రీసెంట్ విజిటర్స్ - మీ హోమ్ పేజీలో కుడి కాలం లో అడ్వర్టైజ్ క్రింద ఉంటుంది. 

2. ఇంతకు ముందు మీరు వ్రాసిన స్క్రాప్ కి ఏమైనా అప్డేట్ వస్తే - అది Conversations లో చూసుకోవచ్చును. 

3. మీ డీపీ క్రింద ఉన్న Reminders లో మీకు వచ్చిన టెస్టిమోనియల్స్, Add request లు ఉంటాయి.

4. మీ ఫ్రెండ్స్ బర్త్ డేస్ ఇంతకు ముందులా ప్రొఫైల్ లో కాకుండా మీ DP క్రింద కనిపిస్తాయి. అక్కడ లింక్ నొక్కితే తెలుస్తుంది. 

5. మీరు గ్రూప్ స్క్రాప్ పంపినా అది ఎవరెవరికి పంపారో వారి DP లు థంబ్ నైల్ రూపములో ఉంటాయి. ఇప్పుడు అలా కాకుండా లింక్ రూపములో ఇస్తున్నారు. దీనివలన ప్రొఫైల్ పేరు మాటి మాటికీ మార్చేవారి ప్రొఫైల్ పేరు కనుక్కోవాలంటే - ఇక కష్టమే!. 

6. అప్పట్లో ఒక ఫోటో కొద్దిగా అంటే 25% విజిబిలిటీ వచ్చేది ఆ తరవాత read full post అని వచ్చేది.. ఇప్పుడు 75% ఇచ్చి, మిగతాది read full post అని వస్తున్నది. 

7. పోస్ట్ చేసిన సమయం అప్పట్లో పైన వచ్చేడిది. ఇప్పుడు క్రింద కుడి మూలన వస్తున్నది.

Tuesday, October 25, 2011

Deepavali - An idea

ఈ దీపావళి పండగ కి మీకు శుభాకాంక్షలతో పాటు మీకు ఒక చక్కని సుందరమైన ఐడియా ని ఇద్దామని అనుకుంటున్నాను.. అది వాడండి.

మామూలుగా ఇంటి ముందు దీపాల తోరణాలు గా దీపపు ప్రమిదలు పెడతారు. మట్టి ప్రమిదల్లో నూనె పోసి, వత్తులని పెట్టి, ఎంతో శ్రద్ధగా, భక్తిగా పెట్టేసి, నాయనాందకరముగా ఉండేట్లుగా తీర్చి దిద్దుతారు. లేదా క్రోవ్వోత్తులని అందముగా ఒక వరుసలో ఉండేట్లుగా వెలిగించుతారు. కాని ఇక్కడ నేను గమనించింది ఏమిటంటే - గాలికి అవన్నీ ఉండవు. లేదా టపాసుల చప్పుళ్ళ లో అవన్నీ ఆరిపోతాయి. పండగ పూట ఈ ఆరిపోవటం, లేదా మాటి మాటికి వెలిగించటం కాస్త విసుగ్గా ఉంటుంది  కూడా.. 

సంప్రదాయవాదులు కాస్త కోపం చేయకుండా, తిట్టకుండా, ఏమీ అనకుండా ఉంటే - అభ్యంతరం లేకుంటే - ఈ రెండు పద్దతులని పాటించండి. 

చైనా మేడ్ సీరియల్ ల్యాంప్స్ ఉంటాయి. అవి మామూలుగా మార్కెట్ లో Rs. 30 కి దొరుకుతాయి. కొన్ని చోట్ల Rs. 50 కి అమ్ముతారు. వాటిని నేల మీద వరుసగా ప్లాస్టర్ల సహాయన అతికేసి, కనెక్షన్ ఇస్తే సరి. అప్పుడు చీకటి పడ్డాక లైట్లు వేస్తే దీపాల్లా వెలిగిపోతాయి. 

ఇంకా ఈ ఎలెక్ట్రికల్ లైట్లని నిజమైన దీపాల్లా వాడాలి అంటే కూడా అలాగే చెయ్యవచ్చును. (ఇది ఎలాగో కాసేపట్లో అప్డేట్ చేస్తాను)  కాకపోతే చిన్నగా మూడు రూపాయల ఖర్చు అంతే!.. నిజానికి ఈ పోస్ట్ కి సమయం లేక ఆదరాబాదరాగా చెప్పేస్తున్నాను.. లేకుంటే ఇంకా డిటైల్డ్ గా చెప్పెసేవాడినే.. 

ఇంకో పద్ధతి.. ఇది మరీ బాగుంటుంది. అందరికీ నచ్చుతుంది కూడా.. 

బర్త్ డే నాడు వాడే మ్యాజిక్ క్యాండిల్స్ ఇవి పది, పదిహేను రూపాయల్లో దొరుకుతాయి. వీటిని ఇంటి ముందు అలా వెలిగించి ఉంచితే మరీ మరీ బాగుంటుంది. ఎలా అంటే - వీటికి ఒక ప్రత్యేకత ఉంటుంది. మామూలు క్రోవ్వోత్తులా ఉండి, వెలిగించినప్పుడు మామూలు క్రోవ్వోత్తుల్లానే వెలిగిపోతాయి. వీటిని అలా వరుసగా వెలిగించి ఉంచండి. గాలి వచ్చి ఆరిపోయినా, వాటంతట అవే కాకర పువ్వోత్తులకి లాగా చిన్నగా మిణుగురులు వచ్చి, మళ్ళీ మామూలుగా వెలిగిపోతాయి. ఇది బర్త్ డే పార్టీల్లో వీటిని వెలిగించినప్పుడు అందరికీ అనుభవమే. 

వీటిల్లో ఏదైనా వాడి మీ యొక్క దీపావళిని ఘనముగా జరుపుకుంటారని ఆశిస్తున్నాను.. 

Sunday, October 23, 2011

Nidurinche - Mutyala muggu.

చిత్రం : ముత్యాల ముగ్గు (1975) 
రచన : గుంటూరు శేషేంద్ర శర్మ (ఏకైక సినీ గీత రచన) 
సంగీతం : కే,వి. మహాదేవన్ 
గానం : పి. సుశీల. 
**************

పల్లవి : 

నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది.
కన్నుల్లో నీరు తుడిచి, కమ్మటి కల ఇచ్చింది. // నిదురించే తోట // 

చరణం 1 : 

రమ్యంగా కుటీరాన - రంగవల్లులల్లింది.
దీనురాలి గూటిలోన - దీనముగా వెలిగింది.
రమ్యంగా కుటీరాన - రంగవల్లులల్లింది.
దీనురాలి గూటిలోన - దీనముగా వెలిగింది
శూన్యమైన వేణువులో - ఒక స్వరం కలిపి నిలిపింది
శూన్యమైన వేణువులో - ఒక స్వరం కలిపి నిలిపింది
ఆకురాలు అడవికి ఒక - ఆమని దయ చేసింది. // నిదురించే తోట // 

చరణం 2 : 

విఫలమైన నా కోర్కెలు - వ్రేలాడే గుమ్మంలో
ఆశల అడుగులు వినబడి - అంతలో పోయాయి.
విఫలమైన నా కోర్కెలు - వ్రేలాడే గుమ్మంలో
ఆశల అడుగులు వినబడి - అంతలో పోయాయి.
కొమ్మల్లో పక్షుల్లారా - గగనంలో మబ్బుల్లారా
నది దోచుకుపోతున్న - నావను ఆపండి
రేవు బావురుమంటోందనీ - నావకి చెప్పండి. నావకి చెప్పండి..

Saturday, October 22, 2011

Nihaarika - Oosaravelli

చిత్రం : ఊసరవెళ్ళి (2011)
రచన : అనంత శ్రీరామ్, 

సంగీతం : దేవిశ్రీ ప్రసాద్,
గానం : విజయ్ ప్రకాష్, నేహా భాసిన్ 

************** 
పల్లవి : 


నీహారికా నీహారికా -  నువ్వే నా దారిక నా దారిక 
నిహారిక హారిక నిహారిక నువ్వే నే-నిక 
నిహారిక నిహారిక - నువ్వే నా కోరిక నా కోరికా 
నిహారిక నిహారిక నువ్వయ్యానిక 
నువ్వే నువ్వే కావాలి నువ్వే నువ్వే కావాలి అంటోంది నా ప్రాణమే 
నువ్వే నువ్వే రావాలి నువ్వే నువ్వే రావాలి అంటోంది నా హృదయమే 



నీహారికా నీహారికా -  నువ్వే నా దారిక నా దారిక 
నిహారిక హారిక నిహారిక నువ్వే నే-నిక 
నిహారిక నిహారిక - నువ్వే నా కోరిక నా కోరికా 
నిహారిక నిహారిక నువ్వయ్యానిక 
నీపై ఇష్టమెంతుందో మాటే చెప్పలేను - నిన్నే ఇష్టపడ్డానంతే నిహారిక నిహారిక నువ్వయ్యానిక 
నాకై ఇన్ని చెయ్యాలని నిన్నేం కోరుకోను. 
నాతో ఎప్పుడూ ఉంటానంటే - చాలంతే // ఓ నీహారికా నీహారికా // 


చరణం 1:


రెండు రెప్పలు మూత పడవుగా - నువ్వు దగ్గరుంటే 
రెండు పెదవులు తెరచుకోవుగా - నువ్వు దూరమైతే 
రెండు చేతులు ఊరుకోవుగా - నువ్వు పక్కనుంటే 
రెండు అడుగులు వెయ్యలేనుగా - నువ్వు అందనంటే  
ఇద్దరోక్కటయ్యాక ఒక్కచోట ఉన్నాక - రెండు అన్నమాటెందుకో 
ఒక్కసారి నా చెంత కొచ్చినావు నిన్నింక - వదులుకోను చేయ్యందుకో // నిహారిక నిహారిక // 


చరణం 2 : 


నువ్వు ఎంతగా తప్పు చేసినా - ఒప్పులాగే ఉందీ 
నువ్వు ఎంతగా హద్దు దాటినా - ముద్దుగానే ఉందీ 
నువ్వు ఎంతగా తిట్టిపోసినా తీయతీయగుందీ
నువ్వు ఎంతగా బెట్టు చూపినా - హాయిగానే ఉందీ 
జీవితానికీవేళ చివరిరోజు అన్నట్లూ - మాటలాడుకున్నాముగా 
ఎన్ని మాటలౌతున్నా క్రొత్త మాటలింకేన్నో- గుర్తుకోచ్చేనే వింతగా // నీహారికా నీహారికా // 

Wednesday, October 19, 2011

Related Posts with Thumbnails