Tuesday, September 28, 2010

Khaleja - Shivashambho Om namo shiva..

చిత్రం : ఖలేజా (2010) 
రచన : రామజోగయ్య శాస్త్రి
సంగీతం : మణిశర్మ
గానం : రమేష్, హేమచంద్ర, కారుణ్య
**************************
ఓం నమో శివ రుద్రాయ
ఓం నమో శితి కంఠాయ
ఓం నమో హర నాగాభరణాయ ప్రణవాయ
డమ డమ డమరుక నాదానందాయ
ఓం నమో నిటలాక్షయ
ఓం నమో భాస్మాంగాయ
ఓం నమో హిమశైలావరణాయ ప్రమథాయ
ధిమి ధిమి తాండవకేళీలోలాయ

సదాశివ సన్యాసీ తాపసీ కైలాసవాసీ
నీ పాద ముద్రలు మోసీ
పొంగిపోయినది పల్లె కాశి
హె!.. సూపుల సుక్కాని దారిగ
సుక్కల తీవాసీ మీదిగా
సూడసక్కని సామి దిగినాడురా
ఏసైరా ఊరువాడా దండోరా
ఏ రంగుల హంగుల పొడలేదురా
ఈడు జంగమ శంకర శివుడెనురా
నిప్పు గొంతున నీలపు మచ్చ సాచ్చిగా
నీ తాపం శాపం తీర్చేవాడేరా!..
పైపైకలా బైరాగిలా ఉంటాదిరా ఆ లీల
లోకాలనేలేటోడు - నీకు సాయం కాకపోడూ
నీలోనే కొలువున్నోడూ - నిన్ను దాటి పోనేపోడూ
ఓం నమః శివ జై జై జై - ఓం నమః శివ జై జై జై

ఓం నమః శివ గో టూ ద ట్రాన్స్ అండ్ సే జై జై జై 
సింగ్ అలాంగ్ అండ్ సింగ్ శివ శంభో ఆల్ ద వే
ఓం నమః శివ జై జై జై
హీల్ ద వరల్డ్ ఈస్ ఆల్ వీ ప్రే
సేవ్ ఔర్ లీవ్స్ అండ్ టేక్
ఔర్ పెయిన్ అవే జై జై జై .. 
సింగ్ అలాంగ్ అండ్ సింగ్ శివ శంభో ఆల్ ద వే 

సదాశివ సన్యాసీ తాపసీ కైలాసవాసీ

నీ పాద ముద్రలు మోసీ
పొంగిపోయినది పల్లె కాశి
ఎక్కడ వీడుంటే నిండుగా - అక్కడ నేలంతా పండగ
సుట్టు పక్కల సీకటి పెళ్ళగించగా
అడుగేశాడంటా కాచే దొరలాగా
మంచును మంటను ఒక్క తీరుగ
లెక్క సేయ్యనే సేయ్యని శంకరయ్యగా 
ఉక్కు కంచెగా ఊపిరి నిలిపాడురా
మనకండా దండా వీడే నికరంగా
సామీ అంటే హామీ తనై ఉంటాడురా చివరికంటా // లోకాన //

Thursday, September 23, 2010

నాకు ఏమాత్రం పరిచయం లేని మిత్రుడి కమ్మని ఆతిధ్యం.

ఇది చాలా చాలా సంవత్సరాల క్రిందట - అంటే 1996 లో జరిగిన విషయం ఇది. అప్పట్లో మనదంతా పైలా పచ్చీసు వయసు.. అంతా కొత్తగా.. బోలడంత స్వేఛ్చ.. అప్పట్లో జరిగిన ఒక విషయం నాకు కొన్ని మధుర జ్ఞాపకాలని శాశ్వతం చేసింది. స్నేహం అంటే ఏమిటీ.. స్నేహితులని ఎలా గుర్తుపెట్టుకోవాలి.. ఎలా ఆతిధ్యం ఇవ్వాలి అన్నది - నాకు జీవితములో ఒక మధురమైన పాఠాన్ని కలుగచేసింది. నేను అక్కడ ఒక ప్రేక్షక అతిధి ని మాత్రమే. అందుకే అంత బాగా గమనించగలిగానేమో..  ఆ అనుభవేమిటో మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. అలాగే ఇంకొన్ని విషయాలు కూడా ఇక్కడే చెప్పదలచుకున్నాను. అసలు విషయం కొద్దిగా అయిననూ.. ఇంకొన్ని విషయాలనీ సేపరేటుగా ఎందుకు చెప్పాలని ఇక్కడే ఇరికించేస్తున్నాను. బోరుగా ఫీల్ కావద్దని మనవి.

దాదాపు పద్నాలుగు సంవత్సరాలుగా మది లోపలి పొరల్లో దాగిన ఈ జ్ఞాపకం - మొన్న ఒక నా ఆర్కుట్ మిత్రురాలి స్వాగత మరియు భోజన కార్యక్రమం ఏర్పాట్లు ఎలా చెయ్యాలీ అని ఆలోచన చేసేముందు ఎందుకో చప్పున  స్పురించింది. చాలా చిన్న విషయమే అయినా అక్కడి పరిస్థితుల్లోకి దూరి చదివితే - మరీ బాగుంటుంది అని ముందే మీకు విన్నవించుకుంటున్నాను.

నా మిత్రుడొకరు క్రొత్తగా బ్యాంక్ లోన్ తీసుకొని మహీంద్రా వారి "కమాండర్" జీపు - వేన్నీళ్ళకి చన్నీళ్ళు అనే టైపులో ఆ జీపు ని అద్దెల కోసం ఒకటి తీసుకున్నాడు. అప్పట్లో అవి చాలా ఫేమస్. వాటిని అప్పట్లో అద్దెలకి బాగా తీసుకొనేడివారు. మొదటి కిరాయిని తిరుపతికి పంపాడు. రెండోది మాది - అంటే స్నేహితుల గుంపుది అన్న మాట. అలా ఫ్రెండ్స్ కి పార్టీ ఆ రూపకముగా ఇచ్చాడు అన్నమాట. మాది ఆరుగురు మిత్రుల సమూహం మాది. అందరి పేర్లూ ఆంగ్ల అక్షరం R తో మొదలయ్యేవి. అందులో నలుగురి స్నేహితుల పేర్లు - రమేష్. ఆ బండి మొదటి ట్రిప్పు పోయివచ్చాక.. ఇంకో ఇద్దరినీ కలుపుకొని మేము టూర్ బయలుదేరాం. ఇద్దరు స్నేహితులూ, డ్రైవర్తో కలుపుకొని మొత్తం ముగ్గురు డ్రైవర్లు అయ్యారు. అన్నట్లు ఆ బండి నంబర్ నేనే పెయింట్ తో వ్రాసాను.

మొదటి సర్వీసింగ్ కి ఇచ్చిన బండిని తీసుకొని - కాస్త చీకటి పడ్డాక ప్యారడైస్ హోటల్లో సుష్టుగా కాస్త మెక్కేసి, హైదరాబాద్ నుండి మా యాత్ర మొదలయ్యింది. ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం ఈసారి (తిరుపతి వెంకన్న దగ్గరికి మొదటి యాత్ర వెల్లివచ్చిందని) విజయవాడ దుర్గమ్మ దగ్గరికి బయలుదేరాం. ఆటపాటలతో సరదాగా సాగిపోయింది..

అర్ధరాత్రికి అందరూ పడుకున్నారు. మా మిత్రులు ఇద్దరు మేల్కొని డ్రైవింగ్ బాధ్యతలు చూసుకున్నారు. ఇలా ఒక్కొక్కరిదీ ఒక్కో బాధ్యత. ఆ ఇద్దరూ డ్రైవింగ్, బండి పార్కింగ్, ఆయిల్, డిజీల్, టోల్ గేట్ .. ఆయితే, ఇంకో ఇద్దరిదీ హోటల్స్ అద్దెలూ, అకామడేషన్, భోజనాలు చూసుకోవాలి.. ఇంకో అతనిది - కాషియర్ + అక్కౌంటెంట్ (అందరి ఉమ్మడి ఖర్చు వ్రాయాలి అన్నమాట.) నాదీ, ఇంకో అతనిదీ లగేజ్ బాధ్యత (లగేజ్ ని కాపలా కాయటం, రూముల్లోకి చేర్చటం, బండిలోకి ఎక్కించటం ) ఇలా ప్రతివారికీ ఒక్కో బాధ్యత. ఈఅనుభవం నాకు మోటార్ సైకిల్ మీద భద్రాచలం - రాజమండ్రి కి వెళ్ళినప్పుడు అవసరం పడి చక్కగా నిర్వహించాను. ఇంక ఇందులోనే మాకొక కెప్టన్. ఏదైనా సమస్య వస్తే - అతను చెప్పినట్లుగా వినాలి అని. కాదని ఎదురు చెప్పకూడదు అని ముందే నిర్ణయం. అలా బాధ్యలతో, సరదాలతో మా టూర్ ని మొదలెట్టాము.

విజయవాడలో కృష్ణానదిలో స్నానం చేసి, దుర్గ గుడిని దర్శించుకొని అటు నుండి అన్నవరం, సింహాచలం కి వెళ్ళాము. మధ్యలో అరకు కి, బొర్రా గుహలకి  కూడా వెళ్లాం. సాయంత్రం, ఆ పున్నమి రాత్రి లో వైజాగ్ బీచ్ అందాలని ఒక గంటలో చూసుకొని, ఇంకా ముందుకి వెళ్ళటం మరియొక ట్రిప్పులో చూసుకుందామని, తిరుపతికి రిటర్న్ అయ్యాము. మళ్ళీ విజయవాడకి వచ్చి తెనాలికి బయలుదేరాం. ఇక్కడే అసలు టపా మొదలవుతుంది..

నా మిగతా మిత్రులకి కామన్ ఫ్రెండ్ అయిన కొండ @ కొండలరావ్ వీరితో బాటుగా చదువుకున్నాడు. 1977 లో వచ్చిన దివిసీమ ఉప్పెనకి సర్వం కోల్పోయి.. ఇక్కడికి వచ్చి బ్రతికారు. అతని ఎనిమిదవ తరగతి మొదట్లో అతడి నాన్నగారు (ఉప్పు వ్యాపారం చేసెడివారు) చనిపోవటముతో వారి ఊరికి వెళ్ళిపోయారు. అతని మీదే కుటుంబ భారం పడింది. తరవాత తెనాలి లో సెటిల్ అయ్యారని తెలుసుకున్నారు. అతను వీరికి దూరం అయ్యాక - పుష్కర కాలం (12 సంవత్సరాలు) తరవాత, మరీ గుర్తుపెట్టుకొని, ఎలాగూ చేతిలో బండి ఉందని.. అలాగే వెళ్లి అతన్ని కలుద్దామని వీరి ఆలోచన. నాకైతే అతడితో ఏమాత్రం పరిచయం లేదు. నా స్కూల్ మేట్ కూడా కాదు. కనీసం ఒక్కసారి కూడా చూడలేదు.

ఇక్కడ గమనించదగిన, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అతడి పేరూ, అతడి నాన్న పేరూ, చేసిన వ్యాపారం, స్నేహం, వలస వచ్చిన విశేషం తప్ప మరే ఇతర ఆధారం ఏమీ లేదు. అంటే పోస్టల్ అడ్రెస్ గానీ, ఫోన్ నంబర్ గానీ.. లేదు. అక్కడికి మాలో ఎవరమూ ఆ ఊరికి కూడా వెళ్ళలేదు. అయినా దొరుకుతాడు అన్న ధీమా వారిది. వీరి టాలెంట్ నాకు తెలుసు.. ఎలాగూ దొరకపట్టుతారు. కాకపోతే ఎలా? ఎంత తొందరగా?.. అన్నదే కాస్త సందేహం.

మేము బయలుదేరిన కాలం అసలే చలి కాలం. ఇప్పుడంటే రోడ్లు బాగున్నాయి కాని అప్పట్లో రోడ్లు అన్నీ సింగల్ రోడ్లే. ఈ తెనాలికి వచ్చే దారిలో ఆ పంట పొలాల మధ్య నుండి వస్తుంటే చిక్కని పొగమంచు. జీపు లైట్లలో మూడు మీటర్ల దూరం లో ఉన్నవి కూడా అగుపించని అంతగా చిక్కని పొగమంచు. దారి కనిపించక ఎక్కడ యే గోతిలో పడుతామేమో అని ఆ రాత్రి ఒక చిన్న పల్లెటూర్లలో అరుగులమీద, పాకాల ముందు, రోడ్డు మీది హోటల్ బెంచీల మీద పడుకోవాల్సివచ్చింది. అలవాటు లేని కారణముగా ఆ రాత్రి ఎవరికీ సరిగా నిద్ర లేదు. వేకువ ఝామున్నే ఆ ఇంటివారు పాకలవారు నిద్రలేచి బయటకి రావటముతో.. నవ్వుకుంటూ, వారికి బదులు చెప్పి వారు పెట్టిచ్చిన టీ త్రాగి (డబ్బులకి) మళ్ళీ ప్రయాణం సాగించాము.

ఉదయం ఆరున్నర, ఏడు గంటల వరకల్లా తెనాలి లో ఉన్నాము. అక్కడే అతడి గురించి ఎంక్వైరీ చేశారు. కాసేపట్లోనే తెలిసింది. జస్ట్ ఒక పది నిముషాలల్లోనే అడ్రెస్, వారింటికి ఎలా వెళ్ళాలీ అన్నీ తెలుసుకున్నారు. అబ్బో!.. వీరు అసాధ్యులే అని అనుకున్నాను. ఆ సంతోషములో అలాగే వెళ్ళాలి అనుకున్నారు గాని - అలాగే వెళితే మమ్మల్ని ఎవరూ గుర్తుపట్టక తరిమేస్తారేమో నని, కాస్త రిఫ్రెష్ అయ్యి వెళదామని  ఒక  లాడ్జ్ కి  వెళ్లాం. యధావిధిగా నాకు సామానుల మోత. మేము అవన్నీ లోనికి చేర్చి మొఖం కడిగేలోగా ఆ కామన్ ఫ్రెండ్స్ వి అన్నీ అయిపోయాయి. చక్కగా తలంటుకొని, చక్కని డ్రెస్ టక్ చేసుకొని వేసుకొని, అతడికో గిఫ్ట్ తీసుకొని.. చాలా సంతోషముగా వారింటికి బయలుదేరారు. నేను నా స్నానం చేసుకొని (అందరికన్నా చివరి వంతు నాది అయ్యింది ) తయారయ్యేసరికి - వారు అతడిని తీసుకొని తిరిగివచ్చేశారు. అతడితో మావి కాస్త పరిచయాలు అయ్యాయి.. రూం సర్దేసి అందరినీ వారింటికి తీస్కెల్లాడు.

వీరు అతడి ఇంటికి పోయాక ఆ మిత్రుడు - కొండలరావ్ వేరేవారితో మాట్లాడుతూ ఉన్నాడు. వీరు అతడి గురించి ముందే తెలుసుకున్నారు (దూరమునుండే చూసి అతడే అని వేరేవారితో నిర్ధారించుకొని ) కాబట్టి అతడి దగ్గరికి వెళ్లి
"బాగున్నావా?" అని అడిగారు.
"బాగున్నాను.." అని - వీరిని గుర్తుపట్టక యధాలాపముగా అని ఆ మిగతావారితో అతను మాట్లాడుతూనే ఉన్నాడు.
వీరు అతన్నే చూస్తూ ఉండిపోయారు.
వీరెంట్రా పలకరించి అలాగే నా మొఖం కేసి నవ్వుకుంటూ చూస్తూ ఉండిపోయారు అనుకుంటూ "మీకేం కావాలండీ.." అని అడిగాడు వీరిని.
"నీవే కావాలీ.." అని చెప్పారు వారు.
గతుక్కుమని చూస్తూ ఆలోచించుకుంటూ ఉండిపోయాడు.
"అసలు మీకు ఎవరు కావాలీ.." అని మళ్ళీ రెట్టించాడు.
"మాకు కొండలరావ్ కావాలీ.. నీవే కదూ.." అని అన్నారు.
"అవును.. మరి మీరెవరూ?.." అతని కన్ఫ్యూజన్.
"చెప్పుకో చూద్దాం.. నీకు బాగా తెలిసినవారిమీ.."అని కాసింత నవ్వుతో అన్నారుట.
దాంతో అతను తెగ ఇదైపోయాడుట. తల గోక్కుంటూ, నవ్వుతూ, ఎన్నో హావభావాలతో ఆలోచించి.. చించీ కొన్నిపేర్లు చెప్పి చివరకి చెప్పాడు - మీరు నా చిన్నప్పటి ఫలానా మిత్రులే కదూ - అని. అలా మళ్ళీ కలిశారు.

ఇక రూం ఖాళీ చేశాం. మళ్ళీ లగేజ్ సర్దాను. అందరమూ (తొమ్మిది మందిమి) వారింటికి వెళ్లాం. వారి అమ్మగారినీ, భార్యనీ, నెలల బాబునీ పరిచయం చేశాడు. అక్కడ టీ త్రాగాం. ఉండండి .. ఇంత దూరం వచ్చారు. కనీసం భోజనం చేసి పొమ్మని ఓ చిన్ని అభ్యర్ధన.. ఆ కామన్ ఫ్రెండ్స్ ఓకే అన్నారు గానీ, మిగతావారేమో బయట తినేద్దాం అని. చివరికి మా కెప్టెన్ వారింట్లోనే భోజనానికి ఓకే అన్నాడు. ..నిబంధన వల్ల ఇక ఏమీ మాట్లాడలేక పోయాం.

ఉదయాన తోమ్మిదీన్నర కి మొదలెట్టిన వారి వంట కార్యక్రమం మధ్యాహ్నం ఒకటిన్నర వరకూ సాగింది. అంతవరకూ మేము ఆ రెండు రూముల పోర్షనులో ఆ ముందు రూములో టీవీ చూస్తూ ఉండిపోయాం. కాసేపటికి బోర్ వచ్చి బయటే ఉండిపోయాం. అలా కడుపులో కుర్రు కుర్రుమంటున్నా ఏమీ అనలేని పరిస్థితి. అబ్బా!.. ఆకల్రోయ్! అనే కేకలు.. అతడేమో లోపలికీ బయటకీ తిరగటం. ఏవేవో బయట నుండి తెచ్చి అన్నీ అందించటం అతను చేస్తున్నాడు. అతడి అమ్మగారు కాస్త సాయం చేస్తుంటే వాళ్ళావిడ వండేస్తున్నది. ఒకటిన్నరకి బాగా విసుగొచ్చేసింది. ఎందుకొచ్చామురా అనే అంతగా విసుగు. ఏం చేస్తాం!.. అప్పుడు భోజనం రెడీ అన్న పిలుపు. హమ్మయ్య అని అనుకున్నాము.

వెళ్లి బోజనానికి కూర్చున్నాము.. ఆ చిన్ని రూములోనే అందరమూ సర్దుకొని కూర్చున్నాము. వడ్డనలు మొదలయ్యాయి. ఒకటి తరవాత ఒకటి వేస్తూ ఉంటుంటే ఇన్ని వేరైటీలా.. అని హాశ్చర్యపడిపోవటం మా వంతు అయ్యింది.. ఎన్ని .. కాదు కాదు ఎన్నెన్ని వెరైటీలు... అసలు విస్తరే సరిపోలేదు. ఇంకో విస్తరి వేసుకోవాలేమో అన్నంత వెరైటీలు. అసలు విస్తరిలో పట్టలేదు అంటేనే అర్థం చేసుకోండి. స్వీటు, బూంది, రెండు రకాల పప్పు, అప్పడం, వడియాలు, (అప్పుడే చేసిన) మూడు పచ్చళ్ళు, సాంబారు, రసం, గడ్డ పెరుగు, చికన్, రొయ్యల వేపుడూ, బిర్యానీ, మామూలు అన్నమూ,గుత్తి వంకాయ మసాలా కూరా... ఓహ్! ఇంకొన్ని మరచి ఉండొచ్చు.. ఆ రోజు శుక్రవారం కాబట్టి చికన్, రొయ్యలూ తినలేకపోయా.. అప్పటిదాకా ఆలస్యం చేసినందులకి వారిని ఏదో తిట్టుకున్నవారిమి, మెచ్చుకోలేక ఉండలేకపోయాను.. అంత తక్కువ సమయములో అన్ని వంటకాలు.. ఓహ్.. నేను ఇంకా ఆ కమ్మని ఆతిధ్యాన్ని ఇన్ని సంవత్సరాలు అయిననూ మరవలేకున్నాను.. ఆ అన్నివేరైటీలూ, తక్కువ సమయం, కమ్మని రుచీ.. ఓహ్.. ఇంకా చెప్పాలంటే నా అదృష్టం అనే అనుకోవాలి. బయట తినే దానికంటే - అక్కడ తిని ఎంతో, ఎన్నెన్నో విషయాలు నేర్చుకున్నాను. ఆలస్యముగా వంట చేసి - మమల్ని అంత సేపు ఉపవాసం చేయించిన వారి కష్టం ఏమిటో నాకు అప్పట్లో అర్థం కాలేదు. ఇప్పుడు సాంకేతికముగా ఇంతగా ఎదిగాక ఆ నాలుగు గంటల్లో ఒకరి సహాయముతో వారి ఆవిడ - అంత చిన్న రూములో, చిన్న పిల్లాడిని చూసుకుంటూ - ముందు రూములోకి వంట చప్పుడు ఏమీ వినిపించనంతగా అంత నిశబ్దముగా - అంత బాగా వంట చేసి మమ్మల్ని సంతుష్టులని చేసినదంటే - నిజముగా ఆమెకీ హాట్సాఫ్ చెబుతున్నాను. అప్పట్లో అలా చెప్పాలని నాకు తీలీదు. ఇప్పుడు సిగ్గుపడుతున్నాను. కొన్ని గొప్పదనాలు వెంటనే చప్పున అర్థం కావు.. బహుశా మన మెదడు మోకాల్లో ఉండి ఎదగక పోవటంవల్ల కావచ్చేమో అనిపిస్తుంది. అంతా అర్థం అయ్యి చెప్పేసరికి ఆ వ్యక్తులు మనకి దూరంగా వెళ్ళిపోతారు.. మళ్ళీ వెదుకులాట తప్పదేమో!.. ఉన్నప్పుడు గొప్పదనం తెలుసుకోక - అంతా అయ్యాక తెలుకుని ఏం చేస్తాం.. ఇదేనా జీవన వైచిత్రి??

Friday, September 17, 2010

మీ జీ మెయిల్ - కాంటాక్ట్స్ లిస్టు.

మీరు జీ మెయిల్ లో చాటింగ్ బాగా చేస్తుంటారా? అవుననే అంటున్నారా? ఓకే.. ఒకసారి మీ జిమెయిల్ ఎకౌంటు చూసుకున్నారా?.. ఏం అని అడుగుతున్నారా?.. ఒకసారి మీ జీమెయిల్ లోని కాంటాక్ట్స్ ని ఓపెన్ చెయ్యండి. అందులో ఉన్న కాంటాక్ట్స్ అన్నీ  పరిశీలించండి..  మీకు తెలిసిన వాటికన్నా తెలీని మెయిల్ ID లు ఎక్కువగా ఉంటాయి. అవునా... చూసుకున్నారా.. ? ఎక్కడ చూసుకోవాలి అని అంటున్నారా? ఇదిగో ఇక్కడ -ఎర్రని రంగు వృత్తములో చూపిన దగ్గర..


అక్కడ ఉన్న అన్ని గ్రూపుల్లో ఉన్న మీ కాంటాక్ట్ లని ఒక్కసారి పరిశీలించండి. అందులో మీకు తెలిసిన వాటికన్నా తెలీని వారి ఈమెయిలు ID లు ఎక్కువగా ఉంటాయి. (ఇలా ఎందుకు ఉన్నాయి అంటే - మీరు పంపిన మెయిల్స్ వల్ల అలా మీ కాంటాక్ట్స్ లలోకి ఆ మెయిల్ ID లన్నీ ఎక్కేసాయి) మీకు ఆర్కుట్ ఖాతాయే గనుక ఉంటే అందులో మీకు మిత్రులుగా ఉన్న వారి మెయిల్ ID లన్నీ ఇందులో కూడా ఉంటాయి. అలాగే మీ జిమెయిల్ ID లో మీకు తెలిసిన మెయిల్ ID లు కూడా అందులో ఉండొచ్చు. అయితేమిటట? అని మీరు అనవచ్చును..అదే చెప్పబోతున్నాను..

అలా చెత్తగా ఉంచుకునే బదులు.. అనవసర మెయిల్ ID లన్నీ తీసేసుకోండి. అన్ని మెయిల్ ID లు ఉంచుకున్నంత మాత్రాన మీకు ఏమీ ఒరగదు. అదొక చెత్తకుండీ లాగా చెయ్యకండి. ఇది నిర్వహించేముందు ముందుగా మీ పాస్ వర్డ్ ని పటిష్టముగా ఉండేలా మార్చుకోండి. అంటే ఆ పాస్ వర్డ్ ని ఎనిమిది అక్షరాలకి పైగా ఉండేలా చూసుకోండి. అలా ఎన్ని అక్షరాలు ఉంటే అంత భద్రత ఎక్కువ అని మరచిపోకండీ..

అలా ఎందుకు చెయ్యాలో - చెబుతున్నాను. ఇప్పుడు జీ మెయిల్ వాడు క్రొత్తగా అడ్రస్ బుక్ కూడా ఇస్తున్నాడు. అది కావాలీ అంటే జీ మెయిల్ ID తప్పనిసరి. అప్పుడు మీ జీ మెయిల్ అక్కౌంట్ ఓపెన్ చేసినప్పుడు, ఆ కాంటాక్ట్ లిస్టు లోని ప్రతి మెయిల్ ID కి తగిన డిటైల్స్ మరియు ఫోటో కూడా మనం మార్చుకోవచ్చును / పెట్టుకోవచ్చును.
అలా అన్ని వివరాలు అందులో పెట్టుకున్నప్పుడు ఆ మెయిల్ ID కి పాస్ వర్డ్ కి భద్రత బాగా ఉండాలిగా!.. అందుకే అలా చెప్పాను.

అలా సెట్ చేశాక - ఆ కాంటాక్ట్స్ లోని ప్రతి మెయిల్ ID లని పరిశీలించండీ! అనవసరమైన మెయిల్ ID లను గుర్తించి ఆ మెయిల్ ID లను డెలీట్ చేసెయ్యండి. ఇప్పుడు మీ స్నేహితుల మెయిల్ ID ల మీద నొక్కండి. అప్పుడు మీకు ఒక చిన్న బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో ఆ మిత్రుడి - ఆర్కుట్ ప్రొఫైల్ పేరు గానీ, స్టైల్ లెటర్స్ గానీ ఉంటే అవి తీసేసి, మామూలు పదాలలో మీరు - మీ ఫ్రెండ్ ని ఎలా గుర్తిస్తారో అలా అందులో వ్రాయండి. అలాగే ఫోటో కూడా అందులో ఎక్కించేసేయ్యండి. అలా ఎలా చెయ్యాలో ఈ క్రింది ఫోటో ఒకసారి చూడండి.   ..


పై ఫోటోలో చూపినట్లు - ఆ ఎర్రని రంగు బాణం గుర్తువద్ద చిన్న డబ్బా కనిపిస్తుందా? అది నిజానికి కనిపించదు. అది ఉన్నది అని కూడా తెలీదు. అక్కడ కర్సర్ ని పెట్టేదాకా ఆ చిన్ని డబ్బా కనిపించదు. అంటే ఆ ఫోటో ప్రక్కన పేరు ప్రక్కకి కర్సర్ తీసుకొస్తే అప్పుడు ఆ బాక్స్ కనిపిస్తుంది. అలా ఆ బాక్స్ కనిపించగానే ఆ చిన్ని బాక్స్ ని నొక్కితే అప్పుడు ఎడిట్ బాక్స్ ఇలా వస్తుంది. 


ఈ బాక్స్ లో అంతకు ముందున్న వారి పేరు తీసేసి (మార్క్ చేసేసి, బ్యాక్ స్పేస్ / డెలీట్ చేసి) మీరు క్రొత్తగా వారి పేరుని టైప్ చేసి క్రింద ఉన్న Save బటన్ ని నొక్కితే సరి. ఇక వారు ఎన్ని పేర్లు మార్చినా ఇక మీకు ఇబ్బంది ఏమీ ఉండదిక. చాట్ చేస్తున్నప్పుడు ఎవరితో చేస్తున్నామో మనకు స్పష్టముగా తెలుస్తుంది. వారు ఛాట్ పింగ్ చెయ్యగానే వెంటనే రెస్పాండ్ అవచ్చు. ఇది చాలా చిన్న విషయమే గానీ, చాలా మందికి తెలీదు. అలాగే వారి ఫోటో ఉంటే ఆ ఫోటో కూడా పెట్టేస్తే..ఇంకా బాగుంటుంది. అలాగే వారి వివరాలు కూడా అన్నీ ఫీడ్ చేసుకోవచ్చును.

Wednesday, September 15, 2010

బంగారు పంజరం - నీ పదములే చాలు రామా!

చిత్రం : బంగారు పంజరం (1969)
రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి
సంగీతం : ఎస్. రాజేశ్వర రావ్. బి. గోపాలం
గానం : ఏ.పి. కోమల.
**************************
పల్లవి :
నీ పదములే చాలు రామా!
నీ పద దూళులే  పదివేలు // నీ పదములే చాలు //

చరణం 1:
నీ పదమంటిన పాదుకులు 
మమ్మాదుకొని ఈ జగమేలు
నీ ఆయ గౌతమి గంగా - రామయ
నీ దాసులు మునుగంగా
నా బ్రతుకోక నావ
దానిని నడిపే తండ్రివి నీవా // నీ పదములే చాలు //  

చరణం 2:
కోవెల లోనికి రాలేను.
నువు కోరిన కనుక తేలేను.
నిను గానక నిమిషము మనలేను
నువు కనపడితే నిను కనలేను // నీ పదములే చాలు //  

Sunday, September 5, 2010

మెమొరీ కార్డ్ - మొబైల్ సెంటర్ - 2

మొబైల్ సెంటర్లలో ఇంకో విషయం గమనించినది ఏమిటంటే.. వారి సిస్టం గురించి. అన్ని సిస్టమ్స్ లాగా ఉంటాయి. కాని వైరసూ ఉంటుంది. అదెలా అంటే మెమొరీ కార్డ్ నింపటానికో వారివద్దకి వేలతాముగా.. అలా చెయ్యటానికి ఆ మెమొరీ కార్డ్ ని కార్డ్ రీడర్ లో పెట్టి సిస్టం కి అమర్చుతారు. చెప్పానుగా వెంటనే కాస్త నైపుణ్యముగా ఆ మెమొరీ అంతా సిస్టం లోనికి అప్లోడ్ చేస్తాడని. అప్పుడు మనల్ని ఏమి పాటలు వేయమంటారో అడుగుతాడనీ.. మనం కోరిన పాటలు వేస్తారు. ఆతర్వాత ఆ నింపిన మెమొరీ కార్డ్ ని మనకి ఇస్తాడు. దాన్ని మనం వాడుకుంటూ ఉంటాము.

సాధారణముగా అవతలివాడి మెమొరీ కార్డ్ లో ఏమున్నాయో, తనవద్ద ఏమిలేవో చూసుకోవటానికి అలా చేస్తుంటారు. అవతలి వాడి కార్డులో ఏవైనా రహస్యమైనవి ఏమైనా ఉన్నాయో చూడటానికి అలా చేస్తుంటారు. ఎక్కువగా రఫ్ కారేక్టేర్స్ ఉన్న వారి మొబైల్ మెమొరీ కార్డులో బూతు కి సంబంధించినవి బాగా ఉంటాయి. అవి మామూలువే! కొంత ఎక్కువ చదువుకున్నవారి, సంఘములో హై ప్రొఫైల్ మెమొరీ కార్డ్ కి ఇలా చేస్తుంటారు.. కాలేజీ విద్యార్థులు వీరికో వరం. వారి దాంట్లోనే వీరికి బాగా దొరుకుతాయి. అలా చెయ్యటానికి ఆ విద్యార్థుల కార్డుని ఆక్సెస్ చేయాలి అంటే వీరి సిస్టం ఫుల్ సెక్యూర్ గా ఉంటే ఆ కార్డ్ ని ఆక్సెస్ చెయ్యదు. కారణం ఏమిటంటే వారి దాంట్లో వైరస్ ఉంటుంది కాబట్టి. అలా వారివి ఉంచుకొని, చూడాలి అంటే తప్పనిసరిగా అంటి వైరస్ ని ఐడిల్ లో ఉంచుతారు. అలా ఉంచితే ఆ కార్డు ని సిస్టమ్ ఆక్సెస్ చేస్తుంది.. అప్పుడు వీరి మెమొరీ కార్డు లోనివి వారి సిస్టం కి పంపించుకుంటారు. వీరు ఏమైనా డాటా వేయమంటే వేసినప్పుడు వేస్తారు.. అప్పుడే ఆ సిస్టం లోని వైరస్ ఈ మెమొరీ కార్డ్ లోకి వస్తుంది. ఇప్పుడు ఆ మెమొరీ కార్డ్ ని ఫోన్ లో పెట్టుకొని ఆ డాటా ని వాడుకుంటూ ఉంటారు.

ఇక్కడే ఇంకో తిరకాసు ఉంది. ఆ మెమొరీ కార్డ్ లోని డాటా వాడుతున్నప్పుడు ఆ మెమొరీ కార్డ్ లోని వైరస్ ఆ కార్డ్ అంతటా మెల్లగా వ్యాపిస్తూ ఉంటుంది. అంటే ఆ కార్డు లోని డాటా కి అంతా వ్యాపించేస్తుంది. ఈ కార్డు లోని డాటాని (వైరస్ ఉన్న ఒక్క డాటా గాని ) ఫోన్ మేమోరీలోకి మార్చితే గనుక ఇక ఆ వైరస్ ఫోన్ మేమోరీకీ కూడా పట్టేసుకుంటుంది. అంటే నెమ్మదిగా ఈ ఫోన్ అంతా కూడా వైరస్ తో నిండిపోతుంది అన్నమాట!.. అప్పుడు కొద్దిరోజుల తరవాత ఒక శుభ ముహూర్తాన మీ ఫోన్ పనిచెయ్యదు. స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఏమిటాని మీరు ఎన్నోసార్లు స్విచ్ ఆన్ చేసినా అది పనిచెయ్యదు. మెకానిక్ వద్దకి వెళితే - ఫోన్ మరియు మెమొరీ కార్డ్ లోని డాటా క్లీన్ కోసం చెరో యాభై అంటే వంద రూపాయలు తీసుకొని అంతా క్లీన్ చేసిస్తాడు. అంటే ఆంటివైరాస్ పెట్టి క్లీన్ చెయ్యడు.. కొన్ని కోడ్స్ వాడి క్లీన్ చేస్తాడు ( అవి ఏమిటో ఈ బ్లాగులోనేవ్రాశాను - చూడండి) దీనివలన మెమొరీ కార్డ్ లోని డాటా మొత్తమూ, ఫోన్ మెమొరీ లోని మొత్తం అన్నీ - ఆఖరికి ఫోన్ నంబర్స్ తో సహా అన్నీ పోతాయి. ఒకే ఒక్కమాటలో చెప్పాలీ అంటే మీరు ఆ ఫోన్ కొన్నపుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మళ్ళీ ఫోన్ నంబర్స్ అన్నీ ఎక్కించుకోవాలి.

ఇలాంటి మొబైల్ ఫోన్ లో నుండి ఏదైనా డాటాని - ఇన్ఫ్రా రెడ్ వల్లనే గానీ, బ్లూటూత్ వల్లనే గాని, సిస్టం వల్లనే గానీ (ఆంటీ వైరస్ పనిచేయని సిస్టమ్), మీ ఫోన్ లోకి డాటా ఎక్కించినా ఆ ముందున్న వైరస్ ఇందులోకి కూడా వస్తుంది.. ఈ ఫోన్ కూడా దానిలాగే కొద్దిరోజులకి మూగనోము పడుతుంది. ఇది ఎన్నిరొజులో అంటే - ఏమీ చెప్పలేము. మీ ఫోన్ సామర్థ్యం, మెమొరీ కార్డ్ లోనిఫోల్డర్స్, ఆ డాటాని వాడకం, అందులో ఉన్న వైరస్, ఆ వైరస్ టైప్ వల్ల ఏదీ ఇతిమిధ్యముగా చెప్పలేము. నా ఫోన్ ఒకటి క్రొత్తగా కొన్నాను.. దానికి ఆ షాప్ వాడు చేసిచ్చిన ఉచిత మెమొరీ కార్డ్ వల్ల - నాకు వంద రూపాయల చేతి చమురు వదిలింది. అప్పుడే ఈ విషయాలు అన్నీ తెలిశాయి. మీకూ ఇలా కావద్దని ముందు జాగ్రత్తగా హెచ్చరించడం.
Related Posts with Thumbnails