Sunday, November 28, 2010

Girls awaiting you..

చాలామంది తమ మెయిల్ బాక్స్ వచ్చిన మెయిల్స్ అన్నింటినీ ఓపెన్ చేస్తూ ఉంటారు.. తమకి వచ్చిన ప్రతి మెయిల్ లో ఏదో ఉందని అనుకుంటూ ఓపెన్ చేస్తారు.. (ఏమి ఉంటుందో మీకు చివరలో తెలుస్తుంది.) అందులో ఏమున్నదో తెలుసుకోవడం చాలా సాధారణ ఆసక్తే. కాని కొన్ని మెయిల్స్ మాత్రం అన్ని మెయిల్స్ లా ఉండవు. అవి సంథింగ్ డిఫరెంట్. వీటి గురించి చెప్పే ముందు, కొన్ని విషయాలు చెబుతాను.

నా బ్లాగ్ లోనే ఒకసారి చెప్పాను - మీకు మానవత్వం ఉంటే ఈ మెయిల్ ని..  అనే లింక్ పోస్ట్ కి వెళ్లి చదవండి. పనిలో పనిగా అలాగే కామెంట్స్ చూడండి. అలా వారు మన మెయిల్ ID పంపాక మన మెయిల్ బాక్స్ కి ఏదో ఒక మెయిల్ వస్తుంది. "..వీరి పరిస్థితి ఇలా ఉంది.. వీరికి ఇలా అయ్యింది.. అది బాగు కావాలంటే ఇంత డబ్బు కావాలి.. మీరు ఈ మెయిల్ ని మీ మిత్రులకి పంపితే చాలు.. గూగుల్ వాడు ఒక్కో మెయిల్ కి మాకు కొంత ఆర్ధిక సహాయం చేస్తాడు.. మీకు హృదయమే ఉన్న మనుష్యులు ఆయితే (?) మీరు మీ మెయిల్ లిస్టు లోని అందరికీ పంపండీ.." - అని అందులో ఉంటుంది. ఇలాని కాదు ఇలా సహాయం చెయ్యమనీ, చూడమనీ ఎన్నో రకాలు ఉంటాయి. 

అది నిజమే అని అమాయకముగా అందరికీ పంపిస్తుంటారు.. అలా నా మెయిల్ ID నీ, ఏదో పుణ్య కార్యక్రమం చేసినట్లు - అందరికీ పంపారు కూడా. ఇంకా పంపుతూనే ఉన్నారు కూడా.. ఏమి చేస్తాం.. చదువుకొని కూడా లోకజ్ఞానం అబ్బని అమాయకులు (మూర్ఖులు) - అని అనుకోవాలి వారిని. అలా చేసిన "విశాల హృదయ పుణ్య కార్యక్రమానికి" ఆహ్వానం అందుకొని, నాకు ఎన్నో మెయిల్స్ వచ్చాయి. ఆయా సైట్ల ఫిల్టర్స్ వల్ల అవి - స్పామ్ బాక్స్ లోకి వెళ్ళిపోయాయి. అందులో అన్నీ మనసుని ఊరించి ఓపెన్ చేయించే మెయిల్స్. క్రిందన ఉన్న ఈ మెయిల్ బాడీ చూడండి. అందులో ఒక సైట్ లింక్ తప్ప మరేం లేదు. ఇలాంటిదే ఒక మెయిల్ వస్తే - అప్పట్లో తెలీక ఓపెన్ చేశా.. బూతుబొమ్మల సైటు అది. ఆ సైట్ లోని మాల్వేర్స్ నా సిస్టం లో తిష్ట వేశాయి. ఫలితముగా నా సిస్టం చాలా స్లో గా నడవటం మొదలెట్టింది. అంటి వైరస్ అప్డేట్ చేసినా, టెంపరరీ ఫైల్స్ అన్నీ తీసేసినా, అనుమానిత ఫైల్స్ అన్నీ తీసేసినా, కూకీస్ అన్నీ తొలగించినా.. ఊహు.. లాభం లేదు. సిస్టం హాంగ్ అవటం మొదలెట్టింది. నా సిస్టం నుండి ఎంత డాటా హ్యాక్ అయ్యిందో? చివరికి సాఫ్ట్వేర్ అప్డేట్స్ వల్ల - చాలా రోజులకి సమస్య తీరింది. అన్ని రోజులూ నెట్  కి రావాలంటేనే  - విసుగు. ఏదైనా సైట్ ఓపెన్ అవ్వాలంటే - అది ఓపెన్ అయ్యేలోపు టీ ఈజీగా త్రాగేయవచ్చు. అంతగా స్లో అన్నమాట.. అలాగే ఈ క్రింది మెయిల్ కూడా అటువంటివే.. అందుకే కాస్త జాగ్రత్తగా ఉండండి.. 


అలాగే - మీకు "ఒకటి" పంపిస్తే కొరియర్ వాపస్ తిరిగి వచ్చింది. అందులో మీకు ఏమి పంపామో - అటాచ్మెంట్ ఫైల్ ఓపెన్ చేసి చూడండి - అని ఉంటుంది. అది డౌన్ లోడ్ చేసుకుంటే - ఇక నుండి సిస్టం లో శాశ్వతముగా తిష్ట వేసుకొనే మాల్వేర్స్ డౌన్ లోడ్ అవుతాయి. మొదట్లో నేనూ నమ్మలేదు. కాని పై అనుభవం వల్ల నమ్మాల్సి వచ్చింది. ఇప్పుడు మీరూ నమ్ముతారు. అది ఎలాగో ఈ క్రింది ఫోటో చూడండి. అలాగే ఈ మెయిల్ వస్తే కొద్ది రోజులాగి, ఓపెన్ చేశా. అంతలోగా అంటి వైరస్ సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ అవుతుందిగా. అలా ఆ మెయిల్ బండారం బయటపడింది. మీరూ చూడండి. సరిగా కనిపించకపోతే పెద్దగా చూడటానికి ఫోటో మీద డబల్ క్లిక్ చేసి చూడండి.


అందుకే తస్మాత్ జాగ్రత్త!!

ఈ చదువుకున్న మూర్ఖులు చేసిన పుణ్య కార్యక్రమం వల్ల ఇంకో అపకారం కూడా జరిగిపోతుంది.. అదేమిటంటే - అలా వారు ఆ సానుభూతి మెయిల్స్ మళ్ళీ పంపటం వల్ల మిత్రులకు ద్రోహం చేసినవారూ అవుతారు. దీన్ని రెండు రకాలుగా చెబుతాను.

మొదటి రకం :  ఇందులో - ఎవరో స్వార్థపరుడు ఒక మెయిల్ ID ని క్రొత్తగా సృష్టించుకొని, ఈ సింపతీ మెయిల్ ని తన మెయిల్ బాక్స్ లోని అందరికీ (మిత్రులకి) కూడా పంపిస్తాడు. వాళ్ళందరూ అందులో ఎమున్నదీ, నిజమేనా, ఆధారాలు ఉన్నాయా? అని ఏవీ ఆలోచించకుండా "విశాల దృక్పథా మనసుతో" తమ మంచి మనసుకి నిదర్శనం కి గుర్తుగా, అదో మహాద్భాగ్యం అన్న భావనతో అందరికీ ఆ మెయిల్ ని పంపిస్తారు. ఆ మెయిల్ ID లలో ఈ స్వార్థపరుడి మెయిల్ ID కూడా ఉంటుంది. - ఎలా అంటే వీడూ వారికి ఫ్రెండ్ / తెలిసిన వాడే అయి ఉంటాడు.  ఎవరైనా మిత్రులవి సోషల్ వర్కింగ్ సైట్లకి ఆడ్ రిక్వెస్ట్ పంపాలన్నా, ( ఆ మిత్రులు - వారికి ఆడ్ రిక్వెస్ట్  పంపాలంటే వారి మెయిల్ ID ఖచ్చితముగా తెలిసి ఉండేలా సెట్టింగ్స్ పెడుతూ ఉంటారు.) ఒక ఈ మెయిల్ ID ని, అక్కడ పోస్ట్ చేస్తూ పోతారు. అందులో ఉన్న అన్ని మెయిల్స్ ID ని అలా టెస్ట్ చేస్తుంటే ఏదో ఒకటి తగులుతుంది. ఇక వారికి కష్టాలు మొదలవుతాయి. దానికి కారణం, మూలమూ ఈ "విశాల మనసు గల మూర్ఖులే." వీరు చేసిన ఒక చిన్నపని ఎదుటివారిని ఎన్ని అవస్థలకు గురిచేస్తుందో. మన మిత్రులని మనమే ఇబ్బందులకి గురిచేసి, అవతలి వారికి లాభం చేస్తున్నామని వీరు అనుకోని మూర్ఖులు.

రెండో రకం : ఇలా మెయిల్ ID లు తెలిశాక - అప్పుడు ఆయా మెయిల్ ID ల ద్వారా వారి అక్కౌంట్స్ ఓపెన్ చెయ్యటానికి ప్రయత్నిస్తారు. పాస్ వర్డ్ చేధించటానికి ఆధునిక పాస్ వర్డ్ బ్రేకర్స్ ద్వారా ప్రయత్నిస్తారు. 
ఆరు అక్షరాల పాస్ వర్డ్ ని ఇప్పుడున్న ఆధునిక సాఫ్ట్ వేర్ లతో మూడు గంటల్లో, 
ఏడు అక్షరాల పాస్ వర్డ్ ని ఎనిమిది గంటల్లో, 
ఎనిమిది అక్షరాల పాస్ వర్డ్ ని మూడు రోజులల్లో "బ్రేక్" చేయవచ్చును. ఇది పాత పద్ధతి. 

ఇక క్రొత్త ఆధునిక పద్దతిలో ఆయితే - ఒక లింక్ పంపిస్తారు పైన ఉన్న ఫోటో లో లాగా. అది ఓపెన్ చేస్తే - ఒక ఫైల్ డౌన్ లోడ్ అయ్యి, అంటి వైరస్ ని ఆపేసి మన సిస్టం లో తిష్ట వేస్తుంది. మనం చేసే అన్నీ పాస్వర్డ్ లతో సహా "కీ లాగర్స్" లాగా పనిచేస్తుంది. ఏదైనా బ్యాంక్ అక్కౌంట్స్ ఓపెన్ చేసినప్పుడు అవతలివారికి ఆ సైటూ, పాస్ వర్డూ, లాగిన్ ID అన్నీ వారికి తెలిసిపోతుంది. ఇంకేం.. అంతా మామూలే. దర్జాగా దోచేసుకుంటారు. 

ఇప్పుడు చెప్పండి.. అలాంటి మెయిల్స్ మీకు వస్తే వాటిని - మీలో ఎవరైనా మీ మిత్రులకి మళ్ళీ పంపగలరా?

Friday, November 26, 2010

Orange - Sidnee nagaram

చిత్రం : ఆరెంజ్ (2010)
రచన : సురేంద్ర కృష్ణ, కేదారనాథ్ పరిమి
సంగీతం : హరీస్ జయరాజ్
గానం : కారుణ్య
అడిషనల్ వాయిస్ : రనినా రెడ్డి
************************

సాకీ :
ఊల ఊలల్లా అలా చూస్తేనే చాలా
ఇలా నా కళ్ళు నిన్నే చూస్తుండాలా
చాలా లవ్లీగా ఇలా రేపావు గోల
మదే సీ లోన సర్ఫింగ్ చేస్తుందిలా

పల్లవి :
సిడ్నీ నగరం చేసే నేరం - ఇన్నాళ్ళూ నిన్ను దాచుంటుంది.
సిగ్గే పడుతూ తప్పే తెలిసీ - ఈరోజైనా చూపించింది.
దిసీజ్ ద టైం టూ ఫాల్ ఇన్ లవ్
ఫాల్ ఇన్ లవ్ - ఓ మై లవ్
వెల్కం టూ మై హర్ట్ - ఐయాం ఇన్ లవ్
ఐయాం ఇన్ లవ్ - యు ఆర్ ఇన్ మై లవ్  // సిడ్నీ నగరం  //

చరణం 1: 
సాగర తీరాన ఉదయం లా - ఏదో తాజా ఉల్లాసమే
ఎంతో బాగుంది ఈ నిమిషం  - సునామీలా సంతోషమే
తెలుసుకున్నది కొంచమే - ఆ కొంచంలోనే ఎంతో నచ్చావే
కలుసుకోమని ఆత్రమే - ఓ లావా లాగా లోలో పొంగిందే
ఇవ్వాళే రాలే పాత బాదే - నిన్ను చూడ
నిన్నుచూడ - నిన్నుచూడ - నిన్నుచూడ

చరణం  2:
ఈ లేత అల్లర్లే లాగాయిలా - నీలా విడి పాదం ఆడిందిలా 
ఆ ఏడు రంగుల్ని మార్చానిలా - నాలో తాజా ప్రేమే ఆరెంజ్ లా
అప్పుడే పుట్టిన పాపలా - నువు కొంతకాలం విచ్చినావుగా
ఇప్పుడే వచ్చిన శ్వాసలో - నువు చల్లగాలి చల్లినావుగా
ఇవ్వాళే వాలే కొత్త మాయే - నిన్ను చూడ // ఊల //  // సిడ్నీ నగరం //

Rowdeelaku rowdeelu - Teesko kokokola

చిత్రం : రౌడీలకు రౌడీలు (1971)
రచన : ఆరుద్ర
సంగీతం : సత్యం
గానం : ఎల్లార్ ఈశ్వరి.
******************

పల్లవి :
తీస్కో కోకోకోలా - ఏస్కో రమ్ము సారా
చూస్తే మజా - గుటకేస్తే  నిషా
కలిపికొట్టు మొనగాడా // తీస్కో కోకోకోలా //

చరణం 1 :
మతి చెడితే.. హా.. మందుంది.
మనసైతే  - నేనున్నా
మతి చెడితే.. హా.. మందుంది.
మనసైతే - నేనున్నా
రెండూ కైపిస్తే - రేయి భలే హాయీ
హే.. మగాడా.. నువ్వు బిగించు నీ సగం
సగం తెగింపు లో సుఖం లేదురా. // తీస్కో కోకోకోలా //

చరణం 2 :
ఈ... ఊరించే ఒంపులు - ఉడుకేత్తే సొగసులు
ఊరించే హా... ఒంపులు ఉడుకేత్తే - హా... సొగసులు.
జతగా నేనుంటా - జలసా చేయిస్తా
కులాసా ఒక తమాషా
ఈ... ఒమర్ ఖయ్యామ్ సరాగమే పసందని రా... ఈ.. // తీస్కో కోకోకోలా //

Thursday, November 18, 2010

My Photography - Mallela thertham

ఇదే ఆ జలపాతం మడుగు.

జలపాతం.

నా మిత్రుడు. 

వచ్చిన పర్యాటకులు 

జలపాతం 

జలపాతం 

అక్కడ ఉన్న శివాలయం. 

జలపాతం 

వచ్చిన పర్యాటకులు. 

జలపాతం కి దారి. 

జలపాతం 

జలపాతం 

జలపాతం  ఉన్న లోయ. 


ఇక వీడియో చూడండి. ఇందులో అన్ని వివరాలూ ఉంటాయి. వీడియోగ్రఫీ కూడా నాదే..

Wednesday, November 17, 2010

DIGITAL CAMARAS టపాకి వచ్చిన కామెంట్స్

నా బ్లాగు లోని DIGITAL CAMARAS అనే టపాకి నిన్న మారిషస్ నుండి సృజన అనే అమ్మాయి కొన్ని కామెంట్స్ ని వ్రాశారు. అందులో వారు తీసుకున్న డిజిటల్ కెమరాకి - వాడకములో వచ్చిన సందేహాలను కామెంట్స్ రూపముగా నన్ను అడిగారు. నేనూ కొన్నింటికి సమాధానం ఇచ్చాను. నిజానికి నేనూ మామూలుగా ఇష్టపడి పిచ్చి, పిచ్చి ఫొటోస్ తీసిన వాడిని నేను. నాకంటూ ఒక ఫోటో స్టూడియో గానీ, స్టూడియో లో పనిచేసిన అనుభవం గానీ లేవు. ఫోటోగ్రాఫర్లతో కలసి పనిచేసిన సందర్భాలూ లేవు. అయినా తను నన్ను అడిగిన ప్రశ్నలకి, నా మిడి మిడి జ్ఞానం తో కొన్ని ప్రశ్నలకి సమాధానం ఇచ్చాను. ఇంకా కొన్ని ప్రశ్నలకి సమాధానం ఇస్తుండగా - నాకో ఐడియా వచ్చింది. వీటినే ఒక టపాగా వ్రాస్తే ఎలా ఉంటుందీ అని? అలా వ్రాయటం నూతన ప్రక్రియ అనీ, ఆ సమాధానాలూ ఒక టపాలాగా వ్రాస్తే ఎక్కువ మందికి ఉపయోగ పడుతుందనీ (నేనూ ఏమైనా నేర్చుకోవచ్చనీ) అనుకొని తను వ్రాసిన ప్రశ్నలను ఇక్కడ పేస్ట్ చేస్తూ, వాటికి సమాధానాలూ ఇక్కడే ఇస్తున్నాను. ఆ కామెంట్ల లో వ్రాస్తే ఎక్కువమందికి ఇవన్నీ ఉపయోగపడకపోవచ్చనీ, ఇక్కడ వ్రాస్తే ఇంకా వివరముగా చెప్పోచ్చనీ  చెబుతున్నాను.

ముందుగా ఆ సృజన గారికి ధన్యవాదములు. ఎందుకంటే తను తనకొచ్చిన సందేహాలను కామెంట్ల రూపముగా పెట్టడం, అనానిమస్ గా కామెంట్స్ వ్రాయక, తన పేరుతో నిర్భీతిగా అడగటం మూలాన - తనకు అన్నీ వివరముగా చెప్పాలనిపిస్తున్నది. ఆమె ప్రశ్నలకు ధన్యవాదాలు చెప్పుకుంటూనే, అలా ధైర్యముగా అడిగినందులకు ఆమెని అభినందిస్తున్నాను.. (అందరూ క్లాప్స్ కొట్టండీ!... క్లాప్స్..)

ప్రశ్న : sir..
memu oka 6mnths back digitalcam theesukunnamu..adi vadina konnirojulake..foto theesina ventane card error ani vasthundhi..format cheska kuuda same problem repeat avuthundhi..and mobile loni card theeis vesina same problem vasthundhi..deenigurinchi thelisthe dayachesi theliyacheyyandi..
Tuesday, November 16, 2010 2:47:00 PM
 
జవాబు : ముందుగా నా బ్లాగ్ చూసి, నన్ను ప్రశ్న అడుగుతున్నందులకు ధన్యవాదములు..


1. మీరు మీ మెమొరీ కార్డ్ ని ఒకసారి పరిశీలనగా చూడండి. ఆ కార్డ్ ప్రక్కన చిన్న నాబ్ ఉంటుంది. దాన్ని పొరబాటున లాక్ మోడ్ లో ఉంచి ఉండొచ్చు. దాన్ని సరిచెయ్యండి.

2. అప్పటికీ అది ఓకే అయి ఉంటే ఆ కార్డ్ ని ఇంకో కంప్యూటర్ కి అనుసంధానం చేసి, చెక్ చెయ్యండి. అందులో ఏమైనా పొరబాటులు ఏమైనా తేలవచ్చు.

3. మీరు అడాప్టర్ + మెమొరీ కార్డ్ వాడుతున్నట్లయితే దానికీ లాక్ ఉంటుంది. దాన్నీ సరి చెయ్యండి.

4. అడాప్టర్ లలో - చాలా అడాప్టర్ పిన్స్ సరిగా కనెక్ట్ అవవు. మార్కెట్లో దొరికే ఆడాప్టర్స్ దాదాపు అన్నీ వేస్ట్. నేను ఇంకో అడాప్టర్ కోసం కనీసం 20 కి పైగా చెక్ చేశాను. అన్నీ కనెక్టింగ్ ప్రాబ్లెమ్స్. అంటే మెమొరీ కార్డ్ ఎర్రర్ అని వస్తుంది.

5. ఆ మెమొరీ కార్డ్ లాక్ అవచ్చు. ఎలాగంటే - కార్డ్ నుండి సిస్టం కి ఫొటోస్ ఎక్కిస్తున్నప్పుడు కరెంట్ పోవటం వల్లనో, లేదా పద్ధతి ప్రకారం దాన్ని సిస్టం నుండి తొలగించటం లో జరిగిన పొరబాటు వల్లనో, డాటా ట్రాన్స్ఫర్ సమయములో కార్డ్ ని లాగేయటం వల్లనో... ఏదో జరిగి ఆ కార్డ్ పని చెయ్యకపోవచ్చు.అప్పుడు కార్డ్ ఒక్కోసారి లాక్ అవుతుంది. ఇంకో కార్డ్ తో ప్రయత్నించి చూడండి.

6. మెమొరీ కార్డ్ ని కెమరా స్లాట్ పెట్టే దగ్గర, మీరు కార్డ్ త్రిప్పి పెట్టినా - పని చేయ్యకపోవచ్చును.

7. మెమొరీ కార్డ్ పెట్టె స్లాట్ లో పిన్స్ కార్డ్ పెట్టేటప్పుడు సరిగా కనెక్టింగ్ కాకపోవచ్చును. అంటే కేమరాలోని పిన్స్ కాస్త లూజుగా ఉండొచ్చు.

8. కొని ఆరు నెలల అయ్యిందని అంటున్నారుగా.. వారంటీ ఉంటుంది. అది కొన్న షాపులో అడగండి. సర్వీస్ సెంటర్ కి పంపి బాగు చేసి ఇస్తారు.

ప్రశ్న : card error vachi previous foto delete ayipothundhi..ravatledhu..and meeku handy cams gurinchi kuuda thelisthe cheppandi..vati resolutions and edi baguntundho..
Tuesday, November 16, 2010 5:40:00 PM

జవాబు : సృజన గారూ మీ రెండో కామెంట్ కి సమాధానం : మీ మెమొరీ కార్డ్ సైజు ఎంతో (2GB యా 4GB) మీరు చెప్పలేదండీ.. బహుశా మీరు ఆ కేమరాతో వచ్చిన శాంపిల్ (32MB లాంటి సైజుది. అన్ని కెమరాలకీ వాటితో ఇలాంటి మెమొరీ కార్డ్ ని ఇస్తారు. బహుశా మీరు వాడుతున్నది ఇదే కావచ్చునేమో) మెమొరీ కార్డ్ వాడుతున్నారు అనుకుంటా.. అందులో కొన్ని ఫొటోస్ మాత్రమె పడుతాయి. అంటే నాలుగు నుండి ఆరు ఫొటోస్ వరకు. అది ఫోటో సైజుని, రిజల్యూషన్ ని బట్టి ఉంటుంది. అలా దానినే వాడినట్లయితే - కొన్ని ఫోటోస్ వచ్చాక కార్డ్ ఎర్రర్ అని వచ్చి, పాత ఫొటోస్ డిలీట్ అవుతుంటాయి. ముందుగా మీ కెమరా లో ఉన్నది ఇదేనా అన్నది పరిశీలించండి.

ఒకవేళ - మీ కెమరాలో ఉన్నది ఎక్కువ మెమొరీ కార్డ్ అంటే 4GB లాంటివి అయితే - నాకు సరిగ్గా కారణం తెలీదండీ.. అలా ఎందుకు అవుతుందో. ఒకసారి సర్వీస్ సెంటర్ వద్దకి తీసుకేళ్ళండీ..

హాండీ క్యాం ల గురించి నాకేం ఎక్కువగా తెలీదండీ!.. నేను తీసుకుందామని అనుకున్నాను. నాకు డిజిటల్ కేమరాలోని వీడియో సరిపోతున్నదని తీసుకోలేదండీ! మొదట్లో వీడియో ముక్కలు ముక్కలుగా తీయటం ఇష్టం లేక (చూడటానికి ముక్కలు ముక్కలుగా చూడటం ఇష్టం లేక), వీడియోలు తీయలేదండీ.. తరవాత విండోస్ మూవీ మేకర్ - సాఫ్ట్ వేర్ గురించి తెలిసి ఇప్పుడు వీడియోలు బాగా తీస్తున్నాను. ఆ సాఫ్ట్ వేర్ గురించి త్వరలోనే వీలు చూసుకొని ఈ బ్లాగులో టపా వ్రాస్తాను. ఇప్పుడు ఆ డిజిటల్ కెమరా సరిపోతున్నదని, హ్యాండీ క్యాం తీసుకోలేదండీ.. పెద్ద పెద్ద వీడియోలు తీయాలనుకున్నప్పుడు అప్పుడు మాత్రమే - ఇవి - హ్యాండీ క్యాం బాగా ఉపయోగపడతాయి.

అయినా తెలిసినవి చెబుతున్నాను. ఆ హాండీ క్యాం లలో ఇప్పుడు హార్డ్ డిస్క్ లతో వస్తున్నాయి. అందులో మార్కెట్లో సోనీ 40GB హార్డ్ డిస్క్ స్పేస్ ఉన్నది పదిహేను వేలకి వస్తున్నది. ఇండియా మార్కెట్లో 40GB, 80GB హార్డ్ డిస్క్ తో ఉన్నవి దొరుకుతున్నాయి. వాటిలో ఇందులో ఆప్టికల్ జూం 60x లేదా ఆ పైన ఉన్నవి తీసుకోవాలి. ఆప్టికల్ జూమ్ ఎక్కువగా ఉంటే - దూరం లోనివి, జూమ్ చేసి షూట్ చేసినప్పుడు క్లారిటీ బాగుంటుంది. అలాగే HD వీడియో (High Defination) క్లారిటీ ఆప్షన్ ఉంటే మనం వీడియో తీసింది చాలా క్లారిటీగా ఉంటుంది. ఆ వీడియో లోంచి ఫొటోస్ తీసుకున్నా స్పష్టముగానే ఉంటాయి. డిజిటల్ క్లారిటీ రెండువేలు (2000x) ఉన్నా అది ఎక్కువగా క్లారిటీ ఉండదు. ఆ డిజిటల్ తో తీసిన వీడియోని LCD, LED, HD టీవీల్లో వాటిల్లో చూసుకున్నప్పుడు ఆప్టికల్ అంత స్పష్టత రాదు. టచ్ స్క్రీన్ ప్యానల్ చాలా చాలా బెస్ట్.  అలాగే డాల్బీ 5.1 సరౌండ్ సిస్టం బెస్ట్.  ఈ హ్యాండీ క్యాం వల్ల ఇబ్బంది ఏమిటంటే - దాన్ని ఉపయోగించటం తెలిసిన వారు తక్కువ. సృజన గారూ.. దాన్ని మీరే వాడటం ఎలాగో నేర్చుకున్నారు అనుకోండి. దానితో తీసే వీడియోలలో మీరు మాత్రం కనపడరు. ఇది ప్రతి హ్యాండీ క్యాం ఓనర్ల బాధ అది. మీలాగా తీసేవారు మీకు తోడుగా ఎవరైనా ఉంటే - కొనుక్కోవటం బెస్ట్.  చిన్న చిన్న వీడియోలకి అంటే పదిహేను నిముషాల వీడియో కి డిజిటల్ కెమరా బెస్ట్ - అని నా అబిప్రాయం.

ప్రశ్న : sir, మీ బ్లాగ్ ఈరోజే చూసాను..చాలా మంచి విషయాలు రాస్తున్నారు...ఆల్బం లొ పెట్టిన ఫొటొస్ కొన్ని ఇయర్స్ తర్వాత పాడవుతాయి కదా .. అంటే album లో పెట్టిన ఫొటొస్ కి ఆ గమ్ అంటుకొని వాటి కలర్ యెల్లొ గ అవుతున్నయి..అలా పాడయిన వాటిని మల్లి బాగు చెయ్యడానికి ఎమైనా చిట్కా తెలిస్తె చెప్పండి.
Tuesday, November 16, 2010 5:54:00 PM
 
జవాబు : నా బ్లాగ్ చూసినందులకి ధన్యవాదములు. ఇలాగే మళ్ళీ మళ్ళీ నా బ్లాగ్ చూడాలని కోరుకుంటున్నాను.
ఆల్బంలో ఫొటోస్ పెట్టకూడదు అండీ.. ముఖ్యముగా ప్లాస్టిక్ సంబంధ ఆల్బమ్స్ లలో అసలు ఫొటోస్ ని పెట్టకూడదు. ఈ విషయం చాలా మందికి తెలీదు. నా ఫొటోస్ కూడా చాలా పాడయ్యాయి. ఇలాంటి ప్లాస్టిక్ కవర్స్ ఉన్నవి వాడేటట్లయితే - వాటిల్లో జిగురు ఉండకూడదు. ఫొటోస్ పెట్టే ముందు హ్యాండ్ టిస్యూ పేపర్లతో ప్రతి కవరునీ పైనా, లోపలా తుడిచి, ఆ ఫోటోతో బాటూ కాస్త ఆ పేపరూ ఆ ఫోటో వెనకాల పెట్టి ఉంచాలి. అలా అయితే వాటికి తేమ తగిలే అవకాశాలు తక్కువ. ఇంత ఓపిక మనకేక్కడివీ.. నిజానికి ఫోటో ప్రింట్స్ కి కాస్త పొడి వాతావరణం ఉండాలి. ఆల్బమ్స్ లలో ఫొటోస్ కి అతికేందుకై ఉండే జిగురూ, దాని ఘాడమైన వాసన వల్ల ఫొటోస్ చాలా తొందరగా పాడవుతాయి. అయినా చాలా మంది ఆల్బమ్స్ ఎక్కడో మూలన పెట్టి, ఆ ఆల్బమ్స్ మీద ఎన్నో బరువు వస్తువులని పెడతారు. ఫలితముగా గాలి ఆడక ఫొటోస్ పాడవుతాయి. అలా గాకుండా నిలువుగా ఆ ఆల్బమ్స్ ని పెడితే పాడయ్యే అవకాశాలు కాస్త తగ్గుతాయి. అందుకే ఆ ఆల్బం లలో ఉంటే వెంటనే తీసేసి గాలికి ఆరపెట్టండి.

మీ ఆల్బమ్స్ పసుపు వర్ణములోకి మారాయిగా. వాటిని ఏమీ చేయ్యరాదండీ.. వాటిని బ్లాక్ అండ్ వైట్ లోనికి మార్చి రంగులు వెయ్యాలి. అదంతా చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఆ పసుపు వర్ణములోకి మారిన ఫొటోస్ నెగటివ్ లు ఎక్కడున్నాయో తెలుసుకొని మళ్ళీ ప్రింట్స్ తీయించండీ.. స్టూడియో ఆయితే తేదీ చెప్పండి. మళ్ళీ ప్రింట్స్ వేసిస్తాడు. పనిలో పనిగా ఫొటోస్ నేగెటివ్స్ గానీ, స్టూడియో వద్ద మీ ఫోటోస్ తాలూకు నేగెటివ్స్ ఉంటే - వాటిని డిజిటల్ రూపములోకి మార్చి CD లోనికి బర్న్ చేయించుకోండి. నేనూ చాలా రోజుల క్రిందట ఇలాగే దాదాపు ముప్ఫై రీళ్ల నేగెటివ్స్ ని డిజిటల్ చేయించాను. వాటి గురించిన కథా కమామీషు ని కూడా ఇందులోనే - అంటే ఈ బ్లాగ్ లోనే పోస్ట్ చేశాను - చూడండి. ముందుగా ఆ ఆల్బం నుండి ఆ ఫొటోస్ తీసెయ్యండి. అలాగే వాటిని స్కాన్ చేయించి ఒక CD లోకి కాపీ చెయ్యండి. కనీసం ఆ ఫేడ్ అయినట్లున్న ఫొటోస్ అయినా మిగులుతాయి. లేకుంటే ఇంకా పాలిపోయి.. చూడటానికి ఇంకేం కనిపించవు.

ప్రశ్న : thanq sir..memu mauritius lo untunnamu..aa cam ni memu dubai airport lo konnamu..olumpus 14megapixel...konni fotos theesaka madyalo carderror vasthaundhi..adi vachinappudu previous ga theesina foto ravatledhu..
Tuesday, November 16, 2010 6:01:00 PM

జవాబు : మీరు ఒక విషయం బాగా గుర్తు పెట్టుకోవాలి. కాస్త విలువైనవి మనకు దగ్గరలోని సిటీ లోనే కొనాలి. మీరు మారిషస్ లో ఉంటూ దుబాయి లో కొంటే - అక్కడ ఏమైనా మోసం జరిగినా దుబాయికి వెళ్లి షాప్ అతన్ని అడగలేరుగా.. ఒకవేళ అడిగినా మీదే పొరబాటు అనొచ్చు. ఈ పని కోసం అక్కడికి వెళ్లి వచ్చే ఖర్చుల్లో - ఇంకో రెండు, మూడు కొని వారికీ వీరికీ ఇస్తే, మనల్ని గుర్తుపెట్టుకుంటారు. అదే దగ్గర సిటీ లో కొంటే ఏమైనా అడగొచ్చు. ఫోరం లోకి వెళ్ళొచ్చు. ఇప్పటికైనా మీకు ఆ ఒల్యంపస్ వారి వెబ్ సైట్ కి వెళ్లి మీకు అందుబాటులోని సర్వీస్ సెంటర్లని వెదకండి. ఆ అడ్రస్ తెలుసుకొని వారికీ కాల్ చేసి, వారి వద్దకి తీసుకెళ్ళండి. లేదా వారి ఈ http://www.olympus-imaging.co.in/cs/servicecentre/ లోకి వెళ్లి, మీకు అందుబాటులో ఉన్న అడ్రెస్ కి కాల్ చేసి తీసుకువెళ్ళండి. మీకు కొచ్చిన్, లేదా ముంబాయి దగ్గరగా ఉండొచ్చు.

మీ ప్రశ్నలన్నిటికీ జవాబు ఇచ్చాను అని  అనుకుంటున్నాను. మీరు సమాధానం పడినారు అని నేను అనుకుంటున్నాను. నేను మీకు ఇదంతా చెప్పాల్సిన అవసరం లేకున్నా - మీ అవసరం, నా బ్లాగ్ పోస్ట్ కోసం, ఏదో నాకు తెలిసినది నలుగురికీ చెప్పాలీ అని తాపత్రయం వల్లనో ఇదంతా చెప్పాను.

Tuesday, November 16, 2010

ఈ స్క్రాప్ ని పదిమందికీ పంపండీ..

చాలా రోజుల క్రిందట జరిగిన విషయం ఇదీ!.. ఒకసారి ఒక సోషల్ సైట్ మిత్రుడు నాకు ఒక స్క్రాప్ పంపాడు. అందులో - సాయి దేవుడి గురించి కొంత ఉపోద్ఘాతం ఉండి, చివరగా - ఈ స్క్రాప్ ని పదిమందికి పంపండీ, మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి.. అన్నాడు. నాకెందుకో అతని మాటలు రుచించలేదు. నిజానికి ఉన్న కాస్తంతలో నేనో మంచి భక్తుడినే.. కాని ఇలా దేవుళ్ళ మీది అభిప్రాయాలని రుద్దటం నాకెందుకో నచ్చలేదు. అలానీ ఊరుకో బుద్ధీ కాలేదు. ఏమి చెయ్యాలో ఆలోచించాను. కాసేపట్లో ఒక ఐడియా వచ్చింది. 'వాటన్ ఐడియా సర్జీ!' అని అనుకున్నాను.

వెంటనే అతనికి స్క్రాప్ పెట్టాను.. "అన్నయ్యా!.. మీ స్క్రాప్ చూశాక - నాకు చాలా సంతోషం వేసింది. పంపినందులకు చాలా కృతజ్ఞతలు.. నేనూ సాయి భక్తుడినే!. కాని - ఇది నిజమా అని కాస్త అనుమానముగా ఉంది. మీరు మరేమీ అనుకోకండీ.. నేను దీన్ని పదిమందికీ పంపించలేను.. ఏమీ అనుకోవద్దు. ఎందుకంటే - వారిని దైవ సంబంధమైన మొహమాట చర్యలతో, ఇబ్బంది పెట్టలేను. అలా స్క్రాప్స్ ని పంపించి, నానుండి వారిని దూరం చేసుకోలేను. మీరు ఏమీ అనుకోకపోతే - ఆ పదీ స్క్రాప్స్ మీకే పంపిస్తాను. దయుంచి స్వీకరించండీ.. ధన్యవాదములు.." అని నమస్కార బాణం లాగా ఒక స్క్రాప్ పంపాను.

ఆ తరవాత అతను పంపించిన స్క్రాప్ ని కాపీ చేశాను. అతని స్క్రాప్ బుక్ లో స్క్రాపులు గా పేస్ట్ చేశాను.. అలా ఒకదాని తరవాత ఒకటీ.. మొత్తం పది స్క్రాప్స్ పంపాను. ఆ పేజీలోని స్క్రాప్స్ అన్నీ ఇవే!.. ఆతర్వాత నా మనసుకి చాలా ఊరట కలిగింది. హమ్మయ్య..! ఈరోజు ఒక అనుకోకుండా దేవుడికి మ్రొక్కు / ఋణం (?) తీర్చుకున్నాను - అనీ. దేవుడే అలా నాకు స్క్రాప్స్ పంపమని ఆలోచనని ఇచ్చాడా!.. అని అప్పుడప్పుడూ అనిపిస్తూ ఉంటుంది.

ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చును. స్క్రాప్ ని కాపీ చేసి, ఒకసారి అంటే పంపిస్తారు, రెండోసారి పంపిస్తే స్పామ్ క్రిందకి వచ్చి పోస్ట్ కాదుగా.. అలా పదీ ఎలా పంపారూ - అని మీలో సందేహం ఉండొచ్చు. దానికి సమాధానం చాలా సింపుల్. అలాంటి ఇబ్బంది రాకుండా - ఆ స్క్రాప్ లో (క్షమించాలి.. చెప్పలేను.. చెప్పాక అందరూ ఇబ్బంది పడటం మొదలవుతుంది.) అంతే!..

అతను ఎలా రిసీవ్ చేసుకున్నాడా అని మీకు సందేహమా..! ఎలా అయినా తీసుకోనీ - అనుకుని ముందే నిర్ణయించుకున్నాను. ఒక్కడి వల్ల పదిమందినీ వదులుకోలేను. పదిమంది కోసం ఒక్కడిని వదులుకోవడం తెలివైన నిర్ణయం కదూ.. ఆ తరవాత మా ఇద్దరి మధ్య స్క్రాప్స్ తగ్గాయి. ఒక సుముహూర్తాన - నా ఫాన్స్ లిస్టు నుండి వెళ్ళిపోయాడు. అయినా నాకేం బాధ లేదు. వెళ్ళేవారు వెళుతూనే ఉంటారు.... వచ్చేవారు వస్తూనే ఉంటారు.. అని నేననుకుంటాను. మీరేమంటారూ?.

Monday, November 15, 2010

Orange - Nenu neevantoo..

చిత్రం : రెంజ్ (2010) 
సంగీతం : హరీస్ జయరాజ్. 
పాడినవారు : నరేష్ అయ్యర్.
రచన : వనమాలీ.
********************
పల్లవి :
నేను నువ్వంటు వేరై ఉన్నా
నా కీ వేళ నీలో నేనున్నట్టుగా
అనిపిస్తూ ఉందే - వింతగా
నా కోసం నేనే వెతికేంతగా - ఓ గర్ల్  
నువ్వే లేకుంటే ( లిజన్ గర్ల్ )
ఏమవుతానో నీ స్నేహాన్ని కావాలంటున్నానుగా
కాదంటే నా మీదొట్టుగా
ఏమైనా చేస్తా - నమ్మేట్టుగా
ఒకసారి చూసి నే వలచానా
నను వీడిపోదు ఏ మగువైనా
ప్రేమిస్తానే ఎంతో గాఢంగా
నా ప్రేమ లోతులో మునిగాక
నువ్వు పైకి తేలవే - సులభంగా
ప్రాణాలైనా ఇస్తావేకంగా ఓ.. ఓ.. ఓ..

నేను నువ్వంటు వేరై ఉన్నా
నా కీ వేళ నీలో నేనున్నట్టుగా
అనిపిస్తూ ఉందే - వింతగా
నా కోసం నేనే వెతికేంతగా ఓ


చరణం 1 : 
నిజాయితి ఉన్నోడిని నిజాలనే అన్నోడినీ
అబద్ధమే రుచించని అబ్బాయినీ
ఒకే ఒక మంచోడినీ
రోమాన్స్ లో పిచ్చోడినీ
పర్లేదులే ఒప్పేసుకో - సరే అనీ

ముసుకేసుకోదు ఏ నాడు నా మనసే ఓ భామ
నను నన్ను గానే చూపిస్తే కాదన్నా పోరాడేదే నా ప్రేమ ఓ.. ఓ..
నేను నువ్వంటు వేరై ఉన్నా
నా కీ వేళ నీలో నేనున్నట్టుగా
అనిపిస్తూ ఉందే - వింతగా
నా కోసం నేనే వెతికేంతగా ఓ


చరణం 2 :
తిలోత్తమా తిలోత్తమా - ప్రతిక్షణం విరోదమా
ఇవ్వాళ నా ప్రపంచమే నువ్వే సుమా
ఓ గ్రహాలకే వలేసినా - దివే అలా దిగొచ్చినా
ఇలాంటి ఓ మగాడినే చూడలేవమ్మా
ఒకనాటి తాజ్ మహలైనా - నా ముందు పూరిల్లే
ఇకపైన గొప్ప ప్రేమికుడే
లోకంలో నిలిచే పేరే నాదేలే ఓ.. ఓ..

నేను నువ్వంటు వేరై ఉన్నా
నా కీ వేళ నీలో నేనున్నట్టుగా
అనిపిస్తూ ఉందే - వింతగా
నా కోసం నేనే వెతికేంతగా ఓ


నువ్వే లేకుంటే 
ఏమవుతానో నీ స్నేహాన్ని కావాలంటున్నానుగా
కాదంటే నా మీదొట్టుగా
ఏమైనా చేస్తా - నమ్మేట్టుగా
ఒకసారి చూసి నే వలచానా
నను వీడిపోదు ఏ మగువైనా
ప్రేమిస్తానే ఎంతో గాఢంగా
నా ప్రేమ లోతులో మునిగాక
నువ్వు పైకి తేలవే - సులభంగా
ప్రాణాలైనా ఇస్తావేకంగా ఓ.. ఓ.. ఓ..
Related Posts with Thumbnails