Tuesday, June 29, 2010

Guppedu manasu - Mouname nee bhasha

చిత్రం పేరు : గుప్పెడు మనసు (1979)
గాయకుడు : M బాలమురళీకృష్ణ 
సంగీతం : MS విశ్వనాథన్ 
గేయరచన : ఆత్రేయ
సంవత్సరం : 1979
డైరెక్టర్ : K బాలచందర్ 
నటీనటులు : నారాయణ రావు, శరత్ బాబు, సరిత, సుజాత  
**************
పల్లవి :
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
తలపులు ఎన్నెన్నో కలలుగ కంటావు
కల్లలు కాగానే కన్నీరవుతావు. || మౌనమే నీ భాష ||
 
చరణం 1:
చీకటి గుహ నీవు - చింతల చెలి నీవు
నాటకరంగానివే... మనసా
తెగిన పతంగానివే
ఎందుకు వలచేవో - ఎందుకు వగచేవో
ఎందుకు రగిలేవో - ఏమి మిగిలేవో
ఎందుకు వలచేవో - ఎందుకు వగచేవో
ఎందుకు రగిలేవో - ఏమి మిగిలేవో   || మౌనమే నీ భాష ||

చరణం  2:
కోర్కెల సెల నీవు - కూరిమి వల నీవు
ఊహల ఉయ్యాలవే... మనసా
మాయల దయ్యానివే
లేనిది కోరేవు - ఉన్నది వదిలేవు
ఒక పొరపాటుకు - యుగములు పొగిలేవు
లేనిది కోరేవు - ఉన్నది వదిలేవు
ఒక పొరపాటుకు - యుగములు పొగిలేవు || మౌనమే నీ భాష ||

Monday, June 28, 2010

పాత ఎడిటర్ - క్రొత్త ఎడిటర్

బ్లాగులో వీడియోలు పెట్టాను..  ఇలా పెట్టడానికి నేను పాత ఎడిటర్ కి వెళ్లి అందులో వీడియో పోస్ట్ చేసేవాడిని. అలా కొన్ని వీడియోలు పెట్టాను. ఇలా వీడియోల కోసం పాత ఎడిటర్ కీ, క్రొత్త ఎడిటర్ కీ తిరగలేక ఆపాత ఎడిటర్ లోనికి వెళ్ళటం మానేసాను. అలా ఆగిపోయిందే నయం అయింది.. అసలు ఈ గూగుల్ వాడిదే కొంత పొరబాటు.

ఎలా అంటే.. అలా పాత ఎడిటర్ లోకి వెళ్లి నా వీడియోని పోస్ట్ చేసి, మళ్ళీ నా క్రొత్త ఎడిటర్ లోకి రావటం వలన (ఇలా ఎందుకు రావటం అంటే ఈ క్రొత్త ఎడిటర్ లో వీడియో అప్లోడ్ ఉపకరణం లేదు. ఈ వీడియో పోస్టింగ్ కోసమా పాత ఎడిటర్ కి వెళ్ళక తప్పదు. ) నా బ్లాగు పాత పోస్టులన్నీ - వేరు వేరు పారాగ్రాఫుల్లాగా కాకుండా, అంతా ఒకే పారాగ్రాఫుల్లా మారిపోయింది. మొన్న ఒక పాట లిరిక్ కోసమని నా బ్లాగులో వెదుకుతుంటుంటే అప్పుడు గమనించాను. నా పాత టపాలన్నీ అలా మారాయని.

ఖర్మరా బాబూ అనుకుంటూ.. ఇప్పుడు ఆ పాత టపాన్నింటినీ చూస్తూ, ప్యారాగ్రాఫుల్లోకి మారుస్తూ, రోజుకిన్ని టపాలు అన్నట్లుగా మార్చాల్సి వస్తున్నది. ఈ గూగుల్ వాడు కొత్త ఎడిటర్ లో కూడా వీడియో ఆప్షన్ ఇస్తే ఎంతో బాగుందేడిది. నాకూ ఈ తలనొప్పి పోయేది. మీలో ఎవరైనా పాత ఎడిటర్ ని వాడి, క్రొత్త ఎడిటర్ లోనికి మారుతున్నట్లయితే - కాసింత జాగ్రత్తగా ఉండండి.

Sunday, June 27, 2010

Time - Screen saver

మీకు ఈ రోజు ఒక అందమైన స్క్రీన్ సేవర్ ని పరిచయం చేస్తాను.. ఈ పాటికే మీరు మీ కంపూటర్స్ కి ఎంతో అందమైన స్క్రీన్ సేవర్స్ ఉండి ఉండవచ్చు. ఇప్పుడు నేను పరిచయం చేసే స్క్రీన్ సేవర్ ని ఇది మీ ఆఫీస్, ఇంట్లోని సిస్టం కి పెట్టుకోండి. అందానికి అందం, మరియు ఉపయోగకరముగా ఉంటుంది కూడా.. పెట్టుకున్నకా మీకు నచ్చిందీ, నచ్చలేనిదీ చెప్పటం మరచిపోకండీ! ఓకే.. ఇంకేం! ఇక్కడ చెప్పినట్లుగా పద్ధతులని ఫాలో అయిపోండి.

ముందుగా మీరు మానిటర్ మీద ఉన్న అన్ని అప్లికేషన్లని క్లోజ్ చెయ్యండి. అలాగే ఈ బ్లాగు పేజిని మినిమైజ్ చెయ్యండి. మానిటర్ లో సగం వరకు వచ్చేలా మినిమైజ్ చెయ్యండి. ఇలా చేస్తే ఇదంతా చదువుకుంటూ - మిగతా సగములో అలా చేసుకోవచ్చు. తేలికగా ఉంటుంది. అలా చేశాక మోనిటర్ మీద కర్సర్ ఉంచి రైట్ క్లిక్ చెయ్యండి. ఇదిగో అప్పుడు ఇలా వస్తుంది.


1. వద్ద ఉన్న Properties ని ఎంచుకోండి. దాన్ని క్లిక్ చెయ్యండి. చేశారా.. అప్పుడు క్రింది ఫోటో మాదిరిగా వస్తుంది.


 ఇప్పుడు 2 వద్ద చూపిన Screen saver ని నొక్కండి. అప్పుడు ఈ ఈ ఫోటో మాదిరిగా మెనూ వస్తుంది. ఇప్పుడు మీరు 3వద్ద చూపిన బార్ ని ఓపెన్ చెయ్యండి.



ఓపెన్ చేశారా? అప్పుడు మీకు ఈ క్రింది ఫోటోలో చూపిన విధముగా వస్తుంది. అందులో 3 వద్ద మీరు 3D Text ని ఎంచుకోండి. అక్కడ 4 వద్ద 3D Text సెలెక్ట్ చేశారుగా.. ఇప్పుడు మీరు 5 వద్ద ఉన్న Wait ప్రక్కన ఉన్న బాణం గుర్తులని వాడి రెండు నిముషాలు ఉండేట్లు సెట్ చేయండి. ఇక ఇప్పుడు 6 వద్ద నున్న settings ని నొక్కండి. నొక్కారా!..



అప్పుడు ఇలా ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇందులో 7 వద్ద ఉన్న Choose font ని నొక్కండి. అలాగే Choose font మీద ఉన్న Text లో Time ని ఎన్నుకోండి. ఇదే ముఖ్యమైనది. 



ఆ తరవాత వచ్చిన ఈ క్రింది విండోలో 
8 వద్ద Palatino Linotype ని,
 9 వద్ద Bold ని,
 ఎన్నుకొని ఆ తరవాత 10 వద్ద నున్న OK నొక్కండి.


ఇప్పుడు వచ్చిన బాక్స్ లో 11 రొటేషన్ టైప్ వద్ద None,
12 సర్ఫేస్ స్టైల్ వద్ద Reflection,
 13 రిజల్యూషన్ వద్ద Low,
14 సైజ్ వద్ద Large అనీ,
15 వద్ద Rotation Speed ని Slow అని ఎంచుకొని,
16 వద్ద OK ని నొక్కండి. 


హమ్మయ్య!.. ఇప్పుడు మీరు సెట్టింగ్స్ అంతా మార్చారు. ఇప్పుడు మీ సిస్టాన్ని రెండు నిముషాలు అలాగే వదిలేసి, అలా వెళ్లి వచ్చి చూడండి.  అప్పుడు మీ మానిటర్ ఇలా కనపడుతుంది. చాలా బాగుంది కదూ.. ఇప్పుడు మీ మానిటర్ ని చూసి అందరూ మెచ్చుకుంటారు. మాకూ చేసివ్వమని అడుగుతారు చూడండి. 


ఒక గమనిక: మీ మదర్ బోర్డులో బ్యాటరీ ఉండి, సిస్టం ట్రే లో గడియారం నడుస్తూ ఉంటే.. ఇది పనిచేస్తుంది.

Saturday, June 26, 2010

పెరిగిన పెట్రోల్ రేట్లూ - ఆదా?

పెట్రోల్ ధర పెంచేశారు.. అని చాలామంది పెట్రోల్ బ్యాంకుల వద్ద క్యూలు కట్టారు.. నేనూ అందరిలాగా ఎందుకో క్యూలో ఉండబుద్ధి కాలేదు. ఎందుకో వైరాగ్యం వచ్చేసింది. అసలు ఎందుకు నిలబడాలి అనే ఆలోచించాను. ( నెలకు సరిపడా పెట్రోల్ ని ఒకటేసారి పోయిస్తాను. అలా ఇప్పటికీ కొనసాగిస్తున్నాను. ) ఎందుకో క్యూలో నిలబడి మనవంతు రాగానే పోయించుకొని, అదేదో సాధించాం అని తృప్తి పొంది బయట పడటం ఏమిటో నాకు మాత్రం అర్థం కాదు.

పైసా కి ఒక సెకండ్ అని ఒక మొబైల్ సంస్థ అన్నప్పుడు జనం వేలంవెర్రిగా ఎగరపడ్డారు. ఎవరినడిగినా అదే పేరు. ఇంతటి పేరు - ఇంకో సంస్థ లాండ్ ఫోన్ కి రాలేదు. ఈ లాండ్ ఫోన్ లో నెలకి తొంభై ఐదు రూపాయల బాలన్సు వేసుకుంటే ఆ సంస్థ లాండ్, విల్, మొబైల్ ఫోన్ లకి ఒక నెల పాటు రాష్ట్రమంతటా అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. ఎంత బాగుంది కదూ.. మొబైల్ ఫోన్ లాగా రేడియేషనూ ఉండదూ, అలాగే చెవి దగ్గర వేడి కాదు. ఇంకో ప్రముఖ మొబైల్ సంస్థ రాత్రిపూట పదకొండు నుండి తెల్లారి ఏడు గంటల వరకూ ఒక్క రూపాయికి ఇరవై నిమిషాలు మాట్లాడుకోవచ్చు. ఇలాంటిసౌకర్యాలు ఆలోచించరు జనాలు. ఇక్కడా అంతే! లీటరుకు మూడు రూపాయలు పెరుగుతున్నదంటే అప్పటికప్పుడే వెళ్లి క్యూలో నిలబడి బండి ఆన్ లోనే ఉంచి, రెండు, మూడు లీటర్లు మాత్రమే పోయించుకొని వెళతారు.

ఒకవేళ ఐదు లీటర్లు పోయించుకేల్లినా లీటరుకి మూడు రూపాయల చొప్పున పదిహేను రూపాయలు మిగులుతాయి. ఆ పదిహేను రూపాయల కోసం బండి ఆన్ లో ఉంచి, క్యూలో నిలబడి, మరీ పెట్రోల్ పోయించుకుంటే ఏమైనా ఆదా ఉంటుందా.. మన వంతు వచ్చేసరికి యే పావుగంటో, అరగంటో పడుతుంది. అప్పటిదాకా సమయం, ఆ బండి ఐడిలింగ్ లో ఉన్నప్పుడు కాలిన పెట్రోల్.. లేక్కలేస్తే మిగిలేది ఏముంటుంది. మా దగ్గర - ఇలా పెట్రోల్ రెట్లు పెరిగినప్పుడు బండ్లో పెట్రోల్ పోయించుకోవటానికి వచ్చినవారు ఒక విషయం గుర్తు చేసుకుంటారు..

అదేమిటంటే - ఒక న్యాయవాది ఇలా రేట్లు పెరిగినప్పుడల్లా నాలుగైదు కిలోమీటర్ల దూరము నుండి స్కూటర్ మీద వచ్చి పెట్రోల్ పోయిన్చుకుంటాడు. అంత దూరమూ, క్యూలో వాడిన పెట్రోల్, మళ్ళీ ఇంటికి వెళ్ళటానికి అయ్యేఖర్చూ చూస్తే పావు లీటర్ పెట్రోల్ ఫట్! అంటే పదిహేను రూపాయలు అన్నమాట. పది లీటర్లు పెట్రోల్ పోయించుకుంటే మిగిలేది మహా అంటే ముప్ఫై రూపాయలు. అందులో ఖర్చు పదిహేను పోగా మిగిలేది ఇంకో పదిహేను రూపాయలు. ఈ మాత్రం దానికి ఇంత సీను అవసరమా...

Thursday, June 24, 2010

Nenu puttaanu ee lokam - Premnagar

చిత్రం : ప్రేమనగర్ (1971)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : కె.వి. మహదేవన్
గానం : ఘంటసాల
*********************
పల్లవి:
నేను పుట్టాను లోకం మెచ్చింది
నేను ఏడ్చాను లోకం నవ్వింది
నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది
నాకింకా లోకంతో పని ఏముంది - డోన్ట్ కేర్..
నేను పుట్టాను లోకం మెచ్చింది
నేను ఏడ్చాను లోకం నవ్వింది
నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది
నాకింకా లోకంతో పని ఏముంది - డోన్ట్ కేర్..

చరణం 1 :
నేనుతాగితే కొందరి కలలు గిరగిర తిరిగాయి
నేను పాడితే అందరి నోళ్ళు వంతలు పాడాయి
నేనుతాగితే కొందరి కలలు గిరగిర తిరిగాయి
నేను పాడితే అందరి నోళ్ళు వంతలు పాడాయి
నేను ఆడితే అందరి కాళ్ళు నాతో కలిసాయి
నేను ఆడితే అందరి కాళ్ళు నాతో కలిసాయి
తెల్లవారితే వెనకన చేరి నవ్వుకుంటాయి
హా.. డోన్ట్ కేర్.. || నేను పుట్టాను ||

చరణం 2 :
మనసులు దాచేతందుకే పై పై నవ్వులు ఉన్నాయి.
మనిషిక్ లేని అందం కోసమే రంగులు ఉన్నాయి
ఎరగక నమ్మిన వారి నెత్తికే చేతులు వస్తాయి
ఎరగక నమ్మిన వారి నెత్తికే చేతులు వస్తాయి
ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి
డోన్ట్ కేర్.. || నేను పుట్టాను ||

చరణం 3 :
మనిషిని మనిషిని కలిపేటందుకే పెదవులు ఉన్నాయి
పెదవులు మధురం చేసేటందుకే మధువులు ఉన్నాయి
బాధలన్నీ బాటిల్లో నేడే దింపేసేయ్
బాధలన్నీ బాటిల్లో నేడే దింపేసేయ్
అగ్గిపుల్ల గీసేసేయ్ నీలో సైతాన్ తరిమేసేయ్
డ్రైవ్ ది డెవిల్ ఆవుట్.. ఆ.. హ హ్హ హ్హా || నేను పుట్టాను ||

Saturday, June 19, 2010

వాతావరణ కార్యక్రమం

It is JUST FOR FUNNY.. Don't be take serious..

యూరప్, అమెరికా దేశాలలో అంతగా వర్షాలు పడతాయి.. కాని ఈ సౌదీ అరేబియా ప్రాంతములో వర్షాలు ఎందుకు పడటం లేదో కారణం తెలుసా.. భూమధ్య రేఖా, ఎడారి, పొడిగాలులూ అంటూ ఏవో సైన్సు పేర్లు చెప్పకండి.. అవి అందరికీ తెలుసు. ఈ క్రింది టీవీ వాతావరణ కార్యక్రమాలని చూస్తుండండి. మీకే సమాధానం దొరుకుతుంది. - అని ఒక ఔత్సాహికుడు చెప్పాడు..












Friday, June 18, 2010

New Theme

మీరు సిస్టం మానిటర్ మీద ఎన్నో థీమ్స్ పెట్టుకుంటున్నారా? మీకున్న రామ్ తక్కువగా ఉన్నప్పుడు అలా పెట్టుకోకండి. అలా కలలు చెదిరే థీమ్స్ పెట్టుకొని ర్యాం మీద, మీ మానిటర్ మీద భారం పడనిస్తున్నారా? అలా మీరు విద్యుత్ వినియోగం కూడా ఎక్కువగా చేస్తున్నారు. నిజానికి మీకు అలా డెస్క్ టాప్ థీం అవసరమనుకుంటే పెట్టేసుకోండి. అలా అవసరం లేని వాళ్లకి, థీమ్స్ పెట్టుకొని బోరుగా ఉన్నవాళ్ళకి, కళ్ళకి ఏమాత్రం శ్రమ కలిగించని థీం గురించి ఇప్పుడు చెబుతాను. ఒకసారి ట్రై చేసి చూడండి.

1. ముందుగా మీరు MS PAINT కి వెళ్ళండి. పైంట్ ని ఓపెన్ చేశారా?

2. ఇలా వస్తే పెయింట్ చేసే భాగాన్ని పెద్దగా చేయుటకి ఇందులో చూపినట్లుగా మూలన కర్సర్ ని పెడితే, బాణం గుర్తు కనిపిస్తుంది.


3. దాన్ని అలాగే నొక్కి కుడివైపున ఉన్న మూలకి లాగితే మొత్తం స్క్రీన్ పైంట్ వేసేందుకు అనువుగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ క్రింది ఫోటోలో చూపినట్లు పైన టూల్ బార్ లో ఉన్న Image ని నొక్కండి. ఒక మెనూ వస్తుంది. అందులో మీరు Invert colors అని నొక్కండి.


4. ఇప్పుడు పైంట్ చేసే భాగమంతా నల్లగా మారిపోతుంది (డిఫాల్ట్ కలరుగా నల్లరంగు ఉంటుంది కాబట్టి ). అంటే ఇలాగా అన్నమాట.  


5. ఇప్పుడు దాన్ని Save చెయ్యండి.

6. ఇప్పుడు దాన్ని Theme గా పెట్టుకోండి. ఇలా మీకు సిస్టం మీద కనిపిస్తుంది. 


బాగుంది కదూ.. ఇలా పెట్టుకోవడం వల్ల ఐదు లాభాలు ఉన్నాయి. 
  • మీకు విద్యుత్ ఆదా.
  • సరిక్రొత్తగా లుక్ గా మీ మోనిటర్ కనిపిస్తుంది.
  • మీ కంటికి ఇబ్బంది కలిగించదు.
  • తేలికగా మీ సిస్టం మీదున్న ఐకాన్స్ ని గుర్తించి, వాడుకోగలుగుతారు.
  • మీ మానిటర్ జీవిత కాలాన్ని పెంచిన వారూ అవుతారు..
ఇన్ని లక్షణాలు ఉన్న ఈ థీం ని వెంటనే పెట్టేసుకోండి.

ఒక చిలిపి ఆలోచన: ఈ థీం ని స్క్రీన్ సేవర్ గా వాడితే మీ మానిటర్ ఆఫ్ చేసినట్లుగా అనిపిస్తుంది. అలా చూపరులని హాశ్చర్యములో పడేయొచ్చు.

Wednesday, June 16, 2010

Manushulu maraali - Chekatilo kaaru..

చిత్రం : మనుషులు మారాలి (1969)
రచన : శ్రీ శ్రీ
సంగీతం : కె. వి. మహాదేవన్.
గానం : ఘంటసాల
***********************

పల్లవి :
చీకటిలో కారు చీకటిలో - కాలమనే కడలిలో
శోకమనే పడవలో - ఏ దరికో.. ఏ దెసకో
చీకటిలో కారు చీకటిలో - కాలమనే కడలిలో
శోకమనే పడవలో - ఏ దరికో.. ఏ దెసకో

చరణం 1:
మనసున పెంచిన మమతలు పోయే
మమతలు పంచిన మనిషే పోయే
మనసున పెంచిన మమతలు పోయే

మమతలు పంచిన మనిషే పోయే
మనిషేలేని మౌనములోనా
మనుగడ చీకటి మయమైపోయే
లేరెవరూ.. నీకెవరూ.. || చీకటిలో ||

చరణం 2:
జాలరి వలలో చేపావు నీవే
గానుగ మరలో చేరకువు నీవే
జాలరి వలలో చేపావు నీవే

గానుగ మరలో చేరకువు నీవే
జాలే లేని లోకంలోన
దారిలేని మనిషివి నీవే
లేరెవరూ.. నీకెవరూ.. || చీకటిలో ||

Friday, June 11, 2010

Anitha anitha o anithaa...

గాయకుడు, స్వరరచన : నాగరాజు.
**************************
నా ప్రాణమా నను వీడిపోకుమా నీ ప్రేమలో నను కరగనీకుమా
పదే పదే నా మనసే నినే కలవరిస్తుంది..
వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటుంది.
అనితా అనితా అనితా ఓ వనితా నా అందమైన అనిత
దయ కాస్తయిన నా పేద ప్రేమ పైన
ప్రాణమా నను వీడిపోకుమా
ప్రాణమా నను వీడిపోకుమని ప్రేమలో నను కరగనీకు మా..

నమ్మవుగా చెలియా నే నిజమే చెబుతున్నానని
ప్రేమ అనే పంజరాన చుక్కాని పడి ఉన్న కలలో కూడా నీ రూపం
నను కలవర పరచానీకు పాప నిన్ను చూడాలని కన్నీరే పెట్టే
నువ్వొకచోట నేనోకచోట నిను చూడకుండానే క్షణం ఉండలేనుగా
నా పాటకు ప్రాణం నేవేన రేపటి స్వప్నం నీవేనా
ఆశల రానివి నీవేనా గుండెకు గాయం చెయ్యకే
అనిత అనిత అనితా ఓ వనిత నా అందమైన అనిత
దయలేదా కాస్తైన న పేద ప్రేమ పైన

నా ప్రాణమా నను వీడిపోకుమని ప్రేమలో నను కరగానీకుమా
నువ్వే నా దేవతవని ఎదలో కొలువుంచా
ప్రతిక్షణం ధ్యానిస్తూ, పసిపాపలా చూస్తా
విసుగు రాని నా హృదయం ని పిలుపుకే ఎదురు చూసే
నిన్ను పొందని ఈ జన్మే నాకెందుకు అనిపించే
కరునిస్తావో, కాటేస్తావో నువ్వు కాదని అంటే నే శిలనవుతానే
నను వీడని నీడవు నీవే ప్రతి జన్మకి తోడువు నీవేనా
కమ్మని కలలు కూల్చి నన్ను వంటరివాడిని చెయ్యకే!

అనిత ఓ వనిత ఆ అందమైన అనిత
దయలేదా కాస్తయినా నా పేద ప్రేమ పైన
నా ప్రాణమా నను వీడిపోకుమా నీ ప్రేమలో నను కరగానీకుమా
పదే పదే నా మనసు నినే కలవరిస్తోంది.
వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటుంది.
అనిత అనిత అనిత ఓ వనిత
నా అందమైన అనిత
దయలేదా కాస్తైన నా పేద ప్రేమపైన

ఏదోరోజు నాపై ప్రేమ కలుగుతుందని ఒక చిన్ని ఆశ
నాలో చచ్చేంత ప్రేమ మదిలో
ఎవరు ఏమనుకున్నా కాలమే కాదన్నా (2) 
ఒట్టేసి చెబుతున్నా నా ఊపిరి ఆగు వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా
అనిత అనిత అనితా ఓ వనిత
అందమైన అనిత దయ లేదా నా కాస్తైన నా పేద ప్రేమ పైనా
Related Posts with Thumbnails