Tuesday, March 23, 2010

బ్లాగులను నిర్వహిస్తున్నవారికి చిన్న సలహాలు

బ్లాగులను మీరు నిర్వహిస్తున్నారా? అలా నిర్వహిస్తున్నవారికి నా అనుభవాల చిన్న సలహాలు:

  • విజిటర్ల సంఖ్య లేదా మీ బ్లాగు వీక్షకుల సంఖ్య అంటూ విడ్జెట్ ని పెట్టుకున్నాక దాన్ని ఎప్పుడూ మార్చకండి. అంటే పైన హెడర్ ని వీక్షకులు, అతిధులు, సందర్శకులూ, Guests.. అంటూ మార్చడానికి ప్రయత్నించకండి. అలా మారిస్తే మీ బ్లాగు కౌంటర్ మళ్ళీ మొదటినుండి మొదలవుతుంది. అంటే "00000000" నుండి మొదలు అన్న మాట. ఈ విషయం తెలీక ఒకసారి మధ్యలో నేను మారుద్దామని ప్రయత్నిస్తే.. అప్పటివరకూ ఉన్న ఐదువేల కౌంటర్ మళ్ళీ మొదటినుండి మొదలెట్టాల్సివచ్చింది.
  • అలాగే మీ  బ్లాగు పోస్టు క్రింద చదువరుల అభిప్రాయం తెలుసుకోవటానికి Reactions అంటూ పెట్టుకోండి. ఒకవేళ అలా పెట్టుకుంటే అందులో ఏమేమి పదాలు ఉండాలో ముందే నిర్ణయించి పెట్టుకోండి. మధ్యలో మారిస్తే, అంతకు ముందు ఎవరైనా వోటింగ్ చేసి ఉంటే అవన్నీ "0" గా మారిపోతాయి. (ఈ పోస్టు వ్రాయడానికి గల కారణమూ ఇదే.. ప్రపంచవ్యాప్తముగా  నా బ్లాగుని చూస్తున్నారుగా.. తెలుగులో ఉంటే అందరికీ అర్థం కాదేమోనని దాన్ని ఇంగ్లీషులో పెడితే వోటింగ్ ప్రతిస్పందన బాగుంటుందని, అలా  ఎక్కువమంది  వోటింగులో  పాల్గొంటే మరింత ప్రోత్సాహకరముగా ఉంటుందీ, నేను  పెట్టే   పోస్టుల మీద అభిప్రాయమూ నాకు తెలుస్తుందనీ, ఇంకా మంచి టపాలు పెట్టోచ్చనీ , స్పూర్తిగా ఉంటుందని.. కొద్దిసేపు  క్రిందట  Fair, Good, Very Good అని మారిస్తే అన్నీ "0" కి మారాయి. మార్చకముందు ఒక్కో పోస్టుకి 5-9 వరకూ వోట్లు పడ్డాయి.. అవన్నీ ఇప్పుడు గోవిందా.. గోవిందా..)
  • ఏ ఏ దేశాలనుండి ఎంతమంది చూస్తున్నారు అనే విడ్జెట్ పెట్టుకుంటే అదీ అంతే.. మొదటే హెడర్ ని ఎన్నుకోవాలి.. మధ్యలో మారిస్తే అదీ ... గోవిందా గోవిందా.. నేను ఒకసారి మార్చి - నాలుగు వేల పేజి వ్యూస్ కౌంటర్ పోగొట్టుకున్నాను.

ఇవి తప్ప మిగతావి మార్చిననూ ఏమీ కాదు.నాకు అనుభవములోకి వచ్చినవి పైవి మూడు మాత్రమే! ఇంకేమైనా వస్తే వెంటనే మీకు తెలియజేస్తాను.  (క్రొత్త) బ్లాగు సోదర, సోదరీమణులు ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోగలరు.

1 comment:

Anonymous said...

Good Post.

Related Posts with Thumbnails