Thursday, February 4, 2010

Kushalamaa neevu - Balipeetam



చిత్రం: బలిపీఠం (1975) 
రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
సంగీతం: చక్రవర్తి
గానం:  S. P. బాల సుబ్రహ్మణ్యం,  P. సుశీల. 


*****************
పల్లవి:
కుశలమా.. నీవు కుశలమేనా? -
మనసు నిలుపుకోలేక మరీ మరీ అడిగాను - అంతే
అంతే - అంతే..
కుశలమా.. నీవు కుశలమేనా? -
ఇన్నినాళ్ళు వదలలేక ఏదో ఏదో వ్రాశాను - అంతే
అంతే - అంతే..  // కుశలమా //

చరణం 1:
చిన్న తల్లి ఏమంది? - నాన్న ముద్దు కావాలంది
పాలుగారు చెక్కిలి పైన - పాపాయికి ఒకటి
తేనెలూరు పెదవులపైన - దేవిగారికి ఒకటి
ఒకటేనా.. ఒకటేనా.. - ఎన్నైనా.. ఎన్నెన్నో..
మనసు నిలుపుకోలేక - మరీ మరీ అడిగాను.. అంతే
అంతే.. అంతే..   // కుశలమా //

చరణం 2:
పెరటిలోని పూలపాన్పు - త్వర త్వరగా రమ్మంది.
పొగడ నీడ పొదరిల్లో - దిగులు దిగులుగా ఉంది.
ఎన్ని కబురులంపేనో - ఎన్ని కమ్మలంపేనో
పూలగాలి రెక్కలపైనా - నీలిమబ్బు పాయలపైనా
అందేనా.. ఒకటైనా.. - అందెనులే తొందర తెలిసెనులే
ఇన్నినాళ్ళు వదలలేక - ఏదో ఏదో వ్రాశాను అంతే
అంతే.. అంతే.. // కుశలమా //

No comments:

Related Posts with Thumbnails