Wednesday, February 24, 2010

తెలుగులో టైపు చెయ్యడం ఎలా? - 4

ఇప్పుడు గుణింతాలు చూద్దామా!.. ఇది బాగా చదివి, అర్థం చేసుకోండి.. బ్లాగు లోని ఈ ట్రాన్స్లేషన్ లో ఇంకా అభివృద్ధి చెయ్యాల్సివున్నది. నేను మొదట్లో ఇలా వ్రాస్తున్నప్పటికన్నా ఇప్పుడు బాగా మార్పు చెందింది. ఇంకా కొన్ని అక్షరాలూ, పదాల అమరిక పద్దతీ.. మార్చాలి. కొన్ని పదాలు ఇంకా టైపు చేయరావు.. వాటిని అభివృద్ధి చేస్తూ ఉండొచ్చు.. అలాంటివి ప్రస్తుతం వదిలేద్దాం! ఆ స్థానములో వాటికి తగిన సమాన అర్థ పదాలని వాడుకుందాం. సరేనా!.. మీరు సిద్ధమేనా.. 

ఇపుడు మీకు "" గుణింతం నేర్పిస్తాను.. దానిప్రకారముగా మిగతావన్నీ యధావిధిగా ఉంటాయి.

= ka అని టైప్ చేసి స్పేస్ బార్ నొక్కితే క అని వస్తుంది.
కా = kaa అని టైప్ చేసి స్పేస్ బార్ నొక్కితే కా అని వస్తుంది.
కి = ki అని టైప్ చేసి స్పేస్ బార్ నొక్కితే కి అని వస్తుంది.
కీ = kee అని టైప్ చేసి స్పేస్ బార్ నొక్కితే కీ అని వస్తుంది.
కు = ku అని టైప్ చేసి స్పేస్ బార్ నొక్కితే కు అని వస్తుంది.
కూ = koo అని టైప్ చేసి స్పేస్ బార్ నొక్కితే కూ అని వస్తుంది.
కె = ke అని టైప్ చేసి, స్పేస్ బార్ నొక్కి, బాక్ స్పేస్ నొక్కితే వచ్చే పదాల్లో కె ని ఎన్నుకోవాలి. 
కే = ke అని టైప్ చేసి స్పేస్ బార్ నొక్కితే కే అని వస్తుంది.
కై = kai అని టైప్ చేసి స్పేస్ బార్ నొక్కితే కై అని వస్తుంది.
కొ = ko అని టైప్ చేసి, స్పేస్ బార్ నొక్కి, బాక్ స్పేస్ నొక్కితే వచ్చే పదాల్లో కొ ని ఎన్నుకోవాలి.
కో = ko అని టైప్ చేసి స్పేస్ బార్ నొక్కితే కో అని వస్తుంది.
కౌ = kou అని టైప్ చేసి స్పేస్ బార్ నొక్కితే కౌ అని వస్తుంది.
కం = kam అని టైప్ చేసి స్పేస్ బార్ నొక్కితే కం అని వస్తుంది.
కః = kaha అని టైప్ చేసి స్పేస్ బార్ నొక్కితే కః అని వస్తుంది.

ఇలాగే మిగతా గుణింతాలూ చాలా వరకు వస్తాయి. ఇలా రోమన్ ఇంగ్లీష్ లో వ్రాసేటప్పుడు ముఖ్యముగా గమనించాల్సినది ఏమిటంటే - మనం ఎలా మాట్లాడుతామో అలాగే ఆ మాటల ఫోనెటిక్ / ఉచ్చారణ శబ్దాలని అక్షరాలలో వ్రాయాలి. అలా వ్రాయగలిగితేనే తెలుగులో వ్రాయడములో ఉత్తీర్ణులయినట్లు.. అబ్బో! అని భయపడకండి.. నేనున్నానుగా.. You don't fear.. Iam hear.

No comments:

Related Posts with Thumbnails