Tuesday, December 29, 2009

My friend, Philosphere, Guide, Wellwisher..

నన్నూ బాగా ప్రభావితం చేసినవారిలో ఇప్పటి వరకూ ముగ్గురు చనిపోయారు. వారిలో ఒకరు నా మామ (అని ముద్దుగా పిలుచుకునే) - రంగు శ్రీను మామ ఒకరు.. ఈ డిసెంబరు 31 న తన పట్టిన రోజుకి కొత్త బట్టలు కుట్టించుకొని, రడీగా ఉంచుకున్న తను, పుట్టిన రోజునకి కేవలం 5 రోజుల ముందు అంటే ఈ నెల 26 న ఓ రోడ్డు ప్రమాదములో చనిపోయాడు.. తెలంగాణా బందు వల్ల బస్ లో వెళ్ళే తను, మోటర్ సైకిల్ పైన గజ్వేల్ వద్ద తను మోటార్ సైకిల్ నడుపుతుండగా ఒక కుక్క రోడ్డు దాటబోయి, అవతలి వైపున రోడ్డులో ఒక లారీ రావటముతో ఆ కుక్క వెనుదిరిగి, ఈ మోటార్ సైకిల్ వెనకచక్రం క్రింద పడటముతో అ బండి మూడు పల్టీలు కొట్టింది.. అలా గాయపడిన తను చివరికి హాస్పిటల్ లో మరణించాడు..

నేను ఇక ఎవరిని మామా! అని ముద్దుగా పిలవాలి?
నాకిక ఎవరు క్రొత్త క్రొత్త విషయాలు చెబుతారు? 
నేనిక ఎవరితో  బైకు మీద లాంగ్ డ్రైవ్ కి వెళ్ళాలి? 
నాతో మిత్రుడికన్నా సన్నిహితముగా ఇంకెవరు ఉంటారు?
పర్సనల్ విషయాలు కూడా ఎవరితో షేర్ చేసుకోవాలి?
నేను పిలవగానే బైకు మీద 75 కిలోమీటర్లు లగేత్తుకొని నాకోసం వంటరిగా ఎవరొస్తారు ఇక?
మనం ఫ్యూచర్ లో ఇలా ఉండాలి అంటూ ప్రణాళికలు నాతో ఎవరు వేయిస్తారు?
తన సర్కిల్లో నాకో గొప్ప విలువను ఇక నాకెవ్వరు కలిపిస్తారు?
ఇలా బిజినెస్ చెయ్యాలి అని నాకెవరు చెబుతారు?
నన్నూ ఆర్థికముగా మంచి పోజీషను లోకి ఎవరు చేరుస్తారు?..
...
...
...










Saturday, December 26, 2009

Motivative Quotes



















Thursday, December 24, 2009

How to wash your car with one bucket of water - Video

మీ కారును ఒక్క బకెట్ నీటితో కడగాలి అని అనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో డౌన్లోడ్ చేసుకొని చూడండి.

వీడియో పేరు: How to wash your car with one bucket of water
సైజ్:  3. 04 MB
వీడియో సైజు: 24 సెకనులు

డౌన్లోడ్ కొరకు ఇక్కడ నొక్కండి:  How to wash your car with one bucket of water

Saturday, December 19, 2009

స్లిప్పులు - సినిమా డైలాగులు

సినిమా డైలాగులతో స్లిప్పుల గురించి చెప్పమంటే మన సినిమా తారలు ఎలా స్పందిస్తారో ఇందులో మీకు చెబుతాను..

మహేష్ బాబు: ఎన్ని స్లిప్పులేట్టమని కాదు అన్నయ్య... ఆన్సర్ రాసామా, లేదా?

Jr. NTR: ఈ కాలేజీ లో మొదట స్లిప్ పెట్టింది మా తాత. దొరికింది మా తాత. వాటితో మీరేంటి సార్ నన్ను పీకేది..

రాంచరణ్ తేజ: ప్రశ్నలు యెక్కువైన పరవాలేదు షేర్ఖాన్, స్లిప్పులు తక్కువ కానీకు..

ప్రభాస్: ఏందీ! ఒక స్లిప్ ఇవ్వండీ!... ఏందీ!! ఒక క్వొశ్చన్ చూపించండి!!.. మీ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంది.. ఏంటి? ప్లీజ్ అండీ చూపించండి..

సాయికుమార్: కనిపించే ఈ 3 పేపర్లు.. క్వొశ్చన్ పేపర్, మెయిన్ పేపర్, అడిషనల్ పేపర్ ఐతే… కనిపించని ఆ 4 వ పేపర్ యేరా - స్లిప్.

చిరు: నువ్వు 3 స్లిప్స్ పెట్టు.. మరో ముగ్గురికి 3 స్లిప్స్ పెట్టమని చెప్పు!!… అలా మొత్తం కాన్సెప్ట్స్ కవర్ చెయ్యొచ్చు…

బాలకృష్ణ: కుమారస్వామి, గోపాలస్వామి, నాగేంద్రస్వామి, నారాయణస్వామి.. ఇలా నలుగురు స్లిప్పులు పెట్టి దొరికిపోతే.. ఈసారి పుట్టేవాడు - స్లిప్పులుపెట్టేవాడు కానీ, దొరికేవాడు కాకూడని మొక్కి, మరీ పెట్టాడురా మా నాన్న! నాకు స్లిప్ స్వామి అనీ..

Tuesday, December 15, 2009

పరిచయం లోని రెండో మాట!

నాలుగు సంవత్సరాల క్రిందట ఒకరి పెళ్లి రిసెప్షన్ కి వెళ్లాను. వధూవరులని కలిసాక, నాకు తెలిసిన వారినీ కలిసాక.. విందులో పాల్గొన్నాను.. నేను మిత్రుడితో కలసి భోంచేస్తున్న సమయములో నా మిత్రుడు ఇంకొంత పెట్టించుకోవటానికి వెళ్ళాడు.

అదే అదను అనుకొని ఒక వ్యక్తి, టిప్పు టాపుగా ఉన్న నా వద్దకి వచ్చాడు. నేనైతే చాలా సేపుగా అతన్ని గమనిస్తున్నాను - ఏంటా? ఇతను నా వంకే చూస్తున్నాడని. అతడికి నలభై సంవత్సరాలు ఉంటాయి. కొద్దిగా పెద్దమనిషిలా ఉన్నాడు. అతను మీరు ఇక్కడే (ఈ టవున్ లోనే) ఉంటారా? అవునని సమాధానం ఇచ్చాను. రెండో ప్రశ్నగా - మీరు ఏమి చేస్తుంటారు? అని అడిగాడు. (నాకిక అంతా అర్థమయింది. అదేమిటో తర్వాత చెబుతాను) నా స్థాయిని తగ్గించి మామూలు పనివాడి స్థాయిని చెప్పాను. అలాగా అని తన గురించి కొంత వివరణ ఇచ్చి "ఒక్క క్షణం.." అని ప్లేటులో పదార్థాలు వడ్డించుకోవటానికి వెళ్ళాడు.. మళ్ళీ తిరిగి రాలేదు - ఇప్పటి వరకూ. తరవాత మా ఫ్రెండ్ వచ్చాడు. జరిగినదంతా చెప్పాను. చూసాను.. భలే చెప్పావురా.. అని మెచ్చుకున్నాడు. ఆ విందులో ఇక కావాలని అతడి ముందు నుండి తిరిగినా నేను కనపడనట్లే ప్రవర్తించాడు.

ఇలాంటివి విందుల్లో, పెళ్ళిళ్ళలో, మార్కెట్లలో.. చాలా సాధారణం. కాదనను. ఇలాంటి పరిచయాలు మన స్టేటస్, ఆస్థి, ఐశ్వర్యం, పలుకుబడి.. ఇత్యాది కారణాల మీద ఏర్పడుతుంటాయి. మనం ఎంతెంత బలముగా ఉంటే అంతగా పరిచయాలు ఉంటాయి. ఈ పరిచయాలు వల్ల మనకో గుర్తింపు వచ్చిందనీ, అందరూ మన ప్రాపకం కోసం అర్రులు చాస్తున్నారనీ.. అంటూ ఏవేవో భ్రమల్లో తేలిపోతాము. కాని ఇలాంటి పరిచయాల వల్ల మనకు ఒరిగేదేమీ లేదని, వాళ్ళ స్వలాభానికి మనతో స్నేహం చేసారని.. - అని మన హోదానో, పరపతో, ఆస్థియో తగ్గినప్పుడు మనకి స్పష్టముగా అర్థమవుతుంది. అందరూ "మనల్ని వాళ్ళ చేతులు ఎర్రగా పండటానికి పెట్టుకున్న గోరింటాకులా"  తయరయ్యామని అప్పటికి గానీ అర్థం కాదు.  అవతలివారు మనకెలా ఉపయోగపడతారూ! అనుకుంటూ - లెక్కలు వేసుకుంటూ చేసే ఈ పరిచయ కార్యక్రమాలు మనకేమీ ఒరగాపెట్టవు సరికదా మనల్ని వారి అవసరాలకై వాడుకునేదే ఎక్కువ. ఇలాంటివారిని మనం తేలికగా గుర్తుపట్టచ్చు.. నా అనుభవాల్లన్నిటినీ పరిశీలనా దృష్టితో చూస్తే - చివరికి తేలింది ఏమిటంటే - ఒకరు మనకి పరిచయమైనా కొత్తలో కుశలపు మాట  (హాయ్,  హలో,  బాగున్నారా?,  భోంచేసారా?,  మిమ్మల్ని అక్కడ చూసాను.. ) తరవాతి మాటగా మిమ్మల్ని మీరు ఏమి చేస్తుంటారు అని అడిగారు అనుకోండి.. అంతే! ఆ మనిషి మిమ్మల్ని మీ హోదా, పరపతి.. కోసం మీతో చనువు పెంచుకోవాలని అనుకుంటున్నాడు  అని డిసైడ్ అవండి. అలాంటి వారు మీకు అంతగా నప్పరు.. స్నేహం అంటే - ఇవ్వడాలు,  పుచ్చుకోవడాలు  అంటూ  ఉంటేనే  బాగుంటుంది. అంతేకాని మనం ఇస్తూ పోతుంటే... చివరికి మనకేమీ మిగలదు.  అప్పుడు  మనం - జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది.. అని సోలోగా పాడుకోవాల్సివస్తుంది.

ఇక్కడ చిన్న సవరణ: ఇలాంటివారు అమాయకులు.. మీరు నమ్మకున్నా ఇది నిజం! ఇలా అడిగి తొందరగా బయట పడతారు.. కాని ఇంకొంతమంది - పులిగుహలోకి వెళ్లేముందు చేసే "రెక్కి" (ఆ గుహ ఎంత పొడవు, ఎంత వెడల్పు, ఎంత ఎత్తు, లోపల ఎన్ని పులులు ఉన్నాయ్, అందులో ముసలివి ఎన్ని, వయసువి ఎన్ని.. అనే పద్దతిలో) లా ముందే అన్నీ ఇతరులనుండి మన గురించి  తెలుసుకొని గోముఖ వ్యాఘ్రాల్లా వస్తారు చూడండి.. వారిని ఏమాత్రం పసి కట్టలేం! సో, బీ కేర్ఫుల్!

Sunday, December 13, 2009

Annapoorna sthrotram

అన్నపూర్ణ  స్త్రోత్రం - ఈ  స్త్రోత్రాన్ని మొదటగా మా బంధువుల ఇంట్లో 1-జనవరి-2007 న ప్రాతఃకాలము   సమయములో విన్నాను. విన్న సమయం, గాయని గొంతులోని మార్ధవమో గాని ఆ పాట మరీ మరీ బాగనిపించి, మీకూ అందించాలన్న కోరికతో ఇక్కడ పెట్టడం జరిగింది. గాయని ఎవరో గాని చాలా బాగా పాడారు. ఈ పాటని విన్నాక మీ అభిప్రాయాలను తెలియచేస్తారని ఆశిస్తున్నాను.

డౌన్లోడ్ కొరకై ఈ ప్రక్కన ఉన్న లింక్ ని నొక్కండి:  Annapurna Sthrotham (3.04 MB) 

Saturday, December 12, 2009

Jai Janardhanaa Radhikaa Pathe

"జై జనార్ధనా కృష్ణా రాధికా పతే.." అనే పాట మూడు సంవత్సరాల పాప  తన కమ్మని  గొంతుతో పాడింది. ఆ స్వరం లోని మార్దవం, హాయ్ పిచ్నెస్స్, ఆరోహణ, అవరోహణలు.. మంత్రముగ్ధులని చేస్తుంది అనడములో యేమాత్రం సందేహం లేదు. ఈ పాట ఇప్పుడు మీకోసం :

గేయం పేరు: జై జనార్ధనా కృష్ణా రాధికా పతే 


గేయం పరిమాణము: 4.77 MB 


బిట్ రేట్: 128  kbps 


టైపు: MPEG లేయర్ 3 (MP3) 


సమయం: 5 నిముషాల 12 సెకనులు 


విడుదల సంవత్సరం: 2004 

ఈ MP3 పాట మిమ్మల్ని ఎంతగానో అలరిస్తుందని నా నమ్మకం.
డౌన్లోడ్ కొరకై ఆ పాట లింక్:  Jai Janardhana Radhika Pathe - MP3 (3Yrs. Baby)

Friday, December 11, 2009

26/11 తాజ్ ఘటన - మీకు తెలియనివి..

26-నవంబర్-2008 న ముంబాయి లోని తాజ్ హోటల్ మీద పాకిస్తానీ తీవ్రవాద ముష్కరుల దాడి జరిగిందని మీకు తెలుసు.. అందులో దాడి గురించిన సంఘటనలూ, కసబ్ అనే తీవ్రవాది గురించి, అతన్ని ఎలా పట్టుకున్నారు, ఎవరు ఎలా ఎలాంటి పాత్ర పోషించారో అన్నీ మీకు తెలుసు.. మళ్ళీ అవి మీ మదిలో పునరావృతం చేయలేను.. కాని ఈ ప్రపంచానికి తెలియని ఒక విషయం -
* ఆ తాజ్ హోటల్ లో సిబ్బంది అప్పుడు ఏమి చేసారు?
* వారు తీవ్రవాద దాడిని ఎలా ఎదురుకున్నారు?
* వారు తీసుకున్న చర్యలేమిటి?
* లోపల ఉన్న కష్టమర్లని ఎలా రక్షించారు?
* తాజ్ మేనేజ్మెంట్ వారిపట్ల తీసుకున్న తీసుకున్న నిర్ణయాలు ఏమిటి?
... .... ... ఇవన్నీ బయట ప్రపంచానికి తెలీవుగా! ఊ.. ఇప్పుడు మీకు ఆ విషయం గురించే చెబుదామని ఇదంతా.. ఈ క్రింది లింక్ నుండి 199KB ఉన్న చిన్న PDF ఫైల్ ని డౌన్ లోడ్ చేసుకొని చూడండి. http://www.megaupload.com/?d=62ND303Z
తప్పకుండా చదవండి.: October_10-The_TAJ_story-unknown..pdf

Wednesday, December 9, 2009

Aarya-2 : Uppenantha ee premakee..


చిత్రం: ఆర్య-2 (2009)
రచన: బాలాజీ
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
గానం: K. K
**************
పల్లవి:
ఉప్పెనంత ఈ ప్రేమకీ - గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికీ - భాషే ఎందుకో
తీయనైన ఈ బాధకీ - ఉప్పు నీరు కంట దేనికో
రెప్పపాటు దూరానికే - విరహం ఎందుకో
ఓ నిన్ను చూసే ఈ కలలకీ - లోకమంతా ఇక ఎందుకో
రెండు అక్షరాల ప్రేమకీ - ఇన్ని ఎఫెక్షన్లెందుకో
ఐ లవ్ యు - నా ఊపిరి ఆగిపోయినా
ఐ లవ్ యు - నా ప్రాణం పోయినా
ఐ లవ్ యు - నా ఊపిరి ఆగిపోయినా
ఐ లవ్ యు - నా ప్రాణం పోయినా // ఉప్పెనంత //

చరణం 1:
కనులలోకొస్తావు - కలలు నరికేస్తావు
సేకనుకోసారైనా చంపేస్తావు -
మంచులా ఉంటావు మంట పెడుతుంటావు - వెంటపడి నా మనసు మసి చేస్తావు
తీసుకుంటే నువ్వు - ఊపిరి పోసుకుంట ఆయువే చెలీ
గుచ్చుకోకు ముళ్ళలా - మరే గుండెల్లో సరాసరి
ఐ లవ్ యు - నా ఊపిరి ఆగిపోయినా
ఐ లవ్ యు - నా ప్రాణం పోయినా // ఉప్పెనంత //

చరణం 2:
చినుకులే నిను తాకి - మెరిసిపోతానంటే
మబ్బులే పోగేసి కాల్చేయ్యనా -
చిలకలే నీ పలుకు తిరిగి పలికాయంటే - తొలకరే లేకుండా పాతేయ్యనా
నిను కోరి పూలు తాకితే - నరుకుతాను పూలతోటనే
నిన్ను చూస్తే ఉన్నచోట - తోడేస్తా ఆ కళ్ళనే
ఐ లవ్ యు - నా ఊపిరి ఆగిపోయినా
ఐ లవ్ యు - నా ప్రాణం పోయినా // ఉప్పెనంత //

Sunday, December 6, 2009

మిత్రుడు - అప్పు

మొన్న నెట్ సర్ఫింగ్ లో ఉన్నప్పుడు నా మిత్రుడు ఒకరు వచ్చారు.. చాలారోజుల తరువాత వచ్చాడు అంటే ఓ మూడు సంవత్సరాల తరవాత గుర్తుపెట్టుకొని మరీ వచ్చాడు.. అదీ లోకల్ లోనే ఉండి.. ఇపుడు అతను బేకరీ షాపు మైంటైన్ చేస్తున్నాడు. అతను నాకు చిన్నప్పటి - అంటే అ, ఆ, ఇ, ఈ నేర్చుకున్నప్పటి నుండీ ఇప్పటివరకూ (ఇక ముందు కూడా) నాకు మంచి స్నేహితుడు.. చెప్పాలంటే చాలా ఉంది కాబట్టి ఇక అసలు పాయింట్ లోకి వచ్చేద్దాం!

కాసిన్ని కుశల ప్రశ్నలయ్యాక - "చెప్పరా!ఏమి విశేషమో!.." అని అడిగాను.
"నాకో పదివేలు కావాలిరా! చేబదులు.. కొద్దిరోజుల్లో ఇచ్చేస్తాను.. " అని అన్నాడు.
"ఎందుకురా! ఇంత అవసరం.." అని అడిగా.
"అవసరం రా!.." ముక్తసరిగా అన్నాడు.
"ప్లీజ్! ఏమీ అనుకోకు.. నేను రేనోవేషన్ పనిలో ఉన్నాను.. ఇంకా వారం రోజులు అయితే ముగుస్తుంది. నాకే అవసరం ఉంది.. ఏమీ అనుకోకు.. వేరే వారిని ప్రయత్నించరాదూ.. " అని బదులిచ్చాను..
ఎలాగైనా చెయ్యరా.. అని తను అంటే "అయితే చెయ్యనారా! నేను ఆ పనిలో లేకుంటే ఇచ్చేవాడినిగా.. ఈ రోజే కొన్ని సామానుల కోసం షాపింగ్ చెయ్యాలి" అని నటించాను..
తరవాత అతడిని ఖాళీ చేతులతో పంపించేసాను..
బాల్య మిత్రుడూ, ఆపదలో ఉండి వచ్చిన వాడూ, బాగా తెలిసిన మిత్రుడూ.. అయిన వాడి ముందు అలా నటించడములో నా గతంలో జరిగిన సంఘటనయే కారణం.

అతనికి ఓ పని మీద నా దగ్గరికి వస్తే, అది చేసిచ్చాను.. అప్పుడు - వీడు నామిత్రుడని తగ్గించి లెక్కవేసినా (ఆ విషయం మరీ పేపర్ మీద వేసి చూపించాను) అతడు ఆ పనిలో నాకు మూడున్నర వేల రూపాయలు నాకు బాకీ పడ్డాడు.. నేను సాధారణముగా నా స్నేహితుల్లో మొదటిసారి ఏదైనా అడిగితే (ఇచ్చేది అయితే) ఇచ్చేస్తాను.. అవతలివారు ఎంత త్వరగా తిరిగి ఇస్తారన్న దాని బట్టి వారితో నా మిగతా స్నేహభంధం సాగుతుంది. తరవాత ఇస్తానని చెప్పిన అతను ఎన్నిసార్లు అడిగినా అంతే! - రేపూ రేపూ అని జరపటం! నా ముందే డబ్బులు లెక్కపెడతాడు. వారికీ, వీరికీ ఇస్తాడు కాని నాకు మాత్రం ఇవ్వడు. నాముందే ATM నుండి డబ్బులూ డ్రా చేస్తాడు - కాని నా బాకీ తీర్చడు. చాలా కాలం అడిగి ఊరుకున్నాను.

ఇలా కాదనుకొని ఫ్రెండ్స్ అంతా కలసి టూర్ వెడితే ఆ డబ్బులు అందులో సర్దుదామని ఎంత ప్రయత్నించినా ఊహు.. వీడు నాకు మొగుడైనాడు. ఇక ఇలా కాదనుకొని పిల్లలపుట్టిన రోజులకి, ఇంట్లో బంధువులు వస్తే.. వెళ్లి ఆ పురుగుల మందులూ.. అవేనండీ కూల్ డ్రింకులూ, కేకులూ తెచ్చుకొనే వాడిని.. ఆ తెచ్చుకున్న వాటిని వాడి బుక్ లో, నా బుక్ లో రాయించుకునే వాడిని.

ఇలా మూడు సంవత్సరాలు పైగా "కష్టపడి" నా మూడున్నర వేలూ తీసుకున్నాను.. ఆ మూడున్నర వేలు వదిలేసేవాడిని కాని, ఇలాంటి మొండివాళ్ళని ఊరికే వదిలేయబుద్ది కాలేదు. అందుకే అలా చేశాను.. అలా అష్టకష్టాలు పడీ మరీ నావి తిరిగి పొందాను.. ఇప్పుడు వచ్చి అడిగితే ఎలా ఇచ్చేది? అందుకే కుదరదని చెప్పాను..

ఒకవేళ ఇప్పుడు ఇచ్చి ఉంటే - అప్పుడే మూడున్నర వేలకి మూడు సంవత్సరాలు చేసాడు - ఇప్పుడు పదివేలకి - పది సంవత్సరాలు మళ్ళీ "కష్టపడాలేమో!".. నాకు అంత ఓపిక లేదు..


ఈ సంఘటన వల్ల మీకు చెప్పేది ఏమిటంటే ఒకసారి మిత్రులని నమ్మండి.. వారికి అన్ని అవకాశాలు ఇచ్చి చూడండి. అప్పటికీ అతడు దారిలోకి రాకపోతే ఇక వాడి ఖర్మ అనుకొని వాడిని వదిలేయండి. నిజమైన స్నేహితుడు అంటే మనల్ని అప్పు అడగడు, ఒకవేళ అడిగినా తల తాకట్టు పెట్టి మరీ తీర్చేస్తాడు. చిన్న విషయం వద్ద ఇన్ని రోజుల.. సారీ! ఇన్ని సంవత్సరాల స్నేహం ని చిన్న కారణముతో చెడగొట్టుకోవటం ఎంత మూర్ఖత్వం!

Tuesday, December 1, 2009

బస్ లో వాంతి

మొన్న ఓ పనిమీద బస్ లో బయలుదేరాను. మార్గ మధ్యమములో ఒక జంట నా ప్రక్క సీట్లోకి వచ్చి కూర్చున్నారు. వారికి ఐదు-ఆరు సంవత్సరాల పాప. నేను ఐపాడ్ లో పాటలు వింటూ కళ్లు మూసుకున్నాను.. వారేమో మెలుకువగానే ఉన్నారు.

ఇంతలో అలజడి. ఏమిటా అని చూస్తే ఆ పాప వాంతి వస్తున్నట్లుంది.. బలవంతం మీద ఆపుతున్నారు. తరవాత జరిగేది ఏమిటో అర్థమయ్యింది.. చప్పున గుర్తుకు వచ్చింది. నా బాగ్ జిప్పు తెరచి అందులో ఓ మూలనుంచిన ఒక ప్లాస్టిక్ కవర్ తీశాను.. వారికి ఇచ్చి పాపకి మూతి వద్ద పట్టమన్నాను. ఆ పాప వాంతి చేసుకుంటే వారు పట్టారు. నా సమయస్ఫూర్తి వల్ల బస్ లో సీట్ పాడుకాకుండా కాపాడాను, అలాగే వారికి ఉపయోగపడ్డాను - అనే సంతోషముతో కాసేపు కునుకు తీశాను..

తరవాత కాసేపు తరవాత మెలకువ వచ్చి చూస్తే వారు లేరు.. మధ్యలో దిగారేమోనని అనుకున్నాను. కాని దిగలేదు.. ఇంకో సీట్లోకి వెళ్లి కూర్చున్నారు. ఇదేమిటబ్బా అని అనుమానముతో నా సీటు పక్కన చూసాను.. అప్పుడు అర్థం అయ్యింది.. ఆ వాంతి కవరుని అక్కడే వదిలేయటముతో అందులోని ద్రవమంతా బయటకి వచ్చింది. వాళ్ళని తిట్టాలంత కోపం వచ్చింది..

ఏమిటీ మనుష్యులు.. ఇంత నిరక్ష్యం. -అని. ఆ పాపకి అంత పొద్దున్నే టిఫిన్ కుక్కడమెందుకు? వాంతి వస్తుందన్న జ్ఞానంతో ఒక కవరును వెంట తెచ్చుకోవాలన్న కనీస జ్ఞానం లేదు. వెంట తెచ్చుకోలేదు.. పోనీ ఒకరిస్తే దాన్ని తీసుకునేటప్పుడు థాంక్స్ చెప్పాలన్న తెలివి లేదు. సరే అదంతా పోనీ!.. వాంతి తరవాత ఆ కవరుని బస్ కిటికీ లోంచి బయట పడేస్తే అయిపోయేదిగా ఒకవేళ పడేయడానికి సమయం లేకుంటే ఆ కవరుని ముడి వేసి అలాగే పెడితే సరిపోయేదిగా...

మొత్తానికి నేను కవరు ఇవ్వకుండా ఉండి ఉంటే, వాంతి పరిస్థితి ఎలా ఉండేదో ఇచ్చాక కూడా అలాగే జరిగినందుకి ఏమనాలో నాకు అర్థం అవటం లేదు..
Related Posts with Thumbnails