Saturday, September 19, 2009

ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్ల...




ఇప్పుడు నేను రాస్తున్న గేయ రచన సినిమా పాట కాదు.. భారతదేశము లోని ఒక రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో ఒక జిల్లా అయిన కరీంనగర్ లోని గోదావరిఖని పట్టణంలో ఉంటున్న "మధుప్రియ" అనే చిన్నారి తనకు తానుగా రాసుకొని, పాడిన పాట ఇది. ఈ పాటలోని అర్థము మనల్ని జీవితకాలం వెంటాడుతుందా! అన్నట్లుగా ఉంటుంది అనడములో ఏమాత్రం అతియోశక్తి లేదు. ఈ పాట పాడిన పాప గొంతులోని జీర, పిచ్, హై పిచ్నెస్.. మనల్ని ఈ పాటని అంత తొందరగా మరచిపోనీయవు..

గేయ రచన:
ఆడపిల్లనమ్మా నే ఆడపిల్లన్నాని
బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా..
ఆడపిల్లనమ్మా నే ఆడపిల్లన్నాని బాధపడకమ్మా
నీవు దిగులు చెందకమ్మా..

చరణం 1:
అష్టమిలొ పుట్టాననీ అమ్మా జెష్టదాన్నంటున్నరా
ఈ పాడు లోకములొ అమ్మా హీనంగ చూస్తున్నరా
ఆడదని అంటున్నరా అమ్మా పాడు అని తిడుతున్నరా
అష్టమిలొ పుట్టిన క్రిష్ణుడ్నేమో దేవుడని అంటున్నరా
నన్నేమో పాడుదని తిడుతున్నరా..
//ఆడపిల్లనమ్మా నే ఆడపిల్లన్నాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా//

చరణం 2:
పలక బలపం బట్టి అమ్మా బడికీ పోతుంటే
ఆడపిల్లయినందుకు అమ్మా సదువెందుకంటున్నరా
సదువెందుకంటున్నరా అమ్మా సందెందుకంటున్నరా
సదువుల తల్లీ సరస్వతి ఆడదె కదమ్మా
నాకేమో సదువెందుకంటున్నరా
//ఆడపిల్లనమ్మా నే ఆడపిల్లన్నాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా//

చరణం 3:
ఎదిగేటి నన్ను చూసి అమ్మా ఏడుస్తున్నావా
లక్షల కట్నాలు అమ్మా ఎట్లా ఇస్తాననీ
కడుపులోనె ఆడబిడ్డంటె అమ్మా కరగదీస్తున్నరా
ఆడబిడలను వద్దనుకుంటే సృష్టికి మూలమేది
రేపేమో జగతికి మార్గమేదీ

ఆడపిల్లనమ్మా నే ఆడపిల్లన్నాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా..
బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా.. బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా..

No comments:

Related Posts with Thumbnails