Friday, September 18, 2009

Tolisaari mimmalni - Srivariki premalekha


చిత్రం: శ్రీవారికి ప్రేమలేఖ (1984)
సంగీతం: రమేష్ నాయుడు.
పాడిన వారు: S. జానకి.
రచన: వేటూరి సుందర రామమూర్తి.
అభినయం: నరేష్, పూర్ణిమ
****************
సాకీ:
శ్రీమన్ మహారాజ - మార్తాండ తేజా
త్రియానంద భోజా - మీ శ్రీచరణాంభోజములకు
ప్రేమతో నమస్కరించి.. మిము వరించి..
మీ గురించి ఎన్నో కలలు గన్న - కన్నె బంగారూ
భయముతో.. భక్తితో - అనురక్తితో
సాయంగల విన్నపములూ!
సంధ్యారాగం చంద్రహారతి - పడుతున్న వేళ
మసక చీకటి మధ్యమావతి - పాడుతున్న వేళ
ఓ శుభ ముహూర్తాన..

పల్లవి:
తొలిసారి మిమ్మల్ని చూసింది - మొదలు
కదిలాయి మదిలోన ఎన్నెన్నో కధలూ.. ఎన్నెన్నో కధలూ
జో అచ్యుతానంద జో జో - ముకుందా
లాలి పరమానంద రామ గోవిందా - జో జో

చరణం 1:
నిదుర పోని కనుపాపలకు - జోల పాడలేక
ఈల వేసి చంపుతున్న - ఈడునాపలేక
ఇన్నాళ్ళకు రాస్తున్నా.. ఈ ప్రేమ లేఖ! //తొలిసారి మిమ్మల్ని//

చరణం 2:
ఏ తల్లి కుమారులో - తెలియదు గాని
ఎంతటి సుకుమారులో - తెలుసు నాకూ
ఎంతటి మగధీరులో - తెలియలేదు గాని
నా మనసును దోచిన - చోరులు మీరూ
వలచి వచ్చిన వనితను - చులకన చేయక
తప్పులుంటే మన్నించి - ఒప్పులుగా భావించి
చప్పున బదులివ్వండీ.. చప్పున బదులివ్వండి! //తొలిసారి మిమ్మల్ని //

చరణం 3:
తలలోన తురుముకున్న - తుంటరి మల్లే
తలపులలో ఎన్నెన్నో - మంటలు రేపే.. ఆహ్! అబ్బా!!
సూర్యుడి చుట్టూ తిరిగే భూమికి - మల్లే
నా ఊర్పుల నిట్టూర్పుకు జాబిలి వాడే.. ఆహ్! ఆహ్!!
మీ జతనే కోరుకుని లతలాగా - అల్లుకునే
నాకు మీరు మనసిస్తే - ఇచ్చినట్టు మాటిస్తే
ఇప్పుడే బదులివ్వండీ.. ఇప్పుడే బదులివ్వండి! // తొలిసారి మిమ్మల్ని//

2 comments:

Vinay Chakravarthi.Gogineni said...

whats the meaning of saki...

can u plz remove word verification

Raj said...

సాకీ అంటే ఒక పాట ముందు వచ్చే వచన/పద సాహిత్యాన్నీ, లేదా కూనిరాగాన్ని "సాకీ" అంటారు.

Related Posts with Thumbnails