Monday, March 2, 2009

Ee reyi teeyanidi - Chitti chelllu



చిత్రం: చిట్టి చెల్లెలు (1970)
రచన: డా సి. నారాయణరెడ్డి
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
గాయకులు: S.P. బాలు, P.సుశీల
************************

పల్లవి:
ఈ రేయి తీయనిది - ఈ చిరుగాలి మనసైనదీ
ఈ హాయి మాయనిదీ - ఇంతకు మించి ఎమున్నదీ..
ఏవేవో కోరికలు - ఎదలో ఝుమ్మని అంటున్నవి
ఆ కొంటె మల్లికలు - అల్లన దాగి వింటున్నవీ

చరణం 1:
పన్నీటి తలపులు నిండగా ఇన్నాళ్ళు కలలే పండగా (2)
చిన్నారి చెలియా అపరంజి కలువ
చేరాలి కౌగిట జిలిబిలి నగవుల // ఏవేవో కోరికలు //

చరణం 2:
పరువాలు పల్లవి పాడగా నయనాలు సయ్యాటలాడగా (2)
నిను చేరుకోగా నును మేని తీగ
పులకించి పోయెను తొలకరి వలపుల // ఈ రేయి తీయనిదీ //

చరణం 3:
ఎన్నెన్ని జన్మల బంధమో ఏ పూల నోముల పుణ్యమో (2)
నిను నన్ను కలిపె నీ నీడ నిలిపె
అనురాగ సీమల అంచులు దొరికే // ఈ రేయి తీయనిదీ //

2 comments:

devika said...

mee blog chala bagundandee."telugu literature in web" orkut community lo mee blog gurinchi chusanu.manchi rachanalani mee nunchi inka asisthunnamu.

Raj said...

Thanks.

Related Posts with Thumbnails